Vij, Sep 11: అకాల వర్షాలు ఏపీని ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విజయవాడలోని బుడమేరు చెరువు పోటెత్తడంతో నగరం నీట మునగగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బుడమేరు నుండి నీరు దిగువన ఉన్న కోల్లేరుకు చేరుకుంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు వరద పోటెత్తింది.
ఈ నేపథ్యంలో ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. కొల్లేరు, ఉప్పటేరులలో వరద ఉధృతిని, ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.
ఉదయం 10గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు బయలు దేరనున్నారు.10.50 గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు, కొల్లేరు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు. 11.30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో కొల్లేరు ప్రాంతంలోని ఉప్పుటేరు వంతెన వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు అనంతరం రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1.05 గంటలకు కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
1.45 గంటల వరకు విరామం తీసుకొని రోడ్డు మార్గంలో కిర్లంపూడి మండలంలోని ముంపు ప్రాంతమైన రాజుపాలెం వెళ్తారు.మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు అక్కడ పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకుంటారు.సామర్లకోటలోని టీటీడీసీకి చేరుకొని వరద ప్రాంతాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను తిలికిస్తారు. అనంతరం అధికారులతో రివ్యూ ఆ తర్వాత హెలికాప్టర్‌లో వేలంపూడికి చేరుకుంటారు. వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు
వరదలతో వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించగా కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. కొల్లేటి సరస్సులో నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఉండగా దీనికి మించి వరద వచ్చి చేరింది.
దీంతో పెద్ద సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో చిక్కుకుని ప్రజలు భారీ నష్టాన్ని చవిచూశారు. చేపల చెరువులు ముంపుకు గురికాగా వరద బీభత్సానికి పడవల్లోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.