తెలంగాణ

COVID in TS: తెలంగాణలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు, కొత్తగా మరో 238 మందికి పాజిటివ్, వ్యాక్సిన్ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు, ఇప్పటికే కోలుకున్న వారికి వ్యాక్సిన్ అవసరం లేదన్న మంత్రి ఈటల

Team Latestly

దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో పదిరోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.....

GHMC Elections Row: ఎన్నికల ఖర్చు వెంటనే తెలపండి, లేకుంటే అనర్హతకు గురవుతారు, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సూచించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సకాలంలో ఎన్నికల ఖర్చుల వివరాలను అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి సూచించారు. నిర్ణీత సమయంలో ఈ వివరాలను అందించని పక్షంలో అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 8న ఎన్నికల వ్యయ పరిశీలకులతో సమీక్ష నిర్వహించనున్నామని చెప్పారు.

Covid in TS: తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్, తెలంగాణలో ఏడు కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్, సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా

Hazarath Reddy

తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదు అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య (Coronavirus in Telangana) 2,87,108కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. కరోనా మరణాల సంఖ్య మొత్తంగా 1,546కు చేరుకుంది.

Covid in Suryapet: అంత్యక్రియలకు హాజరు, ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా, తెలంగాణ సూర్యాపేటలో కల్లోలం రేపిన కరోనావైరస్, అప్రమత్తమైన వైద్యాధికారులు

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనావైరస్ కలకలం రేపుతోంది. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం (22 of a family test positive for coronavirus ) ఆ జిల్లాలో ఆందోళన పుట్టిస్తోంది. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరైన వీరి అందరికీ కరోనా వైరస్‌ (Telangana suryapet coronavirus) సోకింది.

Advertisement

Justice Hima Kohli: తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు బదిలీ అయిన ప్రస్తుత సీజే జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ హిమా కోహ్లిని (Justice Hima Kohli) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు.

Covid Updates: కొత్త ఏడాదిలో కొత్త కరోనా కలవరం, ఫైజర్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ, దేశంలో తాజాగా 20,036 మందికి కరోనా, తెలంగాణలో 461 కొత్త కేసులు, ఏపీలో తాజాగా 338 మందికి కోవిడ్

Hazarath Reddy

భారత్‌లో గత 24 గంటల్లో 20,036 మందికి కరోనావైరస్ (Coronavirus Outbreak) పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 23,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు (Coronavirus Outbreak in India) చేరింది.

CM Review on Dharani: ధరణి పోర్టల్ నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష, 2 నెలల్లోనే ధరణి ద్వారా 80 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడి, సేవలను మరింత విస్తరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు

Team Latestly

తెలంగాణలో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా....

Corona in Telangana: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పరిశీలించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన, తెలంగాణలో కొత్తగా మరో 415 మందికి పాజిటివ్, 5,974గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

దేశంలో కొత్త రకం న్యూ స్ట్రెయిన్‌ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు, రేపు జరిగే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.....

Advertisement

Telangana: బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు ఓపెన్, రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) న్యూ ఇయర్‌ కానుకగా రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

Azharuddin: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు బోల్తా, ప్రమాదంలో అజర్‌కు గాయాలు, క్షేమంగానే ఉన్నారని వ్యక్తిగత సహాయకుడి వివరణ

Team Latestly

హైవేపై టర్నింగ్ వద్ద టైరు పేలడంతో కారు ఓవర్ టర్న్ అయి అదుపుతప్పి బోల్తా పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే హైవేకి పక్కన ఉండే దాబాలోకి కారు దూసుకురావడంతో దాబాలో పనిచేసే ఓ వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదం తర్వాత అజర్ ను మరొక కారులో అక్కణ్నించి తరలించారు....

COVID in TS: తెలంగాణలో తగ్గుతున్న పాత కరోనా కేసులు, కలవర పెడుతున్న కొత్త రకం కేసులు, యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో రాష్ట్రానికి చెందిన ఒకరికి పాజిటివ్, భయపడాల్సిన అవసరంలేదన్న ఆరోగ్య మంత్రి

Team Latestly

రాష్ట్రంలో కొత్తగా మరో 474 మందికి పాజిటివ్ అని తేలింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 102 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 49, మేడ్చల్ నుంచి 45 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి...

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర కానుక, వేతనాల పెంపు, ఉద్యోగ విరమణ వయసు పెంపుకు నిర్ణయం, కొత్త ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశం

Team Latestly

పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.....

Advertisement

Telangana: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తి, ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు

Hazarath Reddy

వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్ల‌కు (registration of non-agricultural lands) అనుమ‌తి తెలిపింది.ఎల్‌ఆర్‌ఎస్‌ (Layout Regularisation Scheme (LRS)) లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

CP Sajjanar Warns Drunken Drivers: టెర్రరిస్టుల్లా మారకండి, మద్యం తాగి వాహనాలు నడిపేవారికి సీపీ సజ్జనార్ హెచ్చరిక, తాగి బండి నడిపితే రూ.10వేల జరిమానా‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు

Hazarath Reddy

మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు (CP Sajjanar Warns Drunken Drivers) చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లు ఉగ్రవాదులతో సమానమని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు.

Covid in India: హైదరాబాద్‌లో ఇద్దరికి కొత్త కరోనావైరస్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 397 కరోనా కేసులు నమోదు, దేశంలో తాజాగా 16,432 మందికి కరోనా, భారత్‌లో ఆరుమందికి కొత్త కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

బ్రిటన్‌లో కొత్తరకం వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ, ఆ దేశం నుంచి తెలంగాణకు చేరుకున్న వారిలో ఇద్దరికీ బ్రిటన్ లో పుట్టిన కొత్త కరోనావైరస్ (New Covid Starin) కోవిడ్ పాజిటివ్ గా నమోదయింది. బ్రిట‌న్ నుంచి ఇండియాకు వ‌చ్చిన ఆరుగురిలో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది.

New Covid Strain in TS: తెలంగాణలో కలకలం రేపుతున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, 20కు చేరిన అనుమానిత కేసుల సంఖ్య, ఇంకా చిక్కని 154 మంది జాడ, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్‌ (New Covid Strain in TS) కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా... ఈ పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. అయితే వీరిలో ఎంతమందికి కరోనా స్ట్రెయిన్‌ (UK COVID-19 strain) ఉందనేది సస్పెన్స్‌గా ఉంది. 20మంది శాంపిల్స్ జీన్ మ్యాప్ రిపోర్టులను సీసీఎంబీ కేంద్రానికి పంపింది. అలాగే తెలంగాణ అధికారులకు సమాచారం అందించింది.

Advertisement

CM KCR Adopted Daughter Marriage: వైభవంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం, చరణ్ రెడ్డితో కలిసి ఏడడుగులు వేసిన ప్ర‌త్యూష, ప‌ట్టువ‌స్త్రాలు, వ‌జ్రాల నెక్లెస్ బహుకరించిన సీఎం కేసీఆర్ సతీమణి

Hazarath Reddy

తెలంగాణ ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌పుత్రిక ప్ర‌త్యూష పెళ్లి (CM KCR Adopted Daughter Marriage) ఘ‌నంగా జ‌రిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో ప్ర‌త్యూష, చ‌ర‌ణ్ రెడ్డిలు ఒక్క‌ట‌య్యారు. ఈ వేడుక‌కు షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌, జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ గ‌ణేశ్‌, మ‌హిళా సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రై నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.

Corona in TS: తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు, అయినా కొనసాగుతున్న కొత్త వేరియంట్ వైరస్ కలవరం, యూకే నుంచి వచ్చిన వారి అడ్రసుల్లో తప్పుడు సమాచారం

Team Latestly

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తుందనుకుంటున్న దశలో కొత్త వేరియంట్ కరోనా ఇప్పుడు మళ్లీ దడ పుట్టిస్తుంది. ఇటీవల యూకె నుండి తెలంగాణకు తిరిగి వచ్చిన 279 మంది ప్రయాణికుల జాడ తెలియరాలేదని రాష్ట్ర ఆరోగ్య అధికారులు వెల్లడించారు. తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 184 మంది తప్పుడు ఫోన్ నంబర్...

Rythu Bandhu: నేటి నుంచి తెలంగాణలో 'రైతుబంధు' నిధుల పంపిణీ, నియంత్రిత సాగు ఎత్తివేత.. నచ్చిన పంట వేసుకునేందుకు వెసులుబాటు, సీఎం కేసీఆర్ సమీక్షలో కీలక నిర్ణయాలు

Team Latestly

రైతు బీమా కార్యక్రమం ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది.....

Hyderabad: హిజ్రాలు వేధిస్తే 100కు డయల్ చేయండి లేదా 9490617444 వాట్సప్ నంబర్‌కు మెసేజ్ ఇవ్వండి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన మాదాపూర్ డీసీపీ, ప్రగతి నగర్‌లో అసభ్యంగా ప్రవర్తించినందుకు 8 మంది అరెస్ట్

Hazarath Reddy

పోలీసులు ప్రగతినగర్‌ ఎలీప్‌ చౌరస్తాలో టీఎస్‌15 యూడీ 0298 ఆటోలో వెళ్తున్న 8 మంది హిజ్రాలను, ఆటో డ్రైవర్లు కరణ్‌ గుప్త, మొహమ్మద్‌ మాసీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7 సెల్‌ఫోన్లు, రూ. 16,500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement