రాష్ట్రీయం

Telangana: నల్గొండలో ప్రిన్సిపాల్ అమానుషం, విద్యార్థినుల చేతి వేళ్లు విరిగేలా కొట్టిన ప్రిన్సిపాల్...ఎందుకో తెలిస్తే షాకవుతారు

Arun Charagonda

నల్గొండ - వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావ తాగుతుండగా ప్రిన్సిపల్ జావ ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టడంతో చేతి మణికట్టు, బొటనవేలు విరిగినట్లు బాధిత విద్యార్థినులు తెలిపారు. ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ను నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: వీడియో ఇదిగో, మైలార్‌దేవ్‌పల్లిలో ఫుట్‌పాత్‌ ఆక్రమణలను కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ, పాదచారుల భద్రత ముఖ్యమని వెల్లడి

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో బుధవారం మైలార్‌దేవ్‌పల్లిలో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు.

Telangana TET Exam Schedule: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్, జనవరి 2 నుండి 20 వరకు టెట్ పరీక్షలు...వివరాలివే

Arun Charagonda

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ జరగనుంది.

CM Revanth Reddy: రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, అదానీ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్

Arun Charagonda

ఆదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై నిరసనగా చలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ నిర్వహించగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు.

Advertisement

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hazarath Reddy

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలైంది, ఉదయం 10 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గలేదు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Hazarath Reddy

అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్‌ కార్యక్రమం, పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..మంత్రులు, అదానీ వ్యవహారంపై ప్రధాని స్పందించాలని డిమాండ్

Arun Charagonda

అదానీ, మణిపూర్ అంశాలపై పర్ధాని మోడీ మౌనంపై నిరసనగా చలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఇందిరాపార్క్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

MP Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్, అరెస్ట్‌తో కేటీఆర్ హీరో కావాలనుకుంటున్నారు...కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Arun Charagonda

కేటీఆర్ అరెస్టు అయితే పుష్ప -3 లెవెల్ లో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టయినప్పుడు ప్రజల సానుభూతి లభించిందన్నారు.

Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు...కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో నాలుగు కేసులు నమోదు, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియా పోస్టులు

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు...నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

Telangana: ఇలాంటి దొంగను జన్మలో చూసుండరు ..నీళ్ల బిందెలను ఎత్తుకెళ్లిన దొంగ...సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

దొంగలంటే బంగారం, డబ్బు దోచుకుంటారు కానీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఎందుకంటే ఇద్దరు చిల్లర దొంగలు నీళ్ల బిందెలను ఎత్తుకెళ్లిన ఘటన సీసీ కెమెరాకు చిక్కింది. అర్థరాత్రి ఓ ఇంట్లో దూరి నీళ్ల బిందెలు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటుండగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ఆటో డ్రైవర్ల సమస్యపై చర్చించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందించేందుకు పాలకులు కమీషన్లు దండుకుంటున్నారని వివేకానంద చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

MLC Kavitha: మూసీ సుందరీకరణపై ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్దాలే, డీపీఆర్ రెడీ కాకముందే అప్పు కావాలని ప్రపంచబ్యాంకును కోరిన ప్రభుత్వం...ఎమ్మెల్సీ కవిత ఫైర్

Arun Charagonda

మూసీ భాగోతం ఆధారాలతో బైట పెట్టారు ఎమ్మెల్సీ కవిత. మూసీ సుందరీకరణ కోసం DPR రెడీ కాకముందే రూ.4,100 కోట్లు అప్పు కావాలని వరల్డ్ బ్యాంకును అడిగారని తెలిపారేఉ. మూసీ సుందరీకరణ కోసం వరల్డ్ బ్యాంకును అప్పు అడిగిన తేదీ - 19/09/2024 కాగా మూసీ DPR కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తేదీ - 4/10/2024 అన్నారు. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుపై చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు.

Telangana Assembly: ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దు..అండగా ఉంటామని భరోసా

Arun Charagonda

ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము..అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉంది.

CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Arun Charagonda

రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (#SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.

Telangana: రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడు, కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ - ఘట్‌కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద ఓ యువకుడు రూ.20 వేలు రోడ్డు పక్కన విసిరేసి, వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్‌గా మారి

Advertisement

Hyderabad: బాచుపల్లిలో 6 అడుగుల పాము, ఓ ఇంట్లోకి ప్రవేశించగా స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చిన స్థానికులు..ఎలా పట్టుకున్నాడో చూడండి

Arun Charagonda

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ భారీ పాము కలకలం రేపింది. బాచుపల్లిలోని కేఆర్సీఆర్ కాలనీలో 6 అడుగుల ఓరియంటల్ ర్యాట్ స్నేక్ ఓ ఇంట్లోకి చొరబడింది. దీంతో భయాందోళన చెందిన కాలనీవాసులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ భారీ సర్పాన్ని బంధించి సురక్షిత ప్రదేశానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Hazarath Reddy

కీసరలోని మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల(సనత్‌నగర్, కూకట్‌పల్లి) పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను, ఖమ్మంలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థినిని ఎలుకలు కరిచాయి

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Hazarath Reddy

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం డిసెంబర్ 17న జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్‌ సర్టిఫికెట్స్‌ కోర్స్‌ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.

Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్

Hazarath Reddy

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ను నార్సింగ్ లో ఏర్పాటు చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ సైకిల్ ట్రాక్ ను తొలగిస్తున్నారు అధికారులు.సైకిల్ ట్రాక్ ను జేసీబీ సాయంతో తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Advertisement