ఆంధ్ర ప్రదేశ్

Temple Chariot Catches Fire: ప్రమాదమా..విద్రోహచర్యా? అంతర్వేదిలో అగ్నికి ఆహుతైన రథం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమాదం, విచారణ చేపట్టిన పోలీసులు

Hazarath Reddy

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో (Sri Lakshmi Narasimha Swamy temple) ప్రమాదం చోటుచేసుకుంది. ఘన చరిత్ర కలిగిన స్వామి వారి రథం (Temple Chariot Catches Fire) అగ్నికి ఆహుతైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.

AP Coronavirus Report: ఏపీలో తాజాగా 10,825 మందికి కరోనా, రాష్ట్రంలో 4,87,331కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, కొత్తగా 71 మంది మృతితో 4,347కి చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69,326 నమూనాలు పరీక్షించగా 10,825 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు ( Coronavirus Updates in AP) చేరింది. కొత్తగా 71 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,347కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

State Business Reform Action Plan 2019: దేశంలో ఏపీదే అగ్రస్థానం, రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక 2019 ర్యాకింగ్స్‌ను విడుదల చేసిన కేంద్రం

Hazarath Reddy

దేశీయ మరియు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి, రాష్ట్రాల మధ్య పోటీని సృష్టించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేసులో రాష్ట్రాల ర్యాంకింగ్ విడుదల చేయబడింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. భారతదేశం యొక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ర్యాంకింగ్ వ్యాపారం సులభతరం చేసే వర్చువల్ కార్యక్రమంలో ఇది విడుదల చేయబడింది. అంతకుముందు 2018 సంవత్సరంలో ఇటువంటి ర్యాంకింగ్ విడుదలైంది.ఈ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ మూడో స్థానంలో, ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి.

AP Tourism Guidelines: పర్యాటకంపై జగన్ సర్కారు కీలక ఆదేశాలు, ఇకపై పర్యాటక కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్లను తప్పనిసరి, అత్యుత్తమ పర్యాటక సేవలు అందించేలా చర్యలు

Hazarath Reddy

ఏపీలో పర్యాటక కార్యకలాపాల కోసం రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు (AP Tourism Guidelines) జారీ చేసింది. టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్, ఫెసిలిటేషన్ పేరిట మార్గదర్శకాలను పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు. టూరిజం ఆపరేటర్ల రిజిస్ట్రేషన్ కోసం యంత్రాంగం లేకపోవటంతో గణాంకాల నమోదుకు వీలు కావటం లేదని నిర్దిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు (making registrations of tourism activities mandatory) జారీ చేసింది.

Advertisement

Liquor Bottles in Water Tank: వాటర్ ట్యాంకులో 10 వేల మద్యం సీసాలు, అమరావతిలో సీజ్ చేసిన గుంటూరు పోలీసులు, కొరియర్‌ సెంటర్ల ద్వారా అక్రమ మద్యం దందా

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నా రకరకాల మార్గాల ద్వారా మద్యం దందా సాగుతుంది. కొరియర్ , పార్సిల్ సర్వీసుల ద్వారా భారీగా అక్రమ లిక్కర్ దందా జరుగుతున్నట్టు ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు గుర్తించారు. తాజాగా అమరావతి మండలం మునగోడులో భారీగా మద్యం పట్టుబడింది. వాటర్‌ ట్యాంకులో (Liquor Bottles in Water Tank) దాచిన 10 వేల తెలంగాణ మద్యం సీసాలను (10-thousand liquor bottles) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Free Electricity in AP: ఏపీలో ఉచిత విద్యుత్ పథకం శాశ్వతం, సందేహాలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఇంధనశాఖ, రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలిపిన బాలినేని శ్రీనివాసరెడ్డి

Hazarath Reddy

ఏపీలో వ్యవసాయ విద్యుత్‌కు (Free Electricity in AP) నగదు బదిలీపై ఎలాంటి అనుమానాలకు తావులేదని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని ఏపీ రాష్ట్ర ఇంధనశాఖ (Andhra Pradesh Energy Department) స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాలను కాపాడటం, ఉచిత విద్యుత్‌ పథకాన్ని శాశ్వతం చేసేందుకు నగదు బదిలీ తోడ్పడుతుందని ఇంధనశాఖ ( Energy Department) పేర్కొంది. నగదు బదిలీపై వ్యక్తమవుతున్న సందేహాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి సమగ్రంగా నివృత్తి చేశారు.

Corona in AP: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా తొమ్మిదో రోజూ 10 వేలు దాటిన పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 4 లక్షల 76 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4276కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

రాష్ట్రంలో వరుసగా 9వ రోజు 10 వేలకు పైబడి కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,776 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,76,506కు చేరింది....

AP Cabinet Meet Highlights: జూదం లాంటి ఆన్‌లైన్ గేమ్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం, సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం

Team Latestly

యువతను తప్పుడు మార్గంలో నెట్టివేస్తున్న రమ్మీ, పేకాట వంటి ఆన్‌లైన్ ఆటలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం...

Advertisement

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,199 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 లక్షల 65 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 4200కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా తీవ్రత బీభత్సంగా ఉంది. ఈ జిల్లా నుంచి ప్రతిరోజు వెయ్యికి తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే...

India's COVID19: భారత్‌లో కరోనా కల్లోలం, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 83 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, దేశంలో 38.53 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య

Team Latestly

కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారించబడిన కేసులు 8 లక్షలు దాటాయి. నిన్నటివరకు మొత్తం కేసుల సంఖ్య 8,25,739గా ఉండగా, మరణాల సంఖ్య 25,195 గా ఉంది....

AP Coronavirus: కొత్త న్యూస్.. కళ్లద్దాలపై కరోనా, కరోనా బారీన పడి చనిపోయిన వాళ్లలో మగవాళ్లే ఎక్కువ, ఏపీలో తాజాగా 10,392 మందికి కరోనా

Hazarath Reddy

ఏపీలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు 38 లక్షలు దాటాయి. ఇప్పటివరకూ 38,43,550 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 60,804 పరీక్షలు చేయగా, 10,392 మందికి పాజిటివ్‌గా (Coronavirus) నిర్ధారణ అయ్యింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 4,55,531కి కరోనా కేసులు (positive cases) చేరాయి. గత 24 గంటల్లో 72 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,125 కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Telugu States RTC: బస్సు సర్వీసుల పునరుద్ధరణ, టీఎస్ఆర్టీసీకి కీలక ప్రతిపాదన చేసిన ఏపీఎస్ఆర్టీసీ, బస్సు సర్వీసులను పెంచుకోవాలని లేఖ రాసిన ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, తెలంగాణ నుంచి ఏపీకి తిరిగే బస్సుల సంఖ్యతో పోలిస్తే, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే బస్సుల సంఖ్యే అధికంగా ఉండేదన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా బస్సులు ఆగిపోయిన తరువాత, తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనలో రెండు రాష్ట్రాలూ ఉన్నప్పటికీ, సమాన కిలోమీటర్ల మేరకు బస్సులను తిప్పేలా అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలని టీఎస్ (TSRTC) భావిస్తోంది.

Advertisement

Telangana Coronavirus: కరోనాతో వైద్య సిబ్బంది మరణిస్తే రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కారు, ఇప్పటికే రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

Hazarath Reddy

కరోనాతో మరణించిన వైద్యసిబ్బంది కుటుంబాలకు రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా (₹25 lakh ex-gratia) రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ (Etela Rajender) వెల్లడించారు. మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో డాక్టర్ల సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.డాక్టర్ సంఘాల డిమాండ్లని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు డాక్టర్ల సంఘాలకు తెలిపారు. కరోనా బారిన పడిన డాక్టర్ లకు నిమ్స్ లో వైద్యసేవలు అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

Power Subsidy Row: రైతులకు జగన్ సర్కారు శుభవార్త, అన్నదాతల అకౌంట్లోకే విద్యుత్ సబ్సిడీ మొత్తం, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై రైతుల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఇందులో భాగంగా ఇకపై సబ్సిడీ మొత్తాన్ని (Power Subsidy) నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో ( farmers’ bank accounts ) జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు రైతులు చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై ఆ బెంగ లేకుండా రైతుల ఖాతాలో జమ చేసిన తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది.

Liquor Transport: పక్క రాష్ట్రం నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చు, స్పష్టం చేసిన హైకోర్టు, జీవో 411 అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు

Hazarath Reddy

మద్యం నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన వేళ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.గతంలో మాదిరే ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి 3 మద్యం సీసాలను తీసుకురావొచ్చని (AP High Court Judgement on Liquor Transport) స్పష్టం చేసింది. ఏపిలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. పోలీసులు, ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు మద్యం సీజ్‌ చేస్తున్నారని పిటిషనర్లు వాపోయారు.

#YSRVardhanthi: దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, ప్రతి అడుగులోనూ నాన్నే నాకు తోడు అంటూ సీఎం జగన్ ట్వీట్, వై.యస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

#వైయస్సార్.. ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది.నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది.అలాంటి మహానేత చేసిన పాదయాత్ర (YSR's Praja Prasthanam) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలి పాదయాత్రగా లిఖించబడిన ఓ ప్రస్థానం. 53 ఏళ్ల వయసులో దాదాపు 1470 కి.మీ సాగిన పాదయాత్ర ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచింది.

Advertisement

Three Pawan Fans Electrocuted: పవన్ పుట్టిన రోజు వేడుకల్లో ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం, ఘటనపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు, చిరంజీవి, వకీల్ సాబ్ చిత్ర యూనిట్

Hazarath Reddy

జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా, పెను విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో కొందరు ఫ్యాన్స్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ (Three Pawan Fans Electrocuted) తగిలింది. దీంతో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.

AP Coronavirus Update: రెండోసారి కరోనా లేదని తెలిపిన ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి, ఏపీలో తాజాగా 10,368 మందికి కరోనా, 84 మంది మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 59,834 నమూనాలు పరీక్షించగా 10,368 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Updates) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,139 కు చేరింది. కొత్తగా 84 మంది కరోనా బాధితులు మృతి (Coronavirus Deaths) చెందడంతో ఆ సంఖ్య 4,053కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 9,350 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

Coronavirus in AP: ఏపీలో తాజాగా 10,004 మందికి కరోనా, 4,34,771కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, తాజాగా 85 మంది మృత్యువాత, రాష్ట్రంలో 3969​కు చేరుకున్న మృతుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 10,004 పాజిటివ్‌ కేసులు (Coronavirus in AP) వెలుగు చూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,771కు (Andhra pradesh corona cases) చేరింది. నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 85 మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరులో పన్నెండు, చిత్తూరులో తొమ్మిది, ప్రకాశంలో తొమ్మిది, కడపలో ఎనిమిది, అనంతపురంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు,కర్నూలులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు.

Comprehensive Land Survey in AP: ఏపీలో జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే, భూ సర్వే పైలెట్‌ ప్రాజెక్టుపై సమీక్ష చేపట్టిన ఏపీ సీఎం వైయస్ జగన్, 2023 ఆగస్టు నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీలో భూ సర్వే పైలెట్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా.. జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే (Comprehensive Land Survey in AP) చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2023, ఆగస్టు నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.

Advertisement
Advertisement