ఆంధ్ర ప్రదేశ్
Heavy Rainfall Alert: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చ‌రిక‌, మరింత చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు (Mansoon) రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కోస్తాంధ్ర‌లో (Coastal Andhra) భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని విశాఖ వాతావరణ కేంద్రం (Visakha IMD) వెల్ల‌డించింది. ఈ రోజు తూర్పు మధ్య‌ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవ‌కాశముంద‌ని తెలిపింది. ఇది ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా ప‌య‌నిస్తూ మ‌రింత‌ బ‌ల‌ప‌డ‌నుంద‌ని.. దీని వ‌ల్ల‌ తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని తెలిపింది. అల్ప పీడ‌న ప్ర‌భావంతో రేపు కోస్తాంధ్ర అంత‌టా విస్తారంగా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు ప‌డ‌తాయ‌న్నారు. మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.
AP SEC Row: నిమ్మగడ్డ వ్యవహారంలో ఊహించని ట్విస్టు, ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగం శ్రీకాంత్‌రెడ్డి
Hazarath Reddyరాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజు రోజుకు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్ ప్రభుత్వం (YS Jagan Govt) దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. అయితే ఈ ఈసారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ( Nimmagadda Ramesh Kumar) వ్యతిరేకంగా హైకోర్టులోనే ఓ పిటీషన్ దాఖలైంది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ కోవారెంట్ పిటీషన్ (Quo Warranto petition) దాఖలైంది. ఏపీ హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది.
Kanaka Durga Temple: జూన్ 10 నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనం, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనాలు
Hazarath Reddyఅన్‌లాక్ 1 నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏపీలో ఆలయాలు (temples Reopen in AP) తెరుచుకున్నాయి. ప్రధాన ఆలయాల్లో రెండు రోజుల ట్రయిల్ రన్ తర్వాత భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో (Kanaka Durga Temple) భక్తుల దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 10వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.
Comprehensive Land Survey: ఏపీ సీఎం కీలక నిర్ణయం, సమగ్ర భూసర్వే వేగ‌వంతం చేయాలని అధికారులకు ఆదేశాలు, మూడు విడతల్లో సర్వే చేయాలని అధికారులకు సూచన
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జ‌గ‌న్ మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సమగ్ర భూసర్వేను (Comprehensive Land Survey) వెంటనే ప్రారంభించాల‌ని అధికారులను ఆదేశించారు. మూడు విడ‌త‌ల్లో స‌ర్వే ప‌నులు పూర్తి చెయ్యాల‌ని.. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అధికారులకు సూచించారు. మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని సర్వే చేయాలన్న ముఖ్య‌మంత్రి.. సర్వే రాళ్ల ఖర్చు కూడా స‌ర్కారే భ‌రిస్తుంద‌న్నారు. క్యాంపు ఆఫీసులో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ (AP CM YS Jagan) రివ్యూ చేశారు. ఈ సమావేశంలో సీఎం చీఫ్ అడ్వైజ‌ర్ అజేయ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి..సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Vizag Divya Murder Case: విశాఖ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది, దివ్య హత్య కేసులో మొత్తం ఆరుమంది అరెస్ట్, లోతుగా విచారణ చేపడుతున్న విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు
Hazarath Reddyఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దివ్య హత్య కేసును (Vizag Divya Murder Case) విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. దివ్య హత్యలో పాల్గొన్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని విశాఖ పోలీసులు యోచిస్తున్నారు. కోర్టులో పిటిషన్ వేసి, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలు వసంతతో పాటు, నలుగురు మహిళలు, ఒక వ్యక్తి అరెస్టయిన సంగతి విదితమే.
AP Assembly Session 2020: జూన్ 16 నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు, ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టే అవకాశం, ఈ నెల 11న కేబినెట్ భేటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 (జూన్ 16) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన వైఎస్సార్ సీపీ సర్కార్.. ఈ అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను (AP Assembly Budget Session 2020) ప్రవేశపెట్టనుంది. జూన్ 16న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు.
TDP MLA Karanam Balaram: వైసీపీలోకి 10 నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుతో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం
Hazarath Reddyటీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం (TDP MLA Karanam Balaram) తెలుగుదేశం పార్టీ మీద, దాని అధినేత మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీ అధినేత చంద్రబాబుతో (TDP Chief Chandrababu) ) ఎంతకాలం నుంచి ఉన్నామో అందరికీ తెలుసని, ఎంత ఇబ్బంది పడ్డామో కూడా తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వైఖరికి, జగన్ వ్యవహారశైలికి ఎంతో తేడా ఉందని, జగన్ (YS Jagan) తనను నమ్మినవాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తాడని స్పష్టం చేశారు. జగన్ తండ్రి వైఎస్ తోనూ తమకు సన్నిహిత సంబంధాలుండేవని కరణం గుర్తుచేసుకున్నారు.
AP Coronavirus: ఏపీలో అన్నీ ఓపెన్, తాజాగా 125 కోవిడ్ 19 కేసులు, జ్వరం,దగ్గు లక్షణాలుంటే వెంటనే 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు
Hazarath Reddyఏపీలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 14,246 మందికి పరీక్షలు నిర్వహించగా 125 మందికి కరోనా పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య (COVID-19 Cases) 4813కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో 838 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉండగా, 132 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.
AP's COVID19 Report: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 199 పాజిటివ్ కేసులు మరియు మరో 2 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో 4,659కు చేరిన మొత్తం కరోనా బాధితుల సంఖ్య
Team Latestlyతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3718 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది...
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో 4,460కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 210 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyకేసులు పెరిగినా, కొత్తగా నమోదైన కరోనా మరణాలేమి లేకపోవడం ఊరటనిచ్చే విషయం. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 73 గా ఉంది. మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 29 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Weather Forecast: చురుగ్గా విస్తరిస్తున్న రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో చల్లబడ్డ వాతావరణం, రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్న భారత వాతావరణ శాఖ
Team Latestlyరాబోయే ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయని, వచ్చే వారం నాటికి దక్షిణ భారతదేశం అంతటా మరియు మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో....
Meera Chopra Issue: మీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామి, ధన్యవాదాలు తెలిపిన టాలీవుడ్ నటి
Team Latestlyసినీ నటి మీరా చోప్రా ఫిర్యాదుపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరా చోప్రా చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని...
TTD Darshan Tickets: జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్, ఈ నెల11 నుంచి భక్తులకు దర్శనం, ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపిన ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌
Hazarath Reddyలాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2 నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరిగి పునఃప్రారంభిస్తోంది. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
APSRTC: ఏపీ నుంచి ఇతర రాష్టాలకు బస్సులు షురూ, అనుమతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
Hazarath Reddyకరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు (Interstate Transport) తిప్పడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. బస్సులు తిరిగేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
AP Coronavirus: ఇది నిజంగా సంచలనమే, 80 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, ఏపీలో తాజాగా 50 కేసులు నమోదు, 3,427కి చేరిన మొత్తం కరోనా కేసులు
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో(గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు) 9,831 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కేవలం 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 21 మంది కరోనా (AP Coronavirus) నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,294కు చేరింది. వైరస్‌తో (COVID-19) నిన్న ఇద్దరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,427 కేసులు నమోదవ్వగా, 73 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. ప్రస్తుతం 1,060 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
VRO Posts in AP: వీఆర్వో పోస్టులను త్వరలో భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం, అర్హులైన వీఆర్‌ఏలను ఈ పోస్టులకు ఎంపిక చేయాలని ఆదేశాలు
Hazarath Reddyఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO) గ్రేడ్‌ –2 పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్‌వో (Grade-2) పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్‌టైమ్‌) ప్రాతిపదికన వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి.
AP Coronavirus: జూన్‌ 8నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ఓపెన్, హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయిన మంత్రులు అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఏపీలో తాజాగా 98 కేసులు నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (AP Coronavirus) గడిచిన 24 గంటల్లో(బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 9,986 కరోనా పరీక్షలు నిర్వహించగా 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 29 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్క రోజు కోవిడ్‌ (Andhra Pradesh) వల్ల గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Vizag Anesthetist Case: డాక్టర్‌ సుధాకర్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు, వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచిన సీబీఐ, ఫిర్యాదు చేసిన ఫోర్త్‌ టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ
Hazarath Reddyనడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మీద నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా డాక్టర్‌ సుధాకర్‌పై కేసు (Vizag Anesthetist Case) నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని (FIR Copy) బుధవారం పొందుపర్చింది. గత నెల 16న డాక్టర్‌ సుధాకర్‌ (Dr Sudhakar Rao Case) విశాఖ పోర్టు ఆస్పత్రి సమీపంలోని జాతీయ రహదారిపై తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని ఫోర్త్‌ టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాఘవేంద్ర కుమార్‌ ఎఫ్‌ఐఆర్‌ ప్రతిలో పేర్కొన్నారు.
YSR Vahana Mitra: ఈ రోజు రూ.10 వేలు నేరుగా అకౌంట్లోకి.., వైఎస్సార్ వాహన మిత్ర రెండో దఫా మొత్తాన్ని విడుదల చేసిన ఏపీ సర్కారు, 4 నెలల ముందుగానే విడుదల
Hazarath Reddyకరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ (Lockdown)విధించిన నేపధ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) రెండో సారి రూ. 10 వేలు అందించనున్నారు. బతుకుదెరువు కోసం ఆటోలు, మ్యాక్సీలు నడుపుకుంటున్న డ్రైవర్లకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఆ మాట ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర (YSR Vahana Mitra) కింద వారికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయడం ద్వారా అండగా నిలుస్తున్నారు. గతేడాది అనుకున్న ప్రకారం అందించారు.
AP Panchayat Offices Colour Issue: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల విషయంలో (AP Panchayat Offices Colour Issue) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాలని ఆదేశించింది.. రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసింది వైఎస్సార్‌సీపీ జెండా రంగులు కాదని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది.. కోర్టు మాత్రం తోసిపుచ్చింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.