ఆంధ్ర ప్రదేశ్
AP Local Body Polls: ఊపందుకున్న మూడో దశ పోలింగ్, ఉదయం ఆరున్నర గంటలకే ప్రారంభం, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ, 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు (AP Local Body Plls) ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.
Bhimavaram Businessman Murder: భీమవరం రొయ్యల వ్యాపారి దారుణ హత్య, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో హత్య చేసిన మృతదేహం, ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు
Hazarath Reddyభీమవరం బలుసుమూడికి చెందిన రామారావును ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అటవీ ప్రాంతంలో దారుణంగా హత్య (Bhimavaram Businessman Murder) చేశారు.నగదు లావాదేవీలే హత్యకు గల కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడికి చెందిన వీరాస్వామి, కోదండ రామారావుల మధ్య రొయ్యల వ్యాపారం విషయంలో కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్నాయని సమాచారం.
Covid in India: ముంబైలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, దేశంలో తాజాగా 9,121 మందికి కరోనా నిర్ధారణ, ఏపీలో 30 మందికి పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదు
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది.
AP Panchayat Elections 2021: రెండు దశల్లో వైసీపీదే హవా, రేపు మూడవ దశ పోలింగ్, 2,640 సర్పంచి పదవులకు ఎన్నికలు, 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ
Hazarath Reddyఏపీ పంచాయితీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడో విడతలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 2,640 సర్పంచి పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్‌శాఖ జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు చేశాయి.
Corporator Murder Case: కాకినాడ కార్పోరేటర్ దారుణ హత్య, గుంటూరులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, రియల్ ఎస్టేట్ వివాదంతో మూడు సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేసిన నిందితుడు
Hazarath Reddyఈ నెల 12వ తేదీన కార్పోరేటర్‌ రమేష్‌ను కాకినాడలో కారుతొ తొక్కించి దారుణంగా హత్య చేసిన సంగతి (Corporator Murder Case) విదితమే. నిందితుడు చిన్నా..రమేష్‌పైకి మూడు సార్లు కారు ఎక్కించి దారుణంగా హత్య చేసిన తరువాత పరారయ్యాడు. కాగా చిన్నాను గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం తమ్ముడితో కలిసి ఘటనాస్థలి నుంచి పారిపోయిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు గుంటూరులో పట్టుకున్నారు.
Ration Door Delivery: రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌, ఎస్‌ఈసీ ఆదేశాలపై స్టే విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో, తాజాగా ఆదేశాలతో రేషన్ డోర్ డెలివరీకి చర్యలు చేపట్టిన పౌరసరఫరాల శాఖ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ డోర్‌ డెలివరీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా వేసింది.
India Covid Updates: మహారాష్ట్రను మళ్లీ వణికిస్తున్న కరోనా, తాజాగా 4 వేల కరోనా కేసులు, ఒకే రోజు 40 మంది మృతి, దేశంలో తాజాగా 11,649 మందికి కోవిడ్, తెలంగాణలో తాజాగా 99 కొత్త కేసులు, ఏపీలో 55 మందికి పాజిటివ్
Hazarath Reddyదేశంలో దేశంలో గత 24 గంటల్లో 11,649 మందికి కరోనా నిర్ధారణ (India Covid Updates) అయింది. అదే స‌మ‌యంలో 9,489 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరింది.
AP Municipal Elections Schedule: ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు, 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్
Hazarath Reddyఏపీలో పంచాయితీ ఎన్నికల సమరం ముగియగానే మరో ఎన్నికల సమరానికి ఏపీ ఎస్‌ఈసీ (AP SEC) సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపింది.
Kurnool Road Accident: డ్రైవర్ నిద్రమత్తే కర్నూలు ప్రమాదానికి కారణం, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ప్రకటించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyకర్నూలు రోడ్డు ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు.
Covid Updates: కరోనా వ్యాక్సిన్ పనిచేయడం లేదా...తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు డాక్టర్లకు కరోనా, దేశంలో తాజాగా 12,194 కేసులు, ఏపీలో 54 మందికి కరోనా పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు, కరోనా పేషెంట్ల డేటా ఇచ్చేందుకు నిరాకరించిన చైనా
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 12,194 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus) అయింది. అదే స‌మ‌యంలో 11,106 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 92 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
AP Local Body Polls: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా 579 పంచాయతీలు ఏకగ్రీవం, ఈ నెల 17న పోలింగ్, 2,640 పంచాయతీలకు ఎన్నికలు, బరిలో 7,756 మంది అభ్యర్థులు
Hazarath Reddyఏపీలో రెండు విడతల పంచాయితీ ఎన్నికలు (AP Local Body Polls) ముగిశాయి. ఇప్పటివరకు రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయభేరి మోగించింది. 13 జిల్లాల్లో అత్యధిక స్థానాలను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకుని అగ్రస్థానాల్లో నిలిచారు. ఇక ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు (Andhra Pradesh Panchayat Elections) జరగనున్నాయి. మూడో దశ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటన చేశారు.
Kurnool Tragedy: నిద్రమత్తు..రెప్పపాటులో అంతా జరిగిపోయింది, కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు
Hazarath Reddyకర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో- లారీ ఢీ కొన్న ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి (Andhra Pradesh Road Accident) చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు.
AP Panchayat Election 2021: మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు, విచారణ జరపాలని ఎస్ఈసీని ఆదేశించిన హైకోర్టు, ఏపీలో ముగిసిన పోలింగ్, మధ్యాహ్నం 12.30 గంటల వరకు 64.75 శాతం పోలింగ్‌ నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రెండవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్‌ జరిగింది. క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం దక్కనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ పక్రియ మొదలవ్వనుంది.‌
India Covid Updates: నేటి నుంచి రెండో డోస్, దేశంలో 24 గంటల్లో 12,143 మందికి కరోనా, తెలంగాణలో తాజాగా 151 కరోనా కేసులు నమోదు, ఏపీలో 68 కొత్త కేసులు, ఇండియాలో 1,08,92,746కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 12,143 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,395 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 103 మంది కరోనా కారణంగా (Covid Deaths) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,550కు పెరిగింది.
AP Local Body Elections: సీఐ తుఫాకీతో చంపేస్తానని బెదిరిస్తున్నారు, ఏపీ సీఎంకు సెల్ఫీ వీడియో పంపిన రొంపిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ అంజయ్య, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, పోలీసుల అదుపులో అంజయ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుంటూరు జిల్లా రొంపిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ అంజయ్య (Rompicharla market yard chairman Anjayya) పంపిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. నరసరావుపేట టూటౌన్ సీఐ కృష్ణయ్య తుపాకీ పెట్టి చంపుతానని బెదిరించాడని ఆరోపిస్తూ సీఎం జగన్‌కు రొంపిచెర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ అంజయ్య ఈ సెల్ఫీ వీడియో (elfie video to AP CM ys jagan) ద్వారా ఫిర్యాదు చేశారు.
AP Local Body Polls: కుప్పంలో అక్రమ కేసులు ఆపండి, ఎస్ఈసీకి లేఖ రాసిన చంద్రబాబు, మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడకూడదని ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు, రాష్ట్రంలో మొదలైన రెండో దశ పోలింగ్
Hazarath Reddyఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ (Second Phase Gram Panchayat elections Polling)శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.
Ration Door Delivery: ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు ఇవ్వాల్సిందే, ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు తీర్పు వాయిదా
Hazarath Reddyపేదల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ రేషన్‌ పంపిణీ’ (Ration Door Delivery) పథకంపై కొన్ని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు స్పందించింది. మొబైల్‌ వాహనాలు (Mobile Dispensing Units) ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Volunteers Apology to AP CM: మమ్మల్ని క్షమించండి, విజయవాడ ధర్నాలో మా ప్రమేయం లేదు, కొంతమంది వ్యక్తుల ప్రలోభాలకు వాలంటీర్లు లోనయ్యారు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేస్తామని స్పష్టం చేసిన వాలంటీర్లు
Hazarath Reddyఈ మధ్య విజయవాడలో వాలంటీర్లు జీతాలు పెంచాలంటూ ధర్నా చేసిన సంగతి విదితమే. ఈ విషయంపై ఏపీ సీఎం (cm ys jagan mohan reddy) వారి విధి విధానాలు, సమయం గురించిన వివరాలతో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ లేఖపై వాలంటీర్లు స్పందించారు.