Millennium Tower-B In VIzag: సీఎం జగన్ దూకుడు, మూడు రాజధానుల అంశంపై మరింతగా ముందుకు, విశాఖలో మిలీనియం టవర్-బి నిర్మాణానికి నిధులు విడుదల, కర్నూలుకు తరలిన విజిలెన్స్ కమిషనరేట్
టవర్-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ సోమవరం ఉత్తర్వులు జారీచేశారు. టవర్-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. విశాఖ మిలీనియం టవర్స్‌లోనే సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Visakhapatnam, Febuary 4: మూడు రాజధానుల అంశం ( 3 Capitals Row) మీద ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు చోట్లకు ప్రభుత్వ కార్యాలయాలను విస్తరిస్తున్నారు. ఇప్పటికే కర్నూలులో (Kurnool) న్యాయరాజధానిని ఏర్పాటు చేసే దిశగా జనవరి31న ఆదేశాలు జారీచేసింది. విశాఖలో ఏపీ సీఎం సందడి
కర్నూలులో జ్యూడిషియల్ రాజధాని (judicial capital) ఏర్పాటులో భాగంగా ఏపీ విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాల్ని తరలిస్తూ గత శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆఫీసుల్ని కర్నూలుకు తరలించడానికి తగిన భవనాలను గుర్తించాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్, కర్నూలు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని మధురవాడ వద్ద ఉన్న రుషికొండలో (Rushikonda) మిలీనియం టవర్-బి నిర్మాణానికి (Millennium Tower-B In VIzag) ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల చేసింది. టవర్-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ సోమవరం ఉత్తర్వులు జారీచేశారు. టవర్-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. విశాఖ మిలీనియం టవర్స్‌లోనే సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం
నూతనంగా చేపట్టబోయే టవర్ ఐటి, ఐటి అనుబంధం రంగాల అభివృద్ధికి ఉపయోగంగా ఉంటుందని ఈ ఉత్తర్వులో పేర్కొన్నప్పటికీ పరిపాలన రాజధాని (Executive capital) విశాఖకు మారితే సచివాలయం ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులతోపాటు ఉన్నతస్థాయి అధికారులు ఈ భవనాలను ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం. సచివాలయ అవసరాల కోసమే నూతనంగా టవర్-బిని నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం
రుషికొండ ఐటి సెజ్‌లో ఉన్న ఈ టవర్ స్టార్టప్ విలేజ్ పక్కనే ఉంది. రెండు మిలీనియం టవర్లలో సదుపాయాలు, నిర్మాణానికి సంబంధించి రూ.65.12 కోట్లు అవసరం అవుతాయని ఎపిఐఐసి గతంలో ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన అనంతరం నిధులు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి
ఇదిలా ఉంటే సెలక్ట్ కమిటీ రిపోర్టు వచ్చే వరకూ కమిషనరేట్లను తరలించొద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ తరలిస్తే అయ్యే ఖర్చును ఆయా శాఖల కమిషనర్ల నుండి వసూలు చేస్తామని పేర్కొంది. అయినా ఏపీ ప్రభుత్వం (AP GOVT) విజిలెన్స్ కమిషనరేట్‌ను తరలిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పెండిగ్‌లో ఉంది. కాగా శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది.
మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే రాజధాని తరలింపుపై హైకోర్టులో (AP HighCourt) పిటిషన్లు కొనసాగుతున్నాయి. కోర్టు కూడా ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించొద్దని ప్రభుత్వానికి సూచించింది. తాజాగా కర్నూలుకు పలు ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించడాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు (Amaravathi Farmers) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని కూడా చేర్చాలని కోరారు.
ఇదిలా ఉంటే గతంలోనూ చంద్రబాబు (Chandrababu) సర్కారు పోలవరం ప్రాజెక్టు ((Polavaram Project) నిర్మాణం విషయంలోనూ, అమరావతి రాజధాని నిర్మాణం విషయంలోనూ ఇదే దూకుడును ప్రదర్శించింది. అమరావతి నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణాన్ని కొనసాగించింది. అలాగే పోలవరం ప్రాజెకు నిర్వాసితుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నా, పర్యావరణ అనుమతులు రాకున్నా నిర్మాణాలను కొనసాగించింది. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే దూకుడులో రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ దిశగా ఏపీ సీఎం వడివడిగా అడుగులు వేస్తున్నారు.