AP Lockdown: రోడ్డుపై ఉమ్మి వేస్తే జైలుకే, కరోనా నివారణకు మరో నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణిస్తారు. ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీచేశారు.
Amravati, April 12: మహమ్మారి కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేస్తోంది. తాజాగా కరోనా నివారణకు (COVID 19) కేంద్రం చేసిన మరో సూచన అమల్లోకి తీసుకొచ్చింది.
కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన
ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం (Spitting pan, tobacco products), ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై బ్యాన్ విధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణిస్తారు. ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీచేశారు.
కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు
ఈ సమీక్షలో రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. వీటి వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని తెలిపారు. కరోనా వైరస్ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడటం మరియు ఉమ్మివేయడాన్ని నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కోరింది. పొగాకు ఉత్పత్తులను నమలడం, పాన్ మసాలా మరియు సుపారి వంటి ఉత్పత్తుల వాడటం నిషిద్ధమని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం COVID-19 వైరస్ వ్యాప్తిని పెంచుతుంది" అని మంత్రిత్వ శాఖ ఒక లేఖలో తెలిపింది అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నేరంగా ప్రకటించారు. తెలంగాణలో సైతం రోడ్లపై ఉమ్మి వేస్తే కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఏపీలోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని జగన్ ప్రభుత్వం ప్రకటించింది.
నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్
ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం సాయంత్రానికి ఏపీలో 405 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 11 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.