టీడీపీ సీనియర్‌ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆటోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లిలో శనివారం(నవంబర్‌ 23) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందడంపై జేసీ స్పందించారు.

‘ఆటోలను నిషేధించాలి. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఆటోల వల్లే ప్రతి నెలా 60 మంది చనిపోతున్నారు. తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా సరిపోదు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ విషయం చంద్రబాబునాయుడుకు అధికారులు చెప్పాలి’అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

విద్యార్దినిపై శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దారుణం, తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయ‌పరిచిన సత్యనారాయణ

MLA JC Prabhakar Reddy Interesting Comments comments-auto-accidents

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)