కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపాడు భర్త గంగాధర్, అతను మతిస్థిమితం లేక భార్య, కుమార్తెను భర్త హత్య చేశారు. తొండూరు మండలం తుమ్మల పల్లెకు చెందిన శ్రీలక్ష్మి అంగన్వాడి కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తుంది. కుమార్తె గంగోత్రి ఎనిమిదో తరగతి చదువుతుంది.

భర్త గంగాధర్‌కు మతిస్థిమితం లేదు, ఎప్పుడు మద్యం తాగుతూ ఉండేవాడు. సోమవారం రాత్రి భార్య, కుమార్తె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో వారిపై దాడి చేసి హత్య చేశాడు. మంగళవారం శ్రీలక్ష్మి విధిలోకి రాకపోవడంతో అంగన్వాడి కార్యకర్త చరవాణి ద్వారా ప్రయత్నించారు. సమయంలో భర్త గంగాధర్ రెడ్డి ఫోన్ ఎత్తి నా భార్యను చంపేశానంటూ సమాధానం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గొంతు కోసిన ‘చైనా మాంజ’.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘటన (వీడియో)

Man killed wife and daughter with knife

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)