Sports

Deepthi Jeevanji: పారాలంపియ‌న్ దీప్తికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫ‌ర్, కోటి రూపాయ‌ల న‌గ‌దు, గ్రూప్-2 ఉద్యోగం ప్ర‌క‌ట‌న‌

VNS

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని (Deepthi Jeevanji) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

Paralympic Games 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, పురుషుల హైజంప్ ఈవెంట్లో పసిడి పతకం సాధించిన ప్రవీణ్ కుమార్, 6 గోల్డ్ మెడల్స్‌తో టోక్యో రికార్డును దాటిన భారత్

Hazarath Reddy

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హైజంప్ ఫైనల్లో 2.08 మీటర్లతో ప్రథమస్థానంలో నిలిచాడు.

Vinesh Phogat Resigns: రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్‌ ఫోగట్‌, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ (Vinesh Phogat ) కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫోగట్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా (resigns from her post in Indian Railways) చేసినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు .

Kapil Parmar Wins Historic Bronze: పారాలంపిక్స్ లో చారిత్ర‌క ప‌త‌కం తెచ్చిన అథ్లెట్, భార‌త్ ఖాతాలో 25వ ప‌త‌కం, జూడోలో క‌పిల్ ప‌ర్మార్ కు కాంస్యం

VNS

పారాలింపిక్స్‌లో(Paralympics) భార‌త క్రీడాకారులు రికార్డు స్థాయిలో ప‌త‌కాలు సాధిస్తున్నారు. విశ్వ‌క్రీడ‌ల చ‌రిత్ర‌లో అథ్లెటిక్స్, బ్యాడ్మింట‌న్‌లో దేశానికి తొలిసారి ప‌త‌కాలు రాగా.. తాజాగా జూడోలోనూ క‌పిల్ ప‌ర్మార్(Kapil Parmar) మెడ‌ల్ కొల్ల‌గొట్టాడు. పురుషుల 60 కిలోలు జే1 విభాగంలో క‌పిల్ కాంస్యంతో మెరిశాడు

Advertisement

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో పసిడి పతకం,ఆర్చరీ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా హర్విందర్ సింగ్ రికార్డ్, 24కి చేరిన భారత్ పతకాల సంఖ్య

Arun Charagonda

పారాలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా సత్తాచాటుతున్నారు. తాజాగా పారా ఆర్చరీ మెన్స్ రికర్వ్ ఓపెన్ ఫైనల్స్ లో సత్తా చాటారు హర్విందర్ సింగ్. పోలాండ్ కు చెందిన లుకాస్జ్ సిజెక్ ను 6-0 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు.

IPL 2025: మళ్లీ ఐపీఎల్‌లోకి రాహుల్ ద్రావిడ్, రాజస్థాన్ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా ద్రావిడ్

Arun Charagonda

మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్ అవతారం ఎత్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇటీవలె ద్రావిడ్ భారత హెడ్ కోచ్ పదవి కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీతో ఒప్పందం చేసుకున్నారు ద్రావిడ్.

World Test Championship 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులోకి బంగ్లాదేశ్, ఆ మూడు టీంలకు సవాల్ విసిరేందుకు రెడీ అయిన డార్క్ హార్స్

Vikas M

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోకి దూసుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న సంగతి విదితమే. ఈ రేసులో ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు బంగ్లా సిద్దమైంది.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌, భారత్ ఖాతాలో మరో రజత పతకం, పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో పతకం గెలిచిన సచిన్ సర్జేరావు ఖిలారీ

Vikas M

పారాలింపిక్స్‌లో భారత్‌ మరో రజత పతకం సాధించింది. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46లో ప్రపంచ ఛాంపియన్‌ సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఈ పారాలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కిది 11వ పతకం.ఇప్పటిరవకు పారిస్ గేమ్స్ లో భారత్ కు 21 పతకాలు లభించాయి.

Advertisement

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా, 20కి చేరిన పతకాల సంఖ్య, ఒక్కరోజే ఐదు పతకాలు,పారాలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి

Arun Charagonda

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరగా ఒక్కరోజే 5 పతకాలు వచ్చాయి. స్ప్రింట్ దీప్తి జీవన్‌జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్‌ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు.

Ajay Ratra: బీసీసీఐ కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా, స‌లీల్ అంకోలా స్థానాన్ని భర్తీ చేయనున్న అజయ్, కీలక విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ

Vikas M

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా(Ajay Ratra) ఎంపిక‌య్యాడు. ప్ర‌స్తుతం సెలెక్ట‌న్ ప్యానెల్ స‌భ్యుల్లో ఒక‌రైన‌ స‌లీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజ‌య్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం బీసీసీఐ (BCCI) వెల్ల‌డించింది.

Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి

Vikas M

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజ‌యం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్‌కు ముందే.. బంగ్లా మ్యాచ్‌ను ముగించేసింది. స్వంత గ‌డ్డ‌పై దాయాది దేశానికి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది.పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి.

ICC World Test Championship 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..

Vikas M

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.

Advertisement

Sheetal Devi's Bullseye Shot Video: కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్‌కు ఫిదా అయిన సెలబ్రిటీలు, ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌ అంటూ విషెస్

Vikas M

పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్‌కు బార్సిలోనా ఫుట్‌బాల్ స్టార్ జౌలెస్ కుందె, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫిదా అయ్యారు

Sheetal Devi's Bullseye Shot: ఆర్చర్ శీతల్ దేవి అదిరిపోయే షాట్‌ వీడియో ఇదిగో, నీకు కారు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్

Vikas M

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, SU5 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన మనీషా రాందాస్

Vikas M

SU5 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మనీషా రాందాస్ పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ పతకాల పట్టికలో మరో పతకాన్ని జోడించింది. ఆమె తన కాంస్య పతక మ్యాచ్‌లో 21-12, 21-8తో ఆధిపత్యం చెలాయించడం ద్వారా 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 10వ పతకాన్ని ఖాయం చేసింది.

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024, భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్న తులసిమతి మురుగేషన్

Vikas M

పారిస్ పారాలింపిక్స్ 2024లో సోమవారం, సెప్టెంబర్ 2న జరిగిన మహిళల సింగిల్స్ SU5 పారా-బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో తులసిమతి మురుగేషన్ ఫైనల్‌లో చైనాకు చెందిన యాంగ్ క్యూ జియా చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెలుచుకుంది.

Advertisement

Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకం, పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పసిడి సాధించిన నితీష్ కుమార్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.

Paralympic Games 2024:పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం, పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో రజత పతకం సాధించిన యోగేష్ కథునియా

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024లో పురుషుల డిస్కస్ త్రో F56 ఈవెంట్‌లో యోగేష్ కథునియా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 27 ఏళ్ల అతను తన మొదటి ప్రయత్నంలో వచ్చిన 42.22 మీటర్ల త్రోను తీసి పోడియం ఫినిషింగ్ సాధించాడు. కథునియా కోసం ఇది సీజన్‌లో అత్యుత్తమ ప్రయత్నం

Sivarajan Solaimalai: అద్భుత వీడియో.. పారా షట్లర్ శివరాజన్ సొలైమలై స్టన్నింగ్ షాట్, ప్రేక్షకులని థ్రిల్‌ చేసిన వీడియోలు

Arun Charagonda

పారాలింపిక్స్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు శివ‌రాజ‌న్ సొలైమ‌లై. మ్యాచ్ ఓడినా అద్భుత ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. శివ‌రాజ‌న్ కొట్టిన కొన్ని షాట్స్ ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేశాయి. ప్రత్యర్థి సైతం అవాక్కయ్యేలా స్టన్నింగ్ షాట్స్ కొట్టారు శివరాజన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Aarti Wins Bronze Medal: ప్రపంచ U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఆర్తీ, ఈ ఎడిషన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం

Vikas M

ఆర్తి దుబాయ్‌లో జరిగిన ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 10,000 M రేసు నడక ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ U20 క్వాలిఫికేషన్ సమయాన్ని 49 నిమిషాలకు మెరుగుపరచడానికి ఆమె 47:45.33ని పూర్తి చేసింది.

Advertisement
Advertisement