Standing while eating (Credits: X)

నేటి బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తింటూ ఉంటారు. ఇది సాధారణంగా అనిపించినప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది మన జీర్ణ క్రియను మన ఆరోగ్యాన్నిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం వల్ల మనకు ఆరోగ్యానికి అనేక రకాల హాని జరుగుతుంది.

గ్యాస్ కడుపు ఉబ్బరం- సరిగ్గా ఆహారాన్ని నమ్మలకుండా తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. నమలకుండా తినడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇది పేగుల్లో గ్యాస్ అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

గుండెల్లో మంట- ఆహారాన్ని సరిగ్గా నమ్మలకుండా తినడం వల్ల అది జీర్ణం కాక మళ్ళీ రిఫ్లెక్షన్ ద్వారా బయటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు గుండెల్లో మంట ఏర్పడుతుంది దీన్ని ఇది యాసిడ్ రిఫ్లెక్షన్ అని అంటారు.

Health Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా,

బరువు పెరుగుతారు- త్వరగా తినడం ద్వారా మన మెదడు సంకేతాలను ఇవ్వదు. ఎప్పుడైనా సరే ఆహారాన్ని నెమ్మదిగా తినడం ద్వారా ఏర్పరుస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి నమిలి తినడం ద్వారా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

పోషకాలు అందవు- ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తినడం ద్వారా అది సరిగ్గా జీర్ణం అవ్వదు. అటువంటి అప్పుడు ఆహారంలో ఉన్న పోషకాలు మన శరీరం గ్రహించదు.

నోటి ఆరోగ్యం- మనము నెమ్మదిగా నమలడంతో తినడం ద్వారా లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. అంతేకాకుండా ఇది దంతాలను చిగుళ్ళను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఆహారం జీర్ణం కావడానికి సులభమైన మార్గాలు- ఆహారాన్ని తినేటప్పుడు ప్రతి ముద్దను కూడా 20 నుంచి 30 సార్లు నమిలే అలవాటు చేసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

-భోజనానికి భోజనానికి మధ్య కాస్త విశ్రాంతి తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది.

-ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా పెద్దపెద్ద ఆహారపు ముద్దలను మింగడానికి ప్రయత్నించవద్దు నెమ్మదిగా నమ్ములుతో తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

-నీటిని తాగడం అలవాటు చేసుకోవడం వల్ల జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి