ఆంధ్ర ప్రదేశ్

Free Ration Distribution: రెండవ ధపా ఉచిత రేషన్ సరఫరా, టైం స్లాట్‌తో కూడిన కూపన్లు, వలంటీర్ల ద్వారా కార్డుదారులకు కూపన్లు

Hazarath Reddy

లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆడుకోవడానికి ఏపీ ప్రభుత్వం (AP Govt) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే ఇప్పటికే ఉచిత రేషన్ బియ్యాన్ని (Free Ration Distribution) సరఫరా చేయాలనీ, అంతేకాకుండా ప్రతి ఇంటికి 1000 రూపాయలను అందజేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం రెండో విడత ఉచితంగా పంపిణీ చేయనున్న రేషన్‌ సరుకులను నేటి నుంచి వాలంటీర్లు అందిస్తున్నారు.

Nimmagadda Letter Row: మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ వివాదం, ఏపీ డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ, ఫోర్జరీ సంతకాలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి, లేఖ తానే రాశానంటూ రమేష్ కుమార్ వివరణ

Hazarath Reddy

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై వివాదం (Nimmagadda Letter Row) కొనసాగుతోంది. తాజాగా ఈ లేఖపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP Mp Vijaya Sai Reddy) డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి (Gowtham sawang) రాసిన లేఖ రాశారు. ఈ లేఖలో సంతకం తేడాగా ఉందని నిజనిజాలు తేల్చాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు.

AP English Medium Row: ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు, ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన ఏపీ విద్యాశాఖా మంత్రి

Hazarath Reddy

పేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని (AP English Medium Row) తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తీర్పులో పేర్కొంది.

COVID -19 in TS & AP: ఆంధ్ర ప్రదేశ్‌లో 11 హాట్‌స్పాట్ జిల్లాల నుంచి 525 కేసులు, తెలంగాణలో 8 హాట్‌స్పాట్లు, 19 నాన్- హాట్‌స్పాట్‌ల నుంచి 650 కేసులు. జిల్లాల వారీగా కేసులు ఇలా ఉన్నాయి

Team Latestly

కేంద్ర ప్రభుత్వం మే 03 వరకు లాక్డౌన్ పొడగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇది వరకే రెండవ ఫేజ్ లాక్డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిస్థితులను బట్టి ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాలకు లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఉంటాయని కేంద్రం పేర్కొంది. అయితే ఆ సడలింపులు హాట్‌స్పాట్‌ జిల్లాలకు వర్తించబోవు.....

Advertisement

Hostspots in Telugu States: ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే, కరోనా హాట్‌ స్పాట్ జిల్లాలను ప్రకటించిన కేంద్రం, 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు..

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం (Central Government) రాష్ట్రాల వారీగా రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్‌లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లగా గుర్తించింది. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, అలాగే 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్చుతామని కేంద్రం తెలిపింది. కోవిడ్ 19 (Covid 19) వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి రెండు జాబితాలుగా విభజించింది.

Monsoon 2020: ఈ ఏడాది వర్షపాతం సాధారణం, జూన్ 1న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. మాన్‌సూన్ అంచనాలను ప్రకటించిన భారత వాతావరణ శాఖ

Team Latestly

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలకు రుతుపవనాల రాక సాధారణ తేదీలతో పోలిస్తే 3-7 రోజులు ఆలస్యం అవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది......

COVID-19 in AP: గుంటూరులో 118 కరోనా కేసులు, ఏపీలో 502కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, వైరస్‌ నిర్ధారణ శాంపిళ్లను వేగంగా పరీక్షించేందుకు ప్రభుత్వం చర్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ 19 కేసులు (AP Coronavirus) సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రొజు కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్‌ కేసులు ( coronavirus-positive-cases) నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 502కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

Lockdown 2.0 Guidelines: రెండవ దశ దేశవ్యాప్త లాక్డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు ఆంక్షల సడలింపు, పూర్తి జాబితా కోసం చూడండి

Team Latestly

రెండవ దశకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. మే 03 వరకు రైలు, బస్సు, విమానం సహా అన్ని రకాల ప్రయాణ సర్వీసులు రద్దు చేయబడ్డాయి. అయితే COVID-19 హాట్‌స్పాట్‌లు లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి పలు రంగాలకు కేంద్రం లాక్డౌన్ నుంచి మినహాయింపును ప్రకటించింది......

Advertisement

Fee Reimbursement in AP: ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌పై ఏపీ సర్కారు గుడ్ న్యూస్, తల్లుల అకౌంట్ ఖాతాల్లోకి పూర్తి ఫీజుల మొత్తం, కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Hazarath Reddy

ఏపీలోని విద్యార్థులకు ఏపీ సర్కారు (AP Govt) శుభవార్తను తెలిపింది.నవరత్న కార్యక్రమాల్లో కీలకమైన ‘జగనన్న విద్యా దీవెన’ (Jaganna vidya deevena) పథకానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై (Fee Reimbursement) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద విద్యార్థులకు అయ్యే ఫీజుల మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు అకౌంట్లలో (credited to mothers) నేరుగా జమ చేయించాలని నిర్ణయించింది.

Reliance Donation to AP CMRF: కరోనాపై పోరుకు ముఖేష్ అంబానీ చేయూత, ఏపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

కరోనా వైరస్ వ్యాప్తిని(Coronavirus) అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోన్న పోరాటానికి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌-19 ( COVID-19)నివారణ చర్యలు చేపట్టేందుకు రిలయన్స్ గ్రూపు రూ.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్‌ ద్వారా ఆ మొత్తం జమచేసింది.

AP Doctor Dies of COVID-19: కరోనాతో ఏపీలో డాక్టర్ మృతి, నెల్లూరులో తొలి మరణం, అంత్యక్రియలపై వివాదం, వీడియో కాల్ ద్వారా కడసారి చూసుకుని కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మ‌ర‌ణం (Nellore First Death) నమోదైంది. కరోనా పాజిటివ్‌తో (Coronavirus) తీవ్ర అస్వస్థతకు గురైన నెల్లూరు ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ (Nellore orthopedic Doctor) చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా ఏపీలో కరోనాతో ఓ డాక్టర్ చనిపోవడం ఇదే మొదటిసారి.

AP Coronavirus: గుంటూరులో కరోనా కల్లోలం, వంద దాటిన కరోనా కేసులు, ఏపీలో 473కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా మరో 34 కరోనావైరస్‌ (Coronavirus) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన 34కేసుల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదైంది.

Advertisement

Telugu States Coronavirus: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, ఏపీలో 439కి చేరిన కేసుల సంఖ్య, తెలంగాణలో 592కు చేరిన కోవిడ్ 9 కేసులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా (Telugu States Coronavirus) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 19 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో నిన్న ఒక్కరోజే 61 కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో ఇప్పటివరకు కోవిడ్ 19 భారీన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఏడుమంది కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.

Dr YSR Telemedicine: కరోనాపై పోరుకు డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌, 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు అందుతాయి

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్‌ నియంత్రణ (Coronavirus in AP) చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ (Dr YSR Telemedicine) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan mohan Reddy) ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబరు 14410కు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా టెలిమెడిసిన్‌ (Telemedicine) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం వైయస్ జగన్‌ ఆదేశించారు.

COVID-19 in AP: కర్నూలును కలవరపెడుతున్న కరోనా, ఆ జిల్లాలో 84కి చేరిన కరోనా కేసులు, ఏపీలో 432కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరుకుంది. నిన్నరాత్రి 09 గంటల నుంచి ఇవాళ ఉదయం 09 గంటల వరకూ కొత్తగా 12 కేసులు (positive coronavirus cases) నమోదైనట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్య శాఖ వెల్లడించింది.

AP Entrance Exams Postponed: ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా, కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన ఏపీ ఉన్నత విద్యామండలి

Hazarath Reddy

ఏపీలో కరోనావైరస్ (coronavirus in AP) విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా (AP Entrance Exams Postponed) వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

Advertisement

AP Lockdown: రోడ్డుపై ఉమ్మి వేస్తే జైలుకే, కరోనా నివారణకు మరో నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష

Hazarath Reddy

ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం (Spitting pan, tobacco products), ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై బ్యాన్ విధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణిస్తారు. ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీచేశారు.

COVID-19 in AP: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు, 5.3 కోట్ల మందికి 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు

Hazarath Reddy

కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు (Free Masks) పంపిణీ చేయనుంది. ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని సీఎం జగన్‌ (AP CM YS jagan) ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష (CM Jagan Review Metting) నిర్వహించారు.

Tribes Corona Leaf Masks: అడవి బిడ్డలకు ఆకులే మాస్కులు, ఎన్90 మాస్కులు కొనేందుకు చేతిలో డబ్బులు లేవు, వ్యాధి గురించి అవగాహన లేదు, అయినా కరోనాని తరిమేస్తున్న గిరిజనులు

Hazarath Reddy

ఏజెన్సీ ప్రాంతాల (Tribal areas) ప్ర‌జ‌ల‌కు ఎప్పూడూ క‌ష్టాలే. ఇప్పుడు తాజాగా క‌రోనా (Coronavirus) క‌ష్టాలు ఎదుర్కుంటున్నారు. క‌నీసం మాస్కులు లేక ఆకుల‌నే మాస్కులుగా (Tribes Corona Leaf Masks) తయారుచేసి క‌ట్టుకుంటున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో గిరిజనులు నివాసం ఉండే ప్రాంతాల కథ.. ఏపీలో (Andhra Pradesh) అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో (Vizianagaram, Srikakulam) ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే అక్కడి గిరిజన చైతన్యం ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వారు కరోనాని ఎలా తరిమేస్తున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు.

Covid-19 Pandemic in AP: ఏపీలో 405కు చేరిన కరోనా కేసులు, కొత్తగా 24 కేసులు నమోదు, గుంటూరులో ఏప్రిల్12న పూర్తిగా కర్ఫ్యూ అమలు

Hazarath Reddy

ఏపీలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు (Covid 19 pandemic in AP) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరింది. తాజా కేసులు జిల్లాల వారీగా చూస్తే.. గుంటూరు జిల్లాలో 17, కర్నూలులో 5, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Advertisement
Advertisement