రాష్ట్రీయం
Vizag Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డివైడర్ ను దాటి బైక్ ను ఢీకొట్టి.. ఆపై చెట్టు పొదల్లోకి వెళ్లిన వాహనం.. ప్రమాద ఘటనలో ముగ్గురి మృతి
Rudraవిశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా బైక్ పై వస్తున్న వారిని అనంతరం ఢీకొట్టింది. ఆపై చెట్టు పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు.
Malayalam Director Siddique: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ కు గుండెపోటు... పరిస్థితి విషమం
Rudraమలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ గుండెపోటుతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.
Jagtial Shocker: శిథిలావస్థకు ఎంపీడీఓ ఆఫీసు.. హెల్మెట్లు ధరించి డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు.. జగిత్యాల జిల్లా బీర్‌ పూర్ లో ఘటన.. ఫోటోలు వైరల్
Rudraజగిత్యాల జిల్లా బీర్‌ పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకొండి. చూరు ఎప్పుడు కూలుతుందా అని భయపడుతూ ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం బయటే టేబుళ్లు వేసుకుని పని చేసుకుంటున్నారు.
Students Fight in College: వీడియో ఇదిగో, విశాఖపట్నం కృష్ణా కాలేజీ ఆవరణలో తన్నుకున్న విద్యార్థులు, ఆరుమందికి గాయాలు
Hazarath Reddyవిశాఖలోని మద్దిలపాలెం డాక్టర్ వి.ఎస్. కృష్ణా కాలేజీ ఆవరణలో సోమవారం కొట్లాట. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం తరుపు నుండి బయట వ్యక్తులు రావడంతో గొడవ పెరిగింది. ఒకరినొకరు కొట్టుకోవడంతో కృష్ణా కాలేజ్ మొత్తం యుద్ధ వాతావరణం తలపించింది. కొట్లాటలో ఆరుగురికి గాయాలయ్యాయి.
CM Jagan Request To PM Modi: అయ్యా.. మీరే బటన్‌ నొక్కండి, ప్రధాని మోదీకి సీఎం జగన్ రిక్వెస్ట్, నాకు కావాల్సిందల్లా మా ప్రజలకు మంచి జరగడమేనని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyపోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంలో నేను ప్రధాని మోదీకి ఒక్కటే చెప్పాను. అయ్యా.. మీరే బటన్‌ నొక్కండి.. నిర్వాసితుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేయండి. నాకు కావాల్సిందల్లా మా వాళ్లకు మంచి జరగాలని చెప్పాను. త్వరలోనే ఇవ్వాల్సినవన్నీ అందుతాయి
CM Jagan on Polavaram Project: 2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపిన సీఎం జగన్, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలస్యం అయిందని వెల్లడి
Hazarath Reddy2025 ఆగస్ట్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడంతో పాటు స్పిల్ వే పనులు పూర్తి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ఆలస్యమైందన్నారు.
CM Jagan Congratulates to Kunavaram SI: గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్, కూనవరం ఎస్సై బి.వెంకటేష్‌కు సీఎం జగన్ అభినందనలు
Hazarath Reddyకూనవరం ఎస్సై బి.వెంకటేష్ ను అభినందించిన సీఎం వైఎస్ జగన్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన ఎస్సై వెంకటేష్ కి మెడల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సిఫార్సు చేశారు.
Gaddar Last Rites: బౌద్ధ మత ఆచారంలో ముగిసిన గద్దర్ అంత్యక్రియలు, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో అంతిమ సంస్కారాలు పూర్తి
Hazarath Reddyగద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో బౌద్ధ సంప్రదాయం ప్రకారం పూర్తి చేశారు. బౌద్ధ మత ఆచారంలో గద్దర్‌ అంత్యక్రియలు నిర్వహించారు.
Gaddar's Funeral: గద్దర్ అంతిమ యాత్రలో తొక్కిసలాట, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి
Hazarath Reddyగద్దర్ అంత్యక్రియల సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రజా గాయకుడుకు అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు.
Eco-Friendly Electric Buses: హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్న1300 పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే
Hazarath Reddyహైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని #TSRTC నిర్ణయించింది.
Gaddar Funeral: గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు
Telangana: మద్యం మత్తులో లారీ డ్రైవర్ భీభత్సం, షాపు ముందు బైక్ పార్కింగ్ చేస్తున్న వ్యక్తిని వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ, నిందితుడుకి తీవ్ర గాయాలు
Hazarath Reddyభూపాలపల్లి పట్టణంలోని ఓ షాపు ముందు టూ వీలర్ పార్కింగ్ చేస్తున్న క్రమంలో మైపల్లి గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. రంజిత్ లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. పార్కింగ్ చేసిన కార్లు, బైక్ పై నుంచి లారీ దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Andhra Pradesh Horror: నెల్లూరు జిల్లాలో దారుణం, కోడలితో సహా ముగ్గురిని కత్తులతో నరికి చంపిన అత్తింటి వారు, నిందితులంతా పరారీలో..
Hazarath Reddyనెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
Punganur Violence Case: పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మంది అరెస్ట్, 72కు చేరుకున్న మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య
Hazarath Reddyచిత్తూరు జిల్లాలోని పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది.
Video: వీడియో ఇదిగో, బండి లేదు నా గుండు లేదు పత్తా లేకుండా పోయారు, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సైటైర్లు
Hazarath Reddyఅసెంబ్లీలొ చివరి రోజు సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంటా సీఎం బండి సంజయ్ మీద పరోక్షంగా సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే బండి పోతే బండి .. గుండు పోతే గుండు అన్నోల్లు ఇప్పుడు బండి లేదు గుండు లేదు పత్తా లేకుండా పోయారు - సీఎం కేసీఆర్
Andhra Pradesh: వేలిముద్రతో అమ్మఒడి డబ్బు కాజేసిన వాలంటీర్‌, డబ్బులు అడిగితె ఇంకా పడలేదు వస్తే ఇస్తా అంటూ బుకాయిస్తున్నాడని మహిళ ఆవేదన
Hazarath Reddyనెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగినేనిగుంట గ్రామానికి మీరావళి అన్న కుమారుడు ఖాసీం పీర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా లబ్దిదారు హుస్సేనమ్మ వేలిముద్ర తీసుకున్న వాలంటీర్.. అమ్మఒడి డబ్బులు తన అకౌంట్ లోకి మళ్లించాడు.
Road Accident Video: ఘోర విషాదం వీడియో ఇదిగో, రూ. 500 చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయిన యువకుడు
Hazarath Reddy500 రూపాయల చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయాడు. హైదరాబాద్ - మొయినాబాద్ సమీపంలో విగ్నేష్ చారి అనే యువకుడు రోడ్డుపక్కన భోజనం చేసి, రూ.500నోటు ఇవ్వడంతో హోటల్ నిర్వాహకుడు చిల్లర లేదని చెప్పాడు. చిల్లర తీసుకొని వెనుదిరగగా లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు
Chandrababu on Work From Home to Police: వీడియో ఇదిగో, పోలీసులకు వర్క్ ఫ్రం హోం పెట్టాలని ఆలోచిస్తున్నా, చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు నాయుడు తన పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు వర్క్ ఫ్రం హోం పెట్టాలని ఆలోచిస్తున్నా చేస్తున్నానని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వీడియో ఇదిగో..
Chandrababu on liquor Policy: సాయంత్రం అయితే నా తమ్ముళ్లకు ఓ పెగ్గు పడాల్సిందే, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇక్కడ నా తమ్ముళ్లు మందు బాబులు ఉంటారు.. రోజంతా కష్టపడతారు, ఒక పెగ్గు వేసుకోవాలి అనుకుంటారు. కానీ రేట్లు పెరిగిపోయాయి, నాసిరకం సరుకు అమ్ముతున్నారని చంద్రబాబు నాయుడు ఏపీ మద్యం పాలసీపై మండిపడ్డారు. వీడియో ఇదిగో..
Telangana: చేనేత మిత్ర పథకం కింద ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గానికి నెలకు రూ.3000, చేనేత భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyజాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ (Minister KTR) శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో కలిసి చేనేత భవన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు.