ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Shocker: వేరే కాపురం పెట్టాలని గొడవ..భర్తను గొడ్డలితో నరికి చంపేసిన భార్య, తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన, భార్యపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో భార్యాభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి చివరికిభర్త హత్యకు (Wife Kills Husband) దారితీసింది. తాళ్లరేవు మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు(32)ను అతని భార్య దేవి గొడ్డలితో నరికి చంపడం స్థానికంగా కలకలం రేపింది.

Corona in AP: ఏపీలో కొత్తగా1,623 మందికి కోవిడ్, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 కొత్త కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 15,158 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 65,596 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,623 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 276, నెల్లూరు జిల్లాలో 194 కేసులు నమోదయ్యాయి

Nellore Street Fight: బజారెకెక్కిన అక్రమ సంబంధం, నడిరోడ్డు మీద ఇద్దరూ తన్నుకుంటున్న వీడియో వైరల్, అనంతరం నెల్లూరు జిల్లా ఎస్ఫీకి ఫిర్యాదు చేసిన యువతి

Hazarath Reddy

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ వివాహేతర సంబంధం నడిరోడ్డు మీద కొట్టుకునేదాకా (Nellore Street Fight) వెళ్లింది.. ఈ ఫైట్ విషయంలోకి వెళితే..నెల్లూరు నగరానికి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావుకు తన దగ్గర పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం (woman reveals extramarital affair with doctor) పెట్టుకున్నాడు.

Delta Plus AY-12 Variant: తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకరంగా మారిన ఏవై.12 రకం కరోనా, ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదు, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 178 కేసులు వెలుగులోకి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు ‘ఏవై.12’ రకం కరోనా వేరియంట్ (Delta Plus AY-12 variant) ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్‌లో ఇది ఉపరకం. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Advertisement

Coronavirus in AP: నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,502 మందికి కరోనా, 24 గంటల్లో 16 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 14,883 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 63,717 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,502 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Huzurabad Bypoll 2021: దసరా తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, ఏపీలోని బద్వేల్‌ ఉప ఎన్నిక కూడా అప్పుడే, స్పష్టతనిచ్చిన ఎన్నికల కమిషన్

Hazarath Reddy

తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై (Huzurabad Bypoll 2021) ఎన్నికల కమిషన్ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెనపై ప్రభుత్వానికి హైకోర్టు షాక్, కాలేజీ ఖాతాల్లోనే ఫీజులు జమ చేయాలని ఆదేశాలు, ప్రభుత్వం ఇచ్చిన జీవో 28 కొట్టివేత, జీవో 64లోని సవరణల నిబంధనలు కొట్టివేత

Hazarath Reddy

జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేయడంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తల్లులు ఫీజు చెల్లించకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడాన్ని సవాల్‌ చేస్తూ కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరఫున హైకోర్టు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.

Guntur Shocker: బైక్ ఎక్కలేదని భార్యను కత్తితో పొడిచిన భర్త, గుంటూరులో దారుణం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. భార్య గొంతును భర్త కోసిన సంఘటన (Guntur Shocker) దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఇరికేపల్లి జంగాల కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో తన భార్య అల్లూరి భవానీ గొంతును భర్త సుధాకర్‌ కత్తితో కోసి (Husband killed his Wife) పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు భవానీ తన భర్త సుధాకర్‌పై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Andhra Pradesh: ఎంఎస్‌ఎంఈలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

వైసీపీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 27 నెలల్లోనే రూ.30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిశ్రమల ద్వారా 46,119 మందికి ఉపాధి లభించిందని తెలిపారు.

AP's COVID Report: 18 ఏళ్లలోపు పిల్లలకు కొవాగ్జిన్ టీకా 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి; ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,520 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 15 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఇప్పటివరకు 19,89,391 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 14,922 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది...

Andhra Pradesh: గతంలోలా హడావిడి కాదు.. నిజమైన కార్యక్రమాలు చేపడుతున్నాం! ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు నగదు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్

Team Latestly

ఒక పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌సెంటివ్‌ ఇస్తుందనే నమ్మకం కలిగించాలి. అప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని జగన్ అన్నారు...

Airport in Warangal: తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య, వరంగల్‌లో విమానాశ్రయం అభివృద్ధికి సూచనలు

Team Latestly

హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (హెచ్ఐఏఎల్) కోసం రాయితీ ఒప్పందం గడువు పొడిగింపు గురించి సింధియా తన లేఖలో ప్రస్తావించారు. రాయితీ ఒప్పంద వ్యవధి పొడిగింపు కొరకు HIAL యొక్క అభ్యర్థనను పున:పరిశీలించాలని మరియు దాని సిఫార్సులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు....

Advertisement

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,378 కోవిడ్ కేసులు నమోదు మరియు 1,139 మంది రికవరీ, 14,702కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 3 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకోగా, అందులో కోటి మందికి పైగా 18 నుంచి 44 ఏళ్ల వయసు వారు ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది...

YSR Vardhanthi: భౌతికంగా దూరమైనా జనహృదయాల్లో కొలువై ఉన్నారు! దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులు అర్పించిన ఏపి సీఎం జగన్

Team Latestly

Krishna Water Dispute: కృష్ణా నీటి వాటాపై కొలిక్కి రాని పంచాయితీ, విద్యుతుత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణకు సూచించిన కృష్ణా రివర్ బోర్డ్, ఏకపక్ష నిర్ణయం అంటూ సమావేశం నుంచి టీఎస్ అధికారుల వాకౌట్

Team Latestly

KRMB వైఖరి ఏకపక్షంగా ఉందని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై వీలైతే టీఎస్ సీఎం కేసీఆర్ గురువారం కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తారని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని వివరించే నివేదికను సమర్పించాలని నిర్ణయించినట్లు సమాచారం....

Corona in AP: ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లోనే కరోనా కేసుల కలవరం, కొత్తగా 1,186 మందికి కోవిడ్, 10 మంది మృ‌తి, జిల్లాల వారీగా కరోనా రిపోర్ట్ ఓ సారి చెక్ చేయండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 10 మంది (Covid Deaths) మృత్యువాత పడ్డారు.

Advertisement

HRC in Kurnool: ఏపీ ప్రభుత్వం కీలక అడుగు, కర్నూలులో హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీలో కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (AP State Human Rights Commission) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన ( Justice M. Sitaramamurthy) మీడియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు.

VROs Suspension in AP: ప్రభుత్వ భూముల మ్యుటేషన్..ప్రకాశం జిల్లాలో 11 మంది వీఆర్వోలు సస్పెండ్, విశ్రాంత తహసీల్దార్‌పై క్రిమినల్‌ కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశాలు

Hazarath Reddy

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను మ్యుటేషన్‌ (Govt lands Mutation) చేశారన్న ఆరోపణలపై ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని 11 మంది వీఆర్వోలు, ఓ విలేజ్‌ సర్వేయర్‌ను సస్పెండ్‌ (VROs Suspension in AP) చేశారు. అలాగే తహసీల్దార్‌ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Corona in Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,115 మందికి కరోనా, 24 గంటల్లో 19 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 14,693 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 19 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Battery Cars in Tirumala: తిరుమలలో ఇకపై బ్యాటరీ కార్లు, విద్యుత్‌ బస్సుల కోసం త్వరలోనే టెండర్లను పిలుస్తామని తెలిపిన దేవస్థానం ఛైర్మన్ సుబ్బారెడ్డి

Hazarath Reddy

తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో 35 బ్యాటరీ వాహనాలను ప్రారంభించిన సుబ్బారెడ్డి.. అదే వాహనంలో తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించారు.

Advertisement
Advertisement