Vjy, Dec 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు.ఉండవల్లిలోని సీఎం నివాసంలోదాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కాకినాడ పోర్ట్‌లో రేషన్ బియ్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
అలాగే రాజధాని అమరావతిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి అమరావతి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, తన ఢిల్లీ పర్యటన విశేషాలు, సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవుల అంశాలపై చర్చించినట్లు సమాచారం.ఇక సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.