ఆంధ్ర ప్రదేశ్
AP Coronavirus Update: నందిగామ వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా, రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 6,235 మందికి కరోనా, యాక్టివ్‌గా 74,518 కేసులు, 5,410కు చేరిన మరణాలు
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,235 కరోనా కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో 6,31,749కి కరోనా కేసులు (COVID-19 cases) చేరాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కరోనాతో 51 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,410 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 74,518 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు వరకు కరోనా నుంచి కోలుకుని 5,51,821 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 51.60 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.
Status Quo Continues on AP Capital: ఏపీ రాజధాని తరలింపు, అక్టోబరు 5 వరకు స్టేటస్ కోను పొడిగించిన ఏపీ హైకోర్టు, అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని నిర్ణయం
Hazarath Reddyపరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల (Three Capitals) నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో చాలామంది పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి ఏపీ రాజధాని తరలింపుపై గతంలో ఇచ్చిన స్టేటస్ కోను హైకోర్టు అక్టోబరు 5 వరకు (Status Quo Continues on AP Capital) పొడిగించింది. రాజధాని పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (Andhra Pradesh high court) తదుపరి విచారణను అక్టోబరు 5కి వాయిదా వేసింది. ఇకపై అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం నిర్ణయించింది.
AP Covid Report: కరోనాని ఆపేది ఇంట్లో మాస్కులే, రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 7,738 మందికి కరోనా, 5 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, 5,359కు చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 10,608 మంది కరోనా వైరస్‌ (AP Covid Report) బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా విజేతల సంఖ్య 5,41,319కు చేరుకుంది. నిన్న ఒక్కరోజు 70,455 శాంపిళ్లను పరీక్షించగా, 7,738 మందికి కరోనా పాజిటివ్‌గా (COVID19 positive cases) తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ టెస్టుల సంఖ్య 51,04,131కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,25,514కు (Coronavirus) చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది
YSRCP Supports New Farm Bills: వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు, రైతులు ముందుగానే ధర నిర్ణయించుకునే అవకాశం, మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందని తెలిపిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి
Hazarath Reddyరాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు(YSRCP Supports New Farm Bills) ఇచ్చింది. కొత్తగా వచ్చిన బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో విజయసాయి రెడ్డి (YCP MP Vijaya Sai Reddy) మాట్లాడుతూ.. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుంది.
AP High Court: కోర్టుకు వచ్చే ముందు ప్రభుత్వానికి వినతి పత్రం తప్పనిసరి, సంబంధిత అధికారులను ఆశ్రయించకుండా డిమాండ్‌ ఆఫ్‌ జస్టిస్‌ కోసం వేసే పిటిషన్లను విచారించబోమని తెలిపిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేయాలనుకుంటే సంబంధిత అధికారులకు (authorities) వినతిపత్రం ఇచ్చి వారి అభిప్రాయం పరిగణలోకి తీసుకున్న తరువాతనే హైకోర్టు (AP High Court) గడప తొక్కాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫలానా వ్యవహారంపై ‘నిర్దిష్టమైన ఆదేశం’(మాండమస్‌) ఇవ్వాలని అభ్యర్థిస్తూ కోర్టుకి వచ్చే ముందు.. పిటిషనర్‌ ఆ అంశంపై అధికారులకు తప్పనిసరిగా వినతిప త్రం సమర్పించాలని హైకోర్టు తేల్చి చెప్పింది.
AP Covid Report: ఏపీలో కరోనాపై గుడ్‌న్యూస్, పెరుగుతున్న రికవరీ రేటు, తగ్గుతున్న కేసుల సంఖ్య, తాజాగా 8,218 కేసులు, 10,820 మంది డిశ్చార్జ్‌‌, రాష్ట్రంలో 5,30,711కు చేరుకున్న కోవిడ్ రికవరీ కేసుల సంఖ్య
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 10,820 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌‌తో (AP Covid Report) కోవిడ్‌ విజేతల సంఖ్య 5,30,711కు చేరుకుంది. గత 24 గంటల్లో 74,595 శాంపిళ్లను పరీక్షించగా, 8,218 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus (COVID-19) cases) తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ టెస్టుల సంఖ్య 50,33,676కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 617776కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 81763 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
AP Grama Sachivalayam Exam: నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ, రేపటి నుంచి సచివాలయ పోస్టుల భర్తీ పరీక్షలు, ఏడు రోజుల పాటు 14 రకాల రాతపరీక్షలు
Hazarath Reddyగ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు (AP Grama Sachivalayam Exam) మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను (AP Grama Sachivalayam 2020) నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.
TDP MLA Vasupalli Ganesh: విశాఖలో టీడీపీ షాక్, వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, విశాఖను ఆర్థిక రాజధానిగా స్వాగతిస్తున్నామని తెలిపిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే
Hazarath Reddyవిశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ (TDP MLA Vasupalli Ganesh) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు ఏపీ ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ కలిశారు. శనివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో తన కుమారులతో కలిసి ఆయన ...ముఖ్యమంత్రితో భేటీ (MLA Vasupalli Ganesh Meets CM YS Jagan Mohan Reddy) అయ్యారు. ఎమ్మెల్యే కుటుంబంతో పాటు వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.
Irrigation Projects in AP: జలకళ.. ప్రాజెక్టుల కోసం రానున్న ఐదేళ్లలో రూ. 96550 కోట్లు ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వం, కొత్త ప్రాజెక్టులకు రూ.72458 కోట్లు ఖర్చు పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో సాగునీటి రంగానికి చెందిన ప్రాజెక్ట్‌లు లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు వైయస్ జగన్ సర్కారు (YS Jagan Govt) ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు (Irrigation Projects in AP) లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతో పాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Road Cess on Fuel in AP: ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు ఝలక్, పెట్రోల్ మరియు డీజిల్‌పై పన్ను విధిస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు అభివృద్ధి పనుల కోసమేనని వెల్లడి
Team Latestlyఇటీవల కాలంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, ఈ సెస్ ద్వారా సమకూరే నిధులను రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.....
AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 8,096 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 6,09,558కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 5244కు పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 11,803 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,19,891 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 84,423 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో 6 లక్షలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 8,702 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5177కు పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,712 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,08,088 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 88,197 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....
Telangana Liberation Day 2020: విలీనమా.. విమోచనమా? తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్, తెలంగాణ ప్రాంతంలో ఈరోజుకున్న విశిష్టత తెలుసుకోండి
Team Latestlyసెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా, నిజాం పాలను అంతమొందిన సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా చెప్తారు. అయితే అది విమోచనం కాదు, భారతదేశంలో విలీనమైన రోజు మాత్రమే అని మరొక 'రాజకీయ' వాదన....
AP Coronavirus: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 10,845 మంది డిశ్చార్జ్‌, 24 గంటల్లో 8,835 కొత్త కేసులు, 64మంది మృతితో 5,105కి చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 10,845 మంది కరోనా (AP Coronavirus) నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,97,376కి (AP Corona Updates) చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48,06,879 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,013 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,835 మందికి పాజిటివ్‌గా తేలింది.
MP Balli Durga Prasad Rao Dies: తిరుపతి ఎంపీ కన్నుమూత, కరోనాతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన బల్లి దుర్గాప్రసాద్ రావు‌, గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyతిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌(64) బుధవారం కరోనాతో పాటు గుండెపోటు రావడంతో (MP Balli Durga Prasad Dies) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్‌కు (Tirupati MP Balli Durga Prasad) తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్‌ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Silver Lion Idols Missing: దుర్గ గుడిలో వెండి రథం, సింహం ప్రతిమలు మాయం, ఘటనపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం
Hazarath Reddyవిజయవాడ దుర్గమ్మ గుడిలోని వెండి రథం, నాలుగు వైపులా ఉండే వెండి సింహం ప్రతిమలు మాయమైనట్టు (Durga Temple Silver Lion Idols Missing) ఆలయ అధికారులు గుర్తించారు. రథానికి నాలుగు వైపులా ఉండాల్సిన సింహం ప్రతిమల్లో మూడు కనిపించడం లేదని (Durga Temple Silver Lion Idols) ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ (Vellampalli Srinivasa Rao) అమ్మవారి వెండి రథాన్ని బుధవారం పరిశీలించారు. అమ్మవారి వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందని వెల్లడించారు. ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Smartphones Looted in Guntur: రూ.70 లక్షల విలువైన రెడ్‌మీ ఫోన్ల దొంగతనం, గుంటూరు-కోల్‌కత హైవే భారీ చోరీ చేసిన దుండుగులు, మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్
Hazarath Reddyఏపీలో మరోసారి భారీ స్థాయిలో మొబైల్ ఫోన్ల దొంగతనం జరిగింది. శ్రీసిటీ నుంచి కోల్‌కత వెళ్తున్న మొబైల్ ఫోన్ల లారీలో రూ.70 లక్షల విలువైన రెడ్ మీ ఫోన్లను దుండగులు ( Smartphones looted) అపహరించారు. గుంటూరు-కోల్‌కత హైవే (ఎన్‌హెచ్‌-16)పై బుధవారం ఈ భారీ చోరీ (Smartphones Looted in Guntur) జరిగింది. తన లారీలో దొంగతనం జరిగిందని గుర్తించిన డ్రైవర్‌ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
108 Ambulance Ablaze in Ongole: రోగుల్ని కాపాడే 108కే నిప్పంటించారు, ఒంగోలు పోలీస్టేషన్ పరిధిలో ఓ రౌడీ వీరంగం, అర్ధరాత్రి పోలీసులకు చుక్కలు చూపించిన రౌడీ షీటర్
Hazarath Reddyప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్ లోనే ఓ రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. ఒంగోలు తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో నేలపాటి సురేష్ అనే రౌడీ షీటర్ అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ కేసు విచారణలో భాగంగా అతన్ని స్టేషన్‌కు (police station) తరలించగా అక్కడున్న పోలీసులకు చుక్కలు చూపించాడు. స్టేషన్‌లో అర్ధరాత్రి డోర్ అద్దాలు పగలగొట్టి చేతులు గాయపరుచుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులు 108 వాహనం ఎక్కించి రిమ్స్‌ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ ఎక్కిన నిందితుడు అక్కడ ఉన్న కాటన్‌కు (108 Ambulance Ablaze in Ongole) నిప్పంటించాడు. అందరూ చూస్తుండగానే మంటలు ఎగసిపడ్డాయి.
AP Covid Report: ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా, ఏపీలో తాజాగా 8,846 మందికి కోవిడ్, 4,86,531కి చేరుకున్న డిశ్చార్జ్‌ కేసుల సంఖ్య, 5,041కి చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,628 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,86,531కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 47,31,866 శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 70,511 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,846 మందికి పాజిటివ్‌గా (new corona positive cases) తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కు (AP Covid Report) చేరింది. కొత్తగా 69మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,041కి చేరింది. ప్రస్తుతం 92,353 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.