క్రీడలు

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌, మహిళల తైక్వాండోలో స్వర్ణ పతకం సాధించిన అరుణ తన్వర్, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయురాలుగా రికార్డు

Hazarath Reddy

మహిళల తైక్వాండో K44-47kg విభాగంలో అరుణ తన్వర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. క్రమశిక్షణలో మొట్టమొదటి భారతీయ పతక విజేతగా నిలిచిన ఘనతను కూడా సాధించింది, 2023 ఆసియా పారా గేమ్స్‌లో భారతదేశం పతక విజేతల పరుగును కొనసాగిస్తోంది. క్లోజ్ బౌట్‌లో ఆమె 13-12తో చైనా ప్రత్యర్థి చెన్ టాంగ్‌ను ఓడించి పతకాన్ని కైవసం చేసుకుంది.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు, టీ-64 పురుషుల హైజంప్‌లో స్వర్ణ పతకం సాధించిన ప్రవీణ్ కుమార్, రజతం సాధించిన ఉన్ని రేణు

Hazarath Reddy

టీ-64 పురుషుల హైజంప్ ఈవెంట్‌లో ఈసారి రెండు పతకాలు కైవసం చేసుకుని, 2023 ఆసియా పారా గేమ్స్‌లో భారత్ పతకాల పరంపరలో ఉంది. టోక్యో 2021లో జరిగిన పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్న ప్రవీణ్ కుమార్, ఆసియా పారా గేమ్స్‌లో 2.02 మీటర్ల జంప్‌తో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఉన్ని రేణు 1.95 మీటర్ల జంప్‌తో కాంస్య పతకం సాధించాడు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో రజత పతకం, పురుషుల 60 కేజీల జే1 ఫైనల్‌లో సిల్వర్ సాధించిన కపిల్ పర్మార్

Hazarath Reddy

ఆసియా పారా గేమ్స్‌లో భారత బృందం దుమ్ము రేపుతోంది. తొలి రోజు నుంచే పతకాల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. తాజాగా ప్రపంచ నంబర్ టూ కపిల్ పర్మార్.. 2022 ఇరాన్ ప్రపంచ ఛాంపియన్ బనితాబా చేతిలో ఓడిపోయి స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు. పురుషుల 60 కేజీల జే1 ఫైనల్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం, P4 మిక్స్‌డ్ 50మీ పిస్టల్ SH1 ఫైనల్స్‌లో సిల్వర్ గెలుచుకున్న రుద్రాంశ్ ఖండేల్వాల్

Hazarath Reddy

ప్రపంచ రికార్డు హోల్డర్ రుద్రాంశ్ ఖండేల్వాల్ 2023 ఆసియా పారా గేమ్స్‌లో P4 మిక్స్‌డ్ 50మీ పిస్టల్ SH1 ఫైనల్స్‌లో 218.9 స్కోర్‌తో రజత పతకాన్ని గెలుచుకున్నారు. సింగ్‌రాజ్, రాహుల్ జాకర్, ఆకాష్ క్వాలిఫికేషన్‌లో 10వ, 11వ మరియు 12వ స్థానాల్లో నిలిచారు.

Advertisement

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఫైనల్స్‌లో స్వర్ణం సాధించిన అవని లేఖరా

Hazarath Reddy

2023 ఆసియా పారా గేమ్స్‌లో అవని లేఖరా బంగారు పతకాన్ని సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఫైనల్స్‌ను అవని 249.6 పాయింట్లతో గౌరవప్రదమైన స్కోరుతో ముగించింది.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ప్రాచీకి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, యావత్ దేశం గర్వించేలా చేసిందంటూ ట్వీట్

Hazarath Reddy

ఆసియా పారా గేమ్స్‌లో తొలి పతకాన్ని సాధించడం ద్వారా భారత క్రీడా చరిత్రలో ప్రాచీ యాదవ్ తన పేరును నిలబెట్టుకుంది.పారా కానోయింగ్ మహిళల VL2 ఫైనల్‌లో తకం సాధించడం ద్వారా ఆమె అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశం గర్వించేలా చేసిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్ 2023లో పతకాల ఖాతా తెరిచిన భారత్, మహిళల VL2 ఫైనల్‌లో రజత పతకం సాధించిన ప్రాచీ యాదవ్

Hazarath Reddy

మహిళల VL2 ఫైనల్‌లో కెనోయింగ్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. హాంగ్‌జౌలో సోమవారం జరుగుతున్న 4వ ఆసియా క్రీడలలో భారతదేశం తన ఖాతాను తెరిచింది.ప్రాచీ.. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇరోదాఖోన్ రుస్తమోవాకు 1.022 సెకన్ల తేడాతో బంగారు పతకం మిస్ చేసుకుంది

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్ 2023, పురుషుల T63 హైజంప్‌లో బంగారు పతకం కైవసం చేసుకున్న భారత ఆటగాడు శైలేష్ కుమార్

Hazarath Reddy

పురుషుల T63 హైజంప్‌లో శైలేష్ కుమార్ స్వర్ణం సాధించి, ఆసియా పారా గేమ్స్ 1.82 మీటర్ల రికార్డును నెలకొల్పాడు, ఆసియన్ పారా గేమ్స్ 2023లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన మరో భారత ఆటగాడు మరియప్పన్ తంగవేలు (1.80 మీటర్లు) కంటే ముందున్నాడు.

Advertisement

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్ 2023లో భారత్ పతకాల పంట, పురుషుల హైజంప్ T47లో బంగారు పతకం సాధించిన నిషాద్ కుమార్,రజతం సాధించిన రామ్ పాల్

Hazarath Reddy

సోమవారం హాంగ్‌జౌలో జరుగుతున్న 4వ ఆసియా పారా గేమ్స్ 2022లో పురుషుల హైజంప్ T47లో భారత ఆటగాడు నిషాద్ కుమార్ కొత్త ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పుతూ స్వర్ణం సాధించాడు. నిషాద్ తన మిగిలిన పోటీదారుల కంటే ఎక్కువగా దూకి 2.02 మీటర్ల ఎత్తుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్ 2023లో దుమ్మురేపిన భారత్, రెండు ఈవెంట్‌లలో అన్ని పతకాలను కైవసం చేసుకున్న టీమిండియా అథ్లెట్లు

Hazarath Reddy

చైనాలో ఆసియా క్రీడలు ముగిసిన రెండు వారాల తర్వాత హాంగ్‌జౌలో మళ్లీ ఆటల సందడి మొదలైంది. పారా ఆసియా క్రీడలు షురూ అయ్యాయి. ఆదివారం హాంగ్‌జౌ ఒలింపిక్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌ స్టేడియంలో ఈ క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

Suryakumar Yadav Run Out Video: రోడ్ల మీద వెనుకా ముందు చూసుకోకుండా ఇలా వెళితే అంటూ...సూర్యకుమార్ యాదవ్ రనౌట్ వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

రోడ్లపై అతివేగం యమ డేంజర్! వెనుక ముందు చూసుకోకుండా ఇలా రయ్యిన దూసుకుపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి అంటూ సూచన చేశారు.

Shubman Gill New World Record: రికార్డులు బద్దలు కొట్టిన శుభమన్ గిల్, అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తిచేసిన గిల్, అంతకుముందు ఈ ఘటన సాధించిన టీమిండియా ప్లేయర్లు ఎవరంటే?

VNS

వ‌న్డేల్లో శుభ్‌మ‌న్ గిల్ (Shubman Gill) చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా రెండు వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మొద‌టి ఆట‌గాడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హషీమ్ ఆమ్లా రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

Advertisement

Mohmmed Shami Creates History: వన్డేల్లో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ, వరల్డ్ కప్‌ చరిత్రలో రెండుసార్లు ఐదువికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు

VNS

సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ.. (Mohmmed Shami) అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్‌గా షమీ చరిత్రకెక్కాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న షమీ.. తాజాగా కొరుకుడు పడని ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై (New Zeland) సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు.

India Vs New Zealand: ధర్మశాలలో దుమ్మురేపిన భారత్, 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌ లో న్యూజిలాండ్ పై విజయం, పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ కు చేరిన టీమిండియా

VNS

వన్డే వరల్డ్ కప్ టోర్నీ -2023లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం (India beat Newzeland) సాధించింది. దీంతోపాటు పాయింట్ల పట్టికలోకి భారత్ టాప్ లోకి దూసుకెళ్లింది. 48 ఓవర్లలోనే న్యూజిలాండ్ విధించిన విజయ లక్ష్యాన్ని భారత్ చేదించింది.

India vs New Zealand, Viral Video: బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టి రచిన్ రవీంద్రను పెవిలియన్ పంపిన శుభ్ మన్ గిల్, కివీస్ మూడో వికెట్ పడగొట్టిన షమి..

ahana

రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ భాగస్వామ్యాన్ని షమీ బ్రేక్ చేశాడు. 87 బంతుల్లో 75 పరుగులు చేసి రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. షమీ అతడిని బౌండరీలో క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో రచిన్, మిచెల్ మధ్య 159 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

India vs New Zealand, Viral Video: మొదటి బంతికే వికెట్ తీసిన మహ్మద్ షమీ, వీడియో చూస్తే మతి పోవడం ఖాయం..

ahana

మహ్మద్ షమీ తన తొలి బంతికే భారత్‌కు రెండో వికెట్ అందించాడు. విల్ యంగ్ 27 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.

Advertisement

India vs New Zealand, Viral Video: కివీస్ మొదటి వికెట్ పడగొట్టిన సిరాజ్, ఈ వీడియోలో శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ చూస్తే షాక్ తినడం ఖాయం

ahana

టీమిండియా అత్యుత్తమ బౌలర్ల జాబితాలో మహ్మద్ సిరాజ్ ఒకరు అని నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌లో సిరాజ్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వేను సున్నా వద్ద సిరాజ్ అవుట్ చేశాడు.

SA Vs ENG: అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న ఇంగ్లండ్, అత్యధిక పరుగుల తేడాతో ఓడిన డిఫెండింగ్ చాంపియన్, ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమి

VNS

ముంబైలో సౌతాఫ్రికా నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో ఇంగ్లీష్‌ జట్టు 170 పరుగులకే చాప చుట్టేసింది. తద్వారా డిఫెండింగ్‌ ఛాంపియన్లు 229 పరుగుల తేడాతో ఓడింది. వన్డే ప్రపంచకప్‌లో ఫుల్‌ మెంబర్స్‌ నేషన్స్‌గా ఉండి పరుగులపరంగా అత్యంత భారీ తేడాతో ఓడిన జట్లలో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో ఉంది.

Australia Beat Pakistan: ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పై 62 పరుగుల తేడాతో గెలుపు, నాలుగు వికెట్లు తీసి పాక్ వెన్నువిరిచిన జంపా

VNS

బెంగ‌ళూరు వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 62 ప‌రుగుల తేడాతో (Australia Beat Pakistan ) విజ‌యం సాధించింది. 368 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ (Pakistan) 45.3 ఓవ‌ర్‌లో 305 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో ఇమామ్ ఉల్ హక్(70; 71 బంతుల్లో 10 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (64; 61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు

IPL 2024: ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ కోచ్‌‌గా లసిత్‌ మలింగ, బ్యాటింగ్‌ కోచ్‌గా వెస్టిండీస్‌ కీరన్‌ పొలార్డ్‌, కీలక ప్రకటన చేసిన ముంబై ఇండియన్స్

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో బౌలింగ్‌ కోచ్‌గా శ్రీలంక లెజెండరీ పేసర్‌ లసిత్‌ మలింగను ప్రకటించింది. ఇక బ్యాటింగ్‌ కోచ్ గా వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ పేరును ప్రకటించింది

Advertisement
Advertisement