AP Speaker Fires On TDP: టీడీపీ తీరుపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని, రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ జరపాలని సీఎంకు విజ్ఞప్తి, మీ ఆదేశాలు అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో(AP Assembly Special Session) మూడు రాజధానులపై(3 Capitals) చర్చ జరుగుతోంది. సీఆర్డీఏ రద్దు,((CRDA cancellation)) అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంలో స్పీకర్‌కు అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. ఈ సంధర్భంగా సభలో అచ్చెన్నాయుడు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.

andhra-pradesh-speaker-tammineni-sitaram-fires-tdp-members (Photo-Flie Image)

Amaravathi, January 20: ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో(AP Assembly Special Session) మూడు రాజధానులపై(3 Capitals) చర్చ జరుగుతోంది. సీఆర్డీఏ రద్దు,((CRDA cancellation)) అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంలో స్పీకర్‌కు అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. ఈ సంధర్భంగా సభలో అచ్చెన్నాయుడు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.

మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) మాట్లాడుతుండగా... అచ్చెన్నాయుడు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారంటూ బొత్స మండిపడ్డారు. బొత్స ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం అచ్చెన్నాయుడు చేశారు . దీంతో స్పీకర్ అచ్చెన్నాయుడు తీరుపై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు?

‘సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందా’ అంటూ అచ్చెన్నాయుడుపై (Kinjarapu Yerran Naidu)స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు హద్దులు దాటుతున్నారని స్పీకర్ కోపగించుకున్నారు.

జీఎన్ రావు,బీసీజీ రిపోర్టులను భోగి మంటల్లో తగలబెట్టిన చంద్రబాబు

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ను కోరుతున్నానని స్పీకర్‌ తమ్మినేని (Tammineni Sitaram) అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు(TDP Members) అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జరపాలని కోరే హక్కు మీకు ఎవరిచ్చారని స్పీకర్‌ను ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు.

హై పవర్‌ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

ఈ సందర్భంగా సమాధానమిచ్చిన క్రమంలో స్పీకర్ సహనం కోల్పోయారు. ‘డోంట్ టాక్ రబ్బిష్’ అంటూ విపక్ష సభ్యుడిపై మండిపడ్డారు. తనకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా లేదా అనేది సభ తేల్చాలని... స్పీకర్‌కు అధికారం ఎవరు ఇచ్చారని విపక్ష సభ్యుడు ప్రశ్నించడమేంటని స్పీకర్ వ్యాఖ్యానించారు. తప్పు చేయకుంటే విచారణపై అభ్యంతరం ఎందుకంటూ విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఏపీలో హైటెన్సన్, సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు

ఈ సంధర్భంగా అమరావతిలో భూకుంభకోణాలపై ఖచ్చితంగా విచారణ జరపాలని సీఎంకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. విచారణ అంటే మీరెందుకు ఉలికి పడుతున్నారంటూ టీడీపీనేతలకు చురకలంటించారు. ఏ తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం అంటూ తమ్మినేని ప్రశ్నించారు.

దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా

దీంతో స్పందించిన సీఎం జగన్ ఖచ్చితంగా మీ ఆదేశాలు అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. స్పీకర్‌కు ఆ అధికారులు ఇచ్చే హక్కు ఉందన్నారు జగన్.

అంతకుముందు సభలో మాట్లాడిన బొత్స... చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ రాయలేదా ? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా ఇవాళ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. మీ లాంటి నాయుకడు వల్లే ఈ రోజు మనకు ఈ దౌర్భగ్యం పట్టిందన్నారు. అచ్చెన్నాయుడు అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. అచ్చెన్నాయుడికి బాడీ పెరిగింది కానీ... బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now