క్రీడలు
IPL 2020: విదేశాల్లో ఐపీఎల్ 2020, కరోనా నేపథ్యంలో ఆలోచన చేస్తోన్నబీసీసీఐ, త్వరలో స్పష్టత వచ్చే అవకాశం
Hazarath Reddyకరోనావైరస్ లాక్‌డౌన్‌ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)-2020 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అనేక దేశాలు లాక్‌డౌన్‌ (Lockdown) సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్‌ (Cricket) కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇంగ్లండ్‌, శ్రీలంక వంటి దేశాలు ఇప్పటికే శిక్షణ శిబిరాలు ప్రారంభించాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ (IPL 2020) ను విదేశాల్లో నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
Shoaib Akhtar on Brett Lee: బ్రెట్ లీకి బ్యాటింగ్ అంటే చచ్చేంత భయం, తను చాలా నిజాయితీగా ఉండేవారు. బ్రెట్‌లీ వీడియోని షేర్ చేసి అనుభవాలు పంచుకున్న షోయ‌బ్ అక్త‌ర్
Hazarath Reddyక్రికెట్ మీద అవగాహన ఉన్నవారికి బ్రెట్ లీ, షోయ‌బ్ అక్త‌ర్ (Shoaib Akhtar and Brett Lee)పేర్లను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారి వారి జనరేషన్లలో ఇద్దరూ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్లను హడలెత్తించారు. గంట‌కు 160 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు విసిరే ప్ర‌త్యేక‌త వీరికి మాత్ర‌మే ఉండేది. అయితే బ్యాటింగ్ విషయం వచ్చేసరికి ఇద్దరికీ వణుకుపుట్టేది. ఈ విషయాలను పాక్ మాజీ పేసర్ షోయ‌బ్ అక్త‌ర్ చెప్పుకొచ్చారు.
IPL 2020: కరోనావైరస్ ఔట్ స్వింగర్.. ఐపీఎల్ 2020 క్లీన్ బౌల్డ్. టోర్నమెంట్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
Team Latestlyఐపీఎల్-2020 టోర్నమెంట్ గనక రద్దయితే బీసీసీఐ సుమారు రూ.3800 కోట్లు నష్టపోనుందని అంచనా. ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ షెడ్యూల్ చేయబడి ఉంది. ఒకవేళ ఆ టోర్నమెంట్ ను గనక వాయిదా వేస్తే ఆ సమయంలో .....
IPL 2020 Update: కరోనావైరస్ ప్రభావం.. ఐపీఎల్ వాయిదా! మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 2020 ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ
Vikas Mandaఅందరూ అనుమానిస్తున్నట్లుగానే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ సీజన్ 2020 వాయిదా పడింది. COVID-19 మహమ్మారి నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 టోర్నమెంట్ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది......
ICC Women's T20 World Cup 2020 Final: తడబడిన ఇండియా, మరోసారి చాంఫియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా, మొత్తం 5 సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు
Hazarath Reddyఇండియా తడబడింది. చాంపియన్‌ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహిళా క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరైన ప్రపంచకప్‌-2020 తుది సమరంలో ఆస్ట్రేలియా జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది.
ICC Women's T20 World Cup: ప్రపంచ కప్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో, ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టు, వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ రద్దు, నేడు తేలిపోనున్న భారత్ ఫైనల్ ప్రత్యర్థి
Hazarath Reddyభారత్ మరో ప్రపంచకప్ సాధించేందుకు అడుగుదూరంలో నిలిచింది. మహిళల టి20 ప్రపంచ కప్‌ ( ICC Women's T20 World Cup) చరిత్రలో భారత జట్టు (India Team) తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్‌ వరకే పరిమితమైన భారత మహిళలు (India Women's National Cricket Team) ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు.
David warner: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్, బాల్ ట్యాంపరింగ్‌లో 9 నెలలు పాటు నిషేధం ఎదుర్కున్న ఆస్ట్రేలియా దిగ్గజం, వార్నర్ నాయక్వంలో 2016లో ఐపీఎల్ ట్రోఫి కైవసం చేసుకున్న హైదరాబాద్
Hazarath Reddyమండు వేసవిలో, మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 (IPL 20200 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ (Sunrisers Hyderabad) అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు సారథ్య బాధ్యతలను మరోసారి డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు (David warner) అప్పగిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో గత రెండు సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేన్ విలియమ్సన్ స్థానంలో వార్నర్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.
Dog Plays Cricket: కుక్క వికెట్ కీపింగ్ అదుర్స్. ధోని పెంపుడు కుక్కలానే ఉందంటున్న నెటిజన్లు, వైరల్ అవుతోన్న ప్రముఖ నటి సిమి గరేవాల్ ట్విట్టర్ షేర్ వీడియో
Hazarath Reddyమనుషులు క్రికెట్ (Cricket) ఆడటం చూశాం కాని జంతువులు క్రికెట్ ఆడటం ఎక్కడైనా చూశారా..అయితే ఈ వీడియో చూస్తే నిజమేనని ఒప్పుకుంటారు.ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడుతుంటే ఓ డాగ్ వికెట్ల వెనక నిలబడి కీపింగ్ చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నటి..టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్ (Simi Garewal) ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
Laureus Sports Awards 2020: రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ, లారస్ స్పోర్టింగ్ మూమెంట్ విజేతగా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్
Vikas Mandaఅంతకుముందు 5 సార్లు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, తన కెరియర్ లో ఎన్ని మైలురాళ్లను అధిగమించినా, ప్రపంచకప్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరకు 22 ఏళ్ల తర్వాత తన చిట్టచివరి ప్రపంచ కప్ మ్యాచ్ 2011 లో సచిన్ స్వప్నం నెరవేరింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది....
IPL 2020 Full Schedule: ఎనిమిది జట్లు, 56 మ్యాచ్‌లు, 50 రోజులు, మండు వేసవిలో దుమ్మురేపనున్న ఐపీఎల్ 13వ సీజన్, మార్చి 29న తొలి మ్యాచ్, మే 24న ఫైనల్, పూర్తి వివరాలు కోసం స్టోరీని క్లిక్ చేయండి
Hazarath Reddyమండు వేసవిలో క్రికెట్ సమరం మొదలు కాబోతోంది. మెగా ఐపీఎల్ 2020 13వ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మార్చి 29న వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. మొత్తం 8 జట్లు 50 రోజుల పాటు క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించనున్నాయి.
'Kitna Sukh Gaya Hai Tu': కొడుకు సన్నగా అయ్యాడని కన్నీళ్లు కార్చిన తల్లి, రికార్డుల కన్నా కొడుకు క్షేమమే ముఖ్యమని చాటిచెప్పే తల్లి కథ, యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైపాల్ జీవితపు డైరీలో ఓ పేజీ
Hazarath Reddyయశస్వి ఇంటికి రాగానే తన బిడ్డను చూసి ‘ఇంత సన్నగైపోయావేందిరా’ (కిత్నా సుఖ్‌ గయా హై తూ!) (Kitna Sukh Gaya Hai Tu) అని ఒళ్లు తడిమి చూసుకుని కన్నీళ్లు కార్చింది. సాధారణంగా టీనేజ్‌ కుర్రాళ్లకు ఇలాంటి ఎమోషన్స్‌ నచ్చవు. తల్లిని కూడా దగ్గరకు రానివ్వరు. దీంతో ఈ కుర్రాడు కూడా ‘‘నువ్వూర్కోమ్మా’’ అన్నాడు. ‘‘అంత మాట అనేశావేంట్రా అబ్బాయ్‌! తల్లి ఎలా ఊరుకుంటుంది’’ అని చుట్టుపక్కల వాళ్లు అన్నారు.
Gowda Faster Than Bolt: ఉసేన్ బోల్ట్ కంటే వేగం మన ఈ మట్టిలో మాణిక్యం, సాంప్రదాయ కంబాల పోటీదారు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే పూర్తి చేసి రికార్డ్
Vikas Mandaఈ శ్రీనివాస గౌడ విషయానికి వస్తే, 5వ తరగతిలోనే చదువు ఆపేసిన ఇతడు ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత ఐదారేళ్లుగా కంబాల పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడని, ఓ ఇద్దరి యజమానుల వద్ద పనిచేస్తూ వారికి సంబంధించిన మూడు ఎద్దుల జోడిలకు శ్రీనివాస్ జాకీగా వ్యవహరిస్తున్నాడు.....
India vs New Zealand 3rd ODI: 31 ఏళ్ళ తర్వాత ఇండియాకు ఘోర పరాభవం, కసి తీర్చుకున్న కివీస్, కోహ్లీసేన క్లీన్ స్వీప్‌కు ఘాటుగా రిప్లై, మూడో వన్డేలో న్యూజీలాండ్ విజయంతో వన్డే సీరిస్‌లో టీమిండియా వైట్ వాష్
Hazarath Reddyమౌంట్ మాంగనుయ్ లో టీమిండియాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో (India vs New Zealand 3rd ODI) ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఓ వన్డే సిరీస్ లో భారత్ (India) ఇంత ఘోరంగా ఓడిపోవడం 31 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. టీం ఇండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ సునాయాసయంగా చేధించింది. దీనితో టి20 సీరీస్ లో ఎదురైన ఘోర పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది.
U-19 World Cup Final: కప్ గెలిచారు,గేమ్ స్పిరిట్ కోల్పోయారు, తొలిసారి విశ్వ విజేతలైన బంగ్లా బేబీలు, డిఫెండింగ్ చాంఫియయన్ భారత్‌ను వెంటాడిన వర్షం
Hazarath Reddyఆటగాళ్ల మధ్య స్పిరిట్ కొరవడింది. ప్లేయర్ల మధ్య కవ్వింపు చర్యలు సాధారణమే అయినప్పటికీ బంగ్లాదేశ్ యువ ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్లేయర్లకు పోటినిచ్చేలా తమ కవ్వింపు చేష్టలను ప్రదర్శించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పేసర్ హసన్ ఈ విషయంలో మరీ దూకుడు ప్రదర్శించినట్లుగా వీడియోల్లో తెలుస్తోంది.
U-19 World Cup Final: ఎవరు గెలిచినా రికార్డుల మోతే, భారత్ గెలిస్తే 5వ ప్రపంచకప్ మన చేతుల్లో, తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన బంగ్లా, చరిత్ర తిరగ రాసేందుకు అడుగుదూరంలో..
Hazarath Reddyఅంచనాలకు అనుగుణంగా రాణిస్తూ.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ( U-19 World Cup Final) చేరిన యువ భారత జట్టు (India) ఆదివారం బ్లంగాదేశ్‌తో (Bangladesh) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. 16 యువ జట్లు పాల్గొన్న అండర్‌–19 ప్రపంచ కప్‌ (ICC U19 Cricket World Cup 2020) తుది సమరం మరో కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.
IND vs NZ 2nd ODI: రెండో వన్డేలో కోహ్లీ సేనకు తప్పని పరాభవం, సీరిస్ కైవసం చేసుకున్న కివీస్, టీ20కి ప్రతీకారం తీర్చుకున్న న్యూజీలాండ్, నామమాత్రంగా మారిన మూడో వన్డే
Hazarath Reddyఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs NZ 2nd ODI) న్యూజిలాండ్ 22పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది. టీ20సిరీస్ గెలుచుకున్న భారత్ (India) కివీస్‌కు (New Zealand) వన్డే సిరీస్ ను అప్పజెప్పినట్లు అయింది. ఇప్పటికే రెండు వన్డేలను ఓడిన భారత్ మూడో వన్డేను నామమాత్రంగా మార్చివేసింది. పరువు కాపాడుకోవడానికి కోహ్లీసేన క్లీన్ స్వీప్ కోసం కివీస్ లు మంగళవారం ఉదయం 7గంటల 30నిమిషాలకు ఓవల్ స్టేడియం వేదికగా మూడో వన్డేలో తలపడనున్నాయి.
NZ vs IND 1st ODI: తడబడిన ఇండియా, పుంజుకున్న కివీస్, తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్, సెంచరీతో అదరగొట్టిన రాస్ టేలర్, వన్డే కెరీర్‌లో తొలి సెంచరీతో మెరిసిన శ్రేయస్‌ అయ్యర్‌
Hazarath Reddyన్యూజిలాండ్‌ (New Zealand) పర్యటనలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు టీ20 ల సిరీస్‌ను 5-0 తేడాతో గెలిచి అదరహో అనిపించిన భారత్ (India) పరిమిత ఓవర్ల ఆటలో మాత్రం కివీస్‌ ముందు తలవంచింది. హామిల్టన్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో (NZ vs IND 1st ODI) న్యూజిలాండ్‌ టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కొంతకాలంగా తన ఆటతీరుతో విమర్శలపాలవుతున్న కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాస్‌ టేలర్‌ (Ross Taylor) చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు.
IND vs NZ T20I: టీమిండియా క్లీన్ స్వీప్, ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిదారి పట్టిన కివీస్, కివీస్‌ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ను క్వీన్‌స్వీప్‌ చేసిన జట్టుగా భారత్ రికార్డు
Hazarath Reddyఇండియా (India) దెబ్బకు న్యూజీలాండ్ (New Zealand) కథ కంచికి చేరింది. పటిష్టమైన భారత బౌలింగ్, దుర్భేద్యమైన భారత్ బ్యాటింగ్ దెబ్బకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిదారి పట్టింది. టీ20లో ఆది నుంచి దుమ్మురేపుతూ వచ్చిన భారత్ చివరి మ్యాచ్ లో(India vs New Zealand 5th T20I 2020) కూడా విజయం సాధించి సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా కివీస్‌ గడ్డపై తొలిసారి ఒక టీ20 సిరీస్‌ను (India vs New Zealand T20I) క్వీన్‌స్వీప్‌ చేసిన తొలి భారత జట్టుగా నిలిచింది.
NZ vs IND 4th T20I: మన మ్యాచ్ అవ్వాలి మళ్ళీ మళ్ళీ 'టై', న్యూజిలాండ్ - భారత్ నాలుగో టీ20 కూడా టై, సూపర్ ఓవర్లో మళ్లీ టీమిండియాదే గెలుపు!
Vikas Mandaన్యూజిలాండ్ - భారత్ మధ్య జరిగిన నాలుగో టీ20 కూడా టైగా ముగిసింది. అయితే మూడో మ్యాచ్ లో గెలిపించిన రోహిత్ శర్మ, మహ్మద్ షమీలు ఈ మ్యాచ్ లో ఆడలేదు. అయినా కూడా శార్దూల్ ఠాకూర్, కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు జటు అంతా కలిసి సమిష్టిగా టీమిండియాను గెలిపించారు. ఈ దెబ్బతో కివీస్ కు ఫ్రస్ట్రేషన్, భారత్ కు ఫన్....
New Zealand vs India 3rd T20I: 'సూపర్' మ్యాచ్‌లో 'హిట్' మ్యాన్ అదిరిపోయే షో, మూడో టీ20 లోనూ టీమిండియా అద్భుత విజయం, 3-0 తేడాతో సిరీస్ కైవసం
Vikas Mandaనరాలు తెగే ఉత్కంఠ, క్రీజులో భయంకరమైన రాస్ టేలర్, ఎలాంటి బంతి వేయాలి అనుకుంటున్న సమయంలో షమీ ప్లాన్ 'ఏ' అమలు. ఫుల్ టాస్ విసిరాడు, ఇంకే భారీ హిట్ కు యత్నించిన రాస్ టైలర్ బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ అయింది. బంతి నేరుగా వికెట్లను పడగొట్టింది. స్టేడియంలో, టీవీల ముందు ప్రేక్షకుల.....