ఆంధ్ర ప్రదేశ్

CM Jagan Meets PM Modi: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కొనసాగుతున్న కీలక చర్చలు

Hazarath Reddy

ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కీలక చర్చలు జరుపుతున్నారు. ప్రధాని మోదీతో భేటీ ముగిసిన త‌ర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో జ‌గ‌న్ భేటీ కానున్నారు.

AP New Districts: ఏపీలో మరో కొత్త జిల్లా, గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం, రంపచోడవరం, పొలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ( another new district) వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని సంకేతాలు కూడా పంపించారు.

Babu Jagjivan Ram: బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ 115వ జయంతి, నివాళి అర్పించిన ఏపీ సీఎం జగన్, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అంటూ ట్వీట్

Hazarath Reddy

ఏప్రిల్‌ 5వ తేదీన బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ గారు.

CM YS Jagan Delhi Tour: ప్రధాని మోదీతో నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం ఢిల్లీ టూర్‌కు బయలుదేరారు. పర్యటనలో భాగంగా.. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.

Advertisement

Covid in AP: ఏపీలో ఒకే ఒక కరోనా కేసు నమోదు, 32 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

ఏపీలో గత రెండ్రోజులుగా కరోనా కేసుల బులెటిన్ విడుదల చేయలేదు. నేడు తాజా బులెటిన్ విడుదల చేయగా, ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,726 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది.

Andhra Pradesh: షాకింగ్ వీడియో.. భారీ శబ్దంతో పేలిపోయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌ బైక్, అనంతపురం జిల్లా నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ టెంపుల్ వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగి పేలిపోయింది ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో.. ఘటన జరిగినప్పుడు గుడి బయట గుమిగూడిన వ్యక్తుల గుంపును చూపిస్తుంది.

AP New Districts: పవన్ పల్లకి మోసిన టీడీపీ ప్రభుత్వం కాదు, ప్రజల ఆకాంక్షలతో నడుస్తున్న ప్రభుత్వం మాది, మంచి చేసేప్పుడు మంచి అని చెప్పలేని వారు నోటికి తాళం వేసుకోవాలంటూ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

Hazarath Reddy

మంచి చేసేప్పుడు మంచి అని చెప్పలేని వారు నోటికి తాళం వేసుకోవాలని హితవు పలికారు. వైఎస్‌ జగన్ (CM YS Jagan) చెప్పిన ప్రతిమాటలో 95 శాతం హామీలను నెరవేర్చారని మంత్రి తెలిపారు. చంద్రబాబు హయాంలో పాఠశాలలు మూతవేసే స్థాయి నుంచి ఈ రోజు సీట్లు లేవని బోర్డులు పెట్టే స్థాయికి సీఎం జగన్‌ తీసుకొచ్చారని కొనియాడారు.

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్‌ అభినందనలు, అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపిన బిశ్వభూషణ్ హరిచందన్

Hazarath Reddy

జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

Advertisement

New Districts in AP: 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, 26 జిల్లాల పరిధిలో రెవిన్యూ డివిజన్లు ,మండలాలపై సమగ్ర సమాచారం

Hazarath Reddy

ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్లు జారీ చేయగా నేడు సీఎం జగన్ అధికారికంగా కొత్త జిల్లాలను (New Districts in AP) లాంచ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాతో తొలి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది

New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్, నేటి నుంచి 26 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్, 72కు పెరిగిన రెవెన్యూ డివిజన్లు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలతో (New Districts in AP) సరికొత్త శకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. వర్చువల్‌గా కొత్త జిల్లాలను ప్రారంభించగా. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 వరకు పెరిగాయి.

AP Districts & Revenue Divisions: ఆంధ్రప్రదేశ్‌లో కొలిక్కి వచ్చిన కొత్త జిల్లాల పంచాయతీ, మొత్తం 26 జిల్లాలు, 73 రెవిన్యూ డివిజన్లు, గెజిట్ విడుదల, పూర్తి వివరాలు ఇవే!

Naresh. VNS

ఏపీ రాష్ట్రంలో కొత్త జిల్లాలు (New Districts), రెవెన్యూ డివిజన్లపై (Revenue Divisions) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తుది నోటిఫికేషన్లు సిద్ధం చేసింది. దీనిపై గెజిట్ విడుదల చేశారు. జనవరి 25న సీసీఎల్‌ఏ (CCLA) విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ల ఆధారంగా మొత్తం 26 జిల్లాలు ఉండనున్నాయి

Andhra Pradesh: ఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు, గ్రూప్‌ 1,2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Hazarath Reddy

రాష్ట్రంలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Corona in AP: ఏపీలో భారీగా తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో 8 మందికి కరోనా, అత్యధికంగా కృష్ణా జిల్లాలో 2 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 8,017 కరోనా పరీక్షలు నిర్వహించగా, 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 2 కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు వెలుగు చూశాయి.

CM YS Jagan Review: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు & భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష, లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని ఆదేశాలు

Hazarath Reddy

సీఎం మాట్లాడుతూ.. లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) ఆకాంక్షించారు. సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు.

MP Vijayasai Reddy: కాంగ్రెస్ పార్టీ వల్లే రాజ్యసభలో అడుగుపెట్టాను, మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లే ఇక్కడకు వచ్చానంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు (I was able to come to the Rajya Sabha because of the Congress) రాగలిగానని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) ఛలోక్తి విసిరారు.

AP High Court: ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు, ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష, అధికారులు క్షమాపణ కోరడంతో శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించిన హైకోర్టు

Hazarath Reddy

ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు నిచ్చింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష (8 IAS officers to jail for contempt) విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. వీరికి రెండు వారాల పాటు కోర్టు (Andhra Pradesh high court ) జైలు శిక్షను విధించింది.

Advertisement

Tension Erupts at Srisailam: శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులు, కర్ణాటక వాసిపై గొడ్డలితో దాడి, ఆగ్రహంతో స్థానికంగా ఉన్న షాపులను ధ్వంసం చేసి కన్నడిగులు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు

Hazarath Reddy

చాయ్‌ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఈ క్రమంలో స్థానికులు కర్ణాటక వాసిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Ruckus at Srisailam: మంచినీళ్లు అడిగినందుకు గొడ్డలితో దాడి, శ్రీశైలంలో కన్నడ భక్తుల భీభత్సం, పలు వాహనాలకు నిప్పు, కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేసిన టీ షాపు యజమాని

Naresh. VNS

ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రం కావడంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

Srikakulam Shocker: శ్రీకాకుళంలో దారుణం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో గర్భవతి అయిన ఇంటర్ చదివే బాలిక, విషయం దాచిన ప్రిన్సిపాల్ సస్పెండ్, కేసు నమోదు..

Krishna

పొన్నాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బయట పడటంతో అధికారులు అవాక్కయ్యారు.

Corona in AP: ఏపీలో ఆరు జిల్లాల్లో కొత్త కేసులు నిల్, గత 24 గంటల్లో 15 మందికి కరోనా

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 8,349 కరోనా పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శ్రీ‌కాకుళం జిల్లాలో 4 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Advertisement
Advertisement