ఆంధ్ర ప్రదేశ్
Jr NTR Latest Video: రాజకీయంలో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం, మహిళలను పరుష పదజాలంతో దూషించడం మన సంస్కృతి కాదు, ట్విట్టర్ ద్వారా వీడియో విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyనిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ పరిణామాలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ఈ మేరకు శనివారం ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు. నిన్నటి అసెంబ్లీ ఘటన కలిచివేసిందని, మహిళలను పరుష పదజాలంతో దూషించడం మన సంస్కృతి కాదని పేర్కొన్నారు.
Jr NTR on AP Politics: ఏపీ రాజకీయాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆవేదన, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని వీడియో విడుదల
Hazarath Reddyఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నందమూరి తారక రామారావు మనవడు, దివంగత హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నిన్న అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, అంతేకానీ అలా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని చెప్పారు.
Balakrishna Press Meet: అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిడిలో ఉన్నామా?, అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలపై మండిపడిన బాలకృష్ణ, వ్యక్తిగతంగా దాడి చేస్తే.. తాము దాడి చేయాల్సి వస్తుందని హెచ్చరిక
Hazarath Reddyచంద్రబాబు చాలా గట్టి మనిషని, ఆయన ఎప్పుడూ కంటతడి పెట్టడం చూడలేదని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ హయాం నుంచీ అసెంబ్లీలో సమస్యలపైనే కొట్లాడేవాళ్లమన్నారు. అలాంటిది ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఎదుటి వారి పరువుపై కొడుతున్నారని విమర్శించారు.
AP Special Status Row: ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు, మీకున్న కారణాలేంటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించిన ఏపీ హైకోర్టు, ఇదే అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు, తదుపరి విచారణ డిసెంబర్‌ 20కి వాయిదా
Hazarath Reddyఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరో తెలియజేయాలని (AP high court directed central government) హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు కారణాలు ఏమిటో చెప్పాలంది.
MLC Karimunnisa Dies: గుండెపోటుతో కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్, వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుందని ట్వీట్
Hazarath Reddyకృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది.
Building Collapsed in Anantapur: కదిరిలో కూలిన మూడంతస్తుల భవనం, ముగ్గురు చిన్నారులతో సహా మహిళ మృతి, భవనం శిథిలాల కింద మరో 10 మంది
Hazarath Reddyఅనంతపురం జిల్లా కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్‌ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. రెండంతస్తుల భవనంపై నిర్మాణంలోని నాలుగంతస్తుల భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.
Andhra Pradesh Floods: గంగమ్మ ఉగ్రరూపం, వణుకుతున్న మూడు జిల్లాలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే
Hazarath Reddyవరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే (CM YS Jagan Aerial Survey) నిర్వహించడానికి గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయల్దేరారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వైఎస్‌ జగన్, అధికారులతో కలిసి పరిశీలించనున్నారు.
AP Cabinet Decisions: పలు బిల్లులకు కేబినెట్‌ ఆమోదం, ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు, 29న విద్యాదీవెన కార్యక్రమం, ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు పదవీ బాధ్యతలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Andhra Pradesh cabinet meeting) ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకూ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో శాసన సభలో ప్రవేశ పెట్టాల్సిన ముసాయిదా బిల్లులపై మంత్రి వర్గం చర్చించింది.
PM Modi Phone Call to AP CM: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌, ఏపీలోని వరద పరిస్థితులపై ఆరా తీసిన ప్రధాని, కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ
Hazarath Reddyఏపీలోని వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.
Andhra Pradesh: వీడియో, చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సేఫ్, ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా కాపాడిన ఇండియన్ నేవీ సిబ్బంది
Hazarath Reddyఆగమేఘాలపై ప్రత్యేక హెలికాప్టర్ అనంతపురం వచ్చింది. సహాయక బృందాలు చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా కాపాడాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. సీఎం సత్వర స్పందనపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 168 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 31,040 కరోనా పరీక్షలు నిర్వహించగా, 168 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 26, విశాఖ జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి.
Babu Challenge Exclusive Video: చంద్రబాబు అసెంబ్లీ ఛాలెంజ్ ఎక్స్‌క్లూజివ్ వీడియో, సీఎంగా గెలిచాకే ఈ సభలో అడుగుపెడతానంటూ ఉగ్రరూపం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన తర్వాత, ప్రతిపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాతనే సభలోకి ప్రవేశిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
Andhra Pradesh Floods: బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం, ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేలు, వరద సహాయక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష
Hazarath Reddyభారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై (Andhra Pradesh Floods) శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (CM YS Jagan Mohan reddy VC) నిర్వహించారు.
AP Assembly Day 2: మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు, టీడీపీ అధినేత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం వైయస్ జగన్, చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారనే విషయం అందరికీ తెలుసంటూ చురక
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు (AP Assembly Day 2) వాడి వేడిగా ముగిశాయి. వ్యవసాయ రంగంపై జరుగుతున్న చర్చ కాస్తా వ్యక్తిగత చర్చగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సీఎం గా గెలిచిన తరువాతనే అసెంబ్లీలో అడుగుపెడతానని శపధం చేశారు
AP Assembly Session 2021: వ్యవసాయ రంగంపై చర్చ, అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా, సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు, మళ్లీ సీఎంగా గెలిచాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండవ రోజు సమావేశాలు (AP Assembly Session 2021) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీలో (BAC) నిర్ణయించిన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది.
Chandrababu Naidu: వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు, ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం, నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. శాసనసభలో అవమానాలను భరించలేకపోతున్నానని... మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి చంద్రబాబు (Chandrababu Naidu) అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.
AP Shocker: బెడ్ రూంలో మరొకరితో భార్య.. తట్టుకోలేక రోకలిబండతో కొట్టి చంపేసిన భర్త, నీ కూతురుని చంపేశానంటూ మామకు ఫోన్, అనంతపురం జిల్లా కదిరిలో దారుణ ఘటన
Hazarath Reddyఅనంతపురంలో దారుణ ఘటన చేసుకుంది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం (having illicit affair in Kadiri) సాగించడం కళ్లారా చూసిన భర్త.. తన భార్యను రోకలిబండతో తలపై బాది (Man Kills wife) హతమార్చాడు. ఈ దారుణ ఘటన కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో జరిగింది.
Cheyyeru River Tragedy: వైఎస్సార్‌ జిల్లాలో తీవ్ర విషాదం, చెయ్యేరు నదిలో 15 మంది గల్లంతు, మూడు మృతదేహాలు వెలికితీత, చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyభారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎడతెరపిలేని వర్షం కారణంగా పలు జిల్లాలోని నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెయ్యేరు నదిలో 15 మంది (Cheyyeru River Tragedy) గల్లంతయ్యారు.
Andhra Pradesh Floods: వరద సహాయక చర్యలపై వర్యవేక్షణకు మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
Hazarath Reddyభారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు నీట మునిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్షాలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.
Corona in AP: ఏపీలో ధర్డ్ వేవ్ అలర్ట్, వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ పిలుపు, కొత్తగా 222 మందికి పాజిటివ్
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 31,473 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 222 మందికి పాజిటివ్ గా తేలింది. గుంటూరు జిల్లాలో 38, విశాఖ జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 28, నెల్లూరు జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు.