Cricket
BCCI New Rule: బౌలర్లకు ఊరటనిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం, ఇకపై ఒక ఓవర్‌ లో రెండు బౌన్సర్లు వేయొచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలోనూ మార్పు
VNSభార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌లో ఇటీవ‌ల బ్యాట‌ర్ల ఆధిప‌త్యం పెరుగుతోంది. దీంతో టీ20ల్లో బ్యాట్‌, బాల్ మ‌ధ్య స‌మ‌తుల్యత‌ను కాపాడాల‌ని భావించింది. ఈ క్రమంలో బౌల‌ర్లు ఓవ‌ర్‌కు రెండు బౌన్స‌ర్ల‌ను వేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది. త్వర‌లోనే ప్రారంభం కానున్న స‌మ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ లో ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్నట్లు వెల్లడించింది.
MS Dhoni 77 Feet Cutout Video: వీడియో ఇదిగో, నందిగామలో 77 అడుగుల ధోనీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు, రేపు ధోనీ 44వ జన్మదినం
Hazarath Reddyమహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద రేపు ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.
Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, 100వ టెస్ట్ మ్యాచ్‌లో 22 పరుగులకు ఔట్ అయిన స్టీవ్ స్మిత్
Hazarath Reddyతన 100వ టెస్ట్ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ ప్రదర్శన ప్రణాళిక ప్రకారం జరగలేదు, కనీసం మొదటి ఇన్నింగ్స్‌లో కూడా అతను కేవలం 22 పరుగులకే ఔటయ్యాడు. ఆస్ట్రేలియన్ స్టాల్‌వార్ట్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన బంతిని ఢిపెన్స్ ఆడబోయి జానీ బెయిర్‌స్టోన్ చేతికి చిక్కాడు. అంపైర్ దానిని అవుట్ అని ప్రకటించాడు. స్మిత్ ఈ అవుట్ పై అప్పీల్ కు వెళ్లగా ధర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో నిరాశగా వెనుదిరిగాడు.
Alamgir Tareen Dies: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం, ఆత్మహత్య చేసుకున్న పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ యజమాని అలంగీర్ తరీన్
Hazarath Reddyపాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ యజమాని అలంగీర్ తరీన్ లాహోర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 6వ తేదీ ఉదయం లాహోర్‌లోని తన నివాసంలో 63 ఏళ్ల అలంగీర్ తరీన్ చనిపోయినట్లు తెలిసింది. అతని మృతదేహం పక్కనే చేతితో రాసిన నోట్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. అలంగీర్ తరీన్ తన మేనల్లుడు అలీ ఖాన్ తరీన్‌తో కలిసి 2018లో ముల్తాన్ సుల్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు.
Rishabh Pant’s Latest Pic: రిషబ్ పంత్ లేటెస్ట్ పిక్ ఇదిగో, భారత జట్టులోకి రావడానికి చెమటోడ్చుతున్న వికెట్ కీపర్-బ్యాటర్
Hazarath Reddyరిషబ్ పంత్ డిసెంబర్ 20, 2022 ఒక భయంకరమైన కారు ప్రమాదానికి గురైన సంగతి విదితమే. అప్పటి నుండి అతను బెడ్ రెస్ట్ మీద ఉన్నాడు. వికెట్ కీపర్-బ్యాటర్ ప్రస్తుతం భారత జట్టులోకి తిరిగి రావాలనే ప్రయత్నంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చెమటోడ్చుతున్నాడు.
India's Squad For WI T20I Series: రింకూ సింగ్‌కు దక్కని చోటు, తిలక్ వర్మకు పిలుపు, వెస్టీండీస్ T20I సిరీస్ కోసం భారత జట్టు ఇదిగో..
Hazarath Reddyవెస్టిండీస్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు గతంలో, వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం వెస్టిండీస్‌తో కరేబియన్ దీవులు, USAలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది
MS Dhoni-Sakshi Dhoni: ధోని బెడ్‌రూంలో ఏం చేస్తున్నాడో చూడండి, పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసిన భార్య సాక్షి ధోని
Hazarath Reddyజూన్‌ 4న ధోని, సాక్షిసింగ్‌ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోని.. ''ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి'' అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసింది. ఆ ఫోటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ చాలా బిజీగా కనిపించాడు.
Ishant Sharma on MS Dhoni: ధోనీ బండబూతులు తిట్టేవాడు, కెప్టెన్‌ కూల్‌ కానే కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన భారత వెటరన్ పేసర్ ఇషాంత్‌ శర్మ
Hazarath Reddyకెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్ ధోనీపై భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ సంచలన వాఖ్యలు చేశాడు. ధోని అసలు కెప్టెన్‌ కూల్‌ కానే కాదని, ఫీల్డ్‌లో తరుచూ దుర్భాషలాడే వాడని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మహీ భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. కానీ వాటిలో కూల్ అండ్ కామ్ ఒకటి కాదు. అతడు మైదానంలో బూతులు తిట్టేవాడు. నేను కూడా ఓసారి విన్నాను.
Virat Kohli Reverse Sweep: విరాట్ కోహ్లి రివర్స్ స్వీప్‌ షాట్ వీడియో ఇదిగో, రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్‌లో ట్రై చేసిన టీమిండియా బ్యాటర్
Hazarath Reddyవిరాట్ కోహ్లి రివర్స్ స్వీప్‌ షాట్ వీడియో వైరల్ అవుతోంది. కానీ భారత్ vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌కు ముందు నెట్స్‌లో రవిచంద్రన్ అశ్విన్‌పై బౌలింగ్ లో ..బ్యాటింగ్ చేసినప్పుడు అతను ఆడిన షాట్ అది.
Praveen Kumar Escape Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్
Hazarath Reddyజూలై 4న మీరట్‌లో వేగంగా వస్తున్న క్యాంటర్‌.. వాహనంను ఢీకొట్టడంతో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు తృటిలో ఘోరమైన కారు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. మాజీ ఫాస్ట్ బౌలర్ తన కారు ల్యాండ్ రోవర్‌లో ప్రయాణిస్తూ పాండవ్ నగర్ నుండి తిరిగి వస్తుండగా మీరట్‌లోని కమిషనర్ నివాసం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Harbhajan's Best Test Players List: నో కోహ్లీ, నో రోహిత్, ప్రపంచంలో అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లు వీళ్లేనట, టాప్‌ ఫైవ్‌ ఆటగాళ్ల లిస్టును విడుదల చేసిన హర్భజన్ సింగ్
Hazarath Reddyఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు నాథన్‌ లయాన్‌, స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా యువ సంచలనం రిషబ్‌ పంత్‌, మరో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను ఎంచుకున్నాడు.
Bareddy Anusha: టీమిండియాకు సెలక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్రికెటర్ బారెడ్డి అనూష, బంగ్లాదేశ్‌ టోర్నీలో భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం
Hazarath Reddyఅనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.
ICC World Cup 2023: దాయాది దేశపు ఆటగాళ్లు ఇండియాకు వస్తున్నారు, ప్రపంచకప్ ఆడేందుకు భారత్ పంపాలంటూ ప్రధానికి లేఖ రాసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు
Hazarath Reddyభారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 లో పాల్గొనేందుకు దాయాది దేశం పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్తాన్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆ దేశ ప్రభుత్వానికి పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విజ్ఞప్తి చేసింది.
World Cup Qualifiers 2023: ఆసక్తికరంగా వరల్డ్ కప్‌ క్వాలిఫైయర్స్, చివరి బెర్త్ కోసం మూడు దేశాల మధ్య తీవ్రపోటీ
VNSఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్స్ పోటీ మ‌రింత అస‌క్తిక‌రంగా మారింది. మాజీ చాంపియ‌న్ శ్రీ‌లంక (Srilanka) జ‌ట్టు ఈరోజు అర్హ‌త సాధించింది. దాంతో, మిగిలిన‌ ఆఖ‌రి బెర్తు కోసం మూడు జ‌ట్ల మ‌ధ్య పోటీ నెల‌కొంది.
West Indies Out Of 2023 One Day World Cup: 2023 ప్రపంచ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్..రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అత్యంత అవమానకరమైన ఓటమి
kanhaఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు వెస్టిండీస్ జట్టు దూరమైంది. క్వాలిఫయర్స్‌లో పేలవ ప్రదర్శనతో వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.
Asian Games 2023: ఆసియా గేమ్స్‌‌ లో ఆడనున్న టీమిండియా.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్ గా లక్ష్మణ్
Rudraఆసియా కప్-2023 తర్వాత రోహిత్ సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
ICC Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు టిక్కెట్లు ఎలా కొనుగోలు చేయాలి, ICC ODI వరల్డ్ కప్ 2023 టిక్కెట్ల ధరలు, బుకింగ్ వివరాలు ఇవిగో..
Hazarath Reddyఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వనున్న 2023 ఐసీసీ వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ అధికారిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఇక్కడ నుండి సరిగ్గా 100 రోజుల తరువాత, ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ షెడ్యూల్ చేయబడుతుంది.
ICC World Cup 2023: హైదరాబాద్ టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశే, ఉప్పల్ స్టేడియంలో భారత్ మ్యాచ్ ఒక్కటి కూడా లేదు
Hazarath Reddyహైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియా మాత్రం ఒక మ్యాచ్ కూడా ఆడడం లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది.
ICC World Cup 2023: ఆ నాలుగు జట్లతోనే భారత్‌కు గట్టి పోటీ, ప్రపంచకప్‌లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇవిగో..
Hazarath Reddyటోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను ఓసారి చూద్దాం.
Rishabh Pant Latest Tweet: ప్రపంచకప్ కోసం రెడీ అవుతున్న రిషబ్ పంత్, సహచర ఆటగాళ్లును కలిసిన ఫోటో షేర్ చేసిన టీమిండియా వికెట్ కీపర్
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. భారత్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే దిశగా పంత్‌ శ్రమిస్తున్నాడు.