ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పునీత్ ఖురానాకు, అతని భార్య మనీకా పహ్వాకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ సీసీ టీవీ కెమెరాల్లో వీడియోతో పాటు ఆడియో కూడా రికార్డ్ అయింది.

భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య, ఢిల్లీలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..

విడాకుల విషయంలో భార్య, అత్తింటి వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. విడాకుల సమయంలో ఇచ్చిన మొత్తం కాకుండా అదనంగా రూ.₹10 లక్షలు ఇవ్వాలని వేధించారు. ఇప్పటికే తన తల్లిదండ్రులపై ఆధారపడ్డాను.. మళ్ళీ డబ్బులు వాళ్లను అడగలేనంటూ చనిపోయే ముందు పునీత్ ఖురానా సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Puneet Khurana's Video Note Before Suicide

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)