తెలంగాణ

Weather Update Tomorrow: రేపటి వాతావరణం సూచన.. తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. హైదరాబాద్, విజయవాడ ఇతర నగరాల వాతావరణం అప్ డేట్ ఇదే..

Team Latestly

తెలంగాణ వాతావరణ శాఖ (IMD హైదరాబాద్) అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Weather Update: ఐఎండీ హెచ్చరిక.. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఈ రోజు వాతావరణం ఎలా ఉందంటే..

Team Latestly

దక్షిణాది రాష్ట్రాలను వరుణుడు కరుణించడంతో మంగళవారం సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Weather Update Today: తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఆదేశాలు, ఈ రోజు వాతావరణం ఇదిగో...

Team Latestly

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం రాత్రి నుండి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

Tomorrow Weather Update: రేపటి వాతావరణం అప్‌డేట్.. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతపవనాలు, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Team Latestly

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతుండటంతో పాటుగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై నెల మధ్య భాగం నాటికి వేసవి తాపం పూర్తిగా తగ్గి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం చల్లబడింది.

Advertisement

Hyderabadi Biryani: ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని దక్కించుకున్న హైదరాబాద్‌ బిర్యానీ, టాప్ 10 రైస్ డిషెస్‌లో చోటు, అగ్రస్థానంలో జపనీస్ వంటకాలు

Team Latestly

ప్రపంచవ్యాప్తంగా మరోసారి హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేక రుచితో అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆన్‌లైన్‌ ఫుడ్ & ట్రావెల్‌ ప్లాట్‌ఫార్మ్‌ టేస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్ 2025 జాబితాలో మన హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో చోటు దక్కించుకోవడం గర్వకారణం.

Hyderabad: ట్రాఫిక్ డ్యూటీలో రౌడీషీటర్లు, రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం, తొలి దశలో 60 మందికి బాధ్యతలు, మంచి పౌరులుగా మార్చడమే లక్ష్యమన్న కమిషనర్

Team Latestly

సమాజంలో మార్పు తీసుకురావాలంటే కఠిన శిక్షలు మాత్రమే సరిపోవు, మార్పు అవకాశాలు కూడా ఇవ్వాలి. నేర చరిత్ర ఉన్నవారికి కొత్త జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

Hyderabad: ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ, హైదరాబాద్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Team Latestly

హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు.

'No Religious Rituals on Duty': డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు, తెలంగాణ పోలీసు శాఖ కీలక ఆదేశాలు, ముందస్తుగా సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన

Team Latestly

తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షల్లో పాల్గొనే విషయంలో కొత్తగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి ఆచారాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది డ్యూటీకి హాజరుకావద్దని, తప్పనిసరిగా ముందస్తు సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన సోనోకో, ఈబీజీ గ్రూప్, ఫైనాన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్న సోనోకో, ఈబీజీ పవర్‌హౌస్‌పై రెండేళ్లలో భారీ పెట్టుబడికి ప్రణాళిక

Team Latestly

హైదరాబాద్‌ అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో.. మరో రెండు ప్రముఖ గ్లోబల్ సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించాయి. అమెరికాకు చెందిన సొనోకో ప్రోడక్ట్స్‌, జర్మన్‌ బహుళ రంగ సంస్థ ఈబీజీ గ్రూప్‌ తమ కొత్త కేంద్రాలను హైదరాబాద్‌లో స్థాపించడం, నగర వ్యాపార వాతావరణానికి మరొక కీలక గుర్తింపుగా నిలిచింది.

Egg Price Hike: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు, సామాన్యులు కొనలేక విలవిల, జనవరి వరకు ఇదే పెరుగుదల ఉంటుందని చెబుతున్న మార్కెట్ వర్గాలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు సాధారణ ప్రజలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా నమోదు అవుతున్న ఈ పెరుగుదల రిటైల్ నుండి హోల్‌సేల్ మార్కెట్ల వరకు అన్ని స్థాయిల్లో ప్రభావం చూపిస్తోంది. ఒక్కో గుడ్డు ధర రిటైల్ అవుట్‌లెట్లలో ఏడు రూపాయలను దాటిపోవడం వినియోగదారులకు గట్టి భారం అయింది.

Passenger Falls from Train: వీడియో ఇదిగో, రన్నింగ్ ట్రైన్ దిగుతూ కిందపడ్డ ప్రయాణికుడు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఘటన

Team Latestly

హైదరాబాద్‌ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రమాదం తృటిలో తప్పింది. కదులుతున్న రైలు పూర్తిగా ఆగకముందే ప్లాట్‌ఫాంపైకి దిగేందుకు ప్రయత్నించిన ఒక ప్రయాణికుడు అదుపు తప్పి రైల్వే ట్రాక్‌ వైపు జారిపోయాడు.

Telangana: దారుణం.. కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను ఎలా కొడుతున్నాడో వీడియోలో చూడండి, సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ నిలదీసిన ప్రయాణికులు

Team Latestly

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ రేజ్ ఘటన మరోసారి సంచలనం సృష్టించింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం సమీపంలో జరిగిన ఈ సంఘటనలో, తన కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తోన్న పలువురు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Weather Update: తెలంగాణలో చలిపులి పంజా, గజగజ వణుకుతున్న హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్‌ జారీ

Team Latestly

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి తన పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా భారీగా పడిపోయాయి. దీని ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, భారత యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్, 45 మంది సజీవ దహనం

Team Latestly

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.

Saudi Arabia Bus Accident: ఎంత విషాద ఘటన ఇది.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి, సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Team Latestly

తెలంగాణలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను తెలంగాణ హజ్ కమిటీ అధికారిక ప్రకటనలో నిర్ధారించింది. పవిత్రమైన ఉమ్రా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న ఈ యాత్రికుల ప్రయాణం అకస్మాత్తుగా విషాదంగా మారింది.

Electric Car Fire Video: వీడియో ఇదిగో, ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు, అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన కారు

Team Latestly

హైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.

Advertisement

Jubilee Hills Bypoll Result: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం, మాగంటి సునీతపై భారీ మెజార్టీతో విజయం సాధించిన నవీన్ యాదవ్, బీజేపీకి డిపాజిట్ గల్లంతు

Team Latestly

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Telangana Weather: తెలంగాణలో 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత, రానున్న మూడు రోజుల్లో మరింత పెరగనున్న చలి

Team Latestly

రాష్ట్రంలో చలి మరింత తీవ్రమైంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అడవులు, కొండలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో చలిగాలులు విరుచుకుపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండప్రాంతాలు మంచు ముసురుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.

Sangareddy Shocker: సంగారెడ్డిలో దారుణం, భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త, వివాహేతర సంబంధం అనుమానమే పెనుభూతంగా మారింది

Team Latestly

అనుమానం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపితమైంది. వివాహ బంధం నమ్మకంపై నిలబడే కాపురంలో, అనుమానం చిచ్చు పెట్టింది. భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త తన జీవిత భాగస్వామినే కిరాతకంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎస్‌ఆర్ నగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Telangana Weather Update: గజగజ వణుకుతున్న హైదరాబాద్, తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత, వచ్చే మూడు రోజుల పాటు మరింతగా తగ్గనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

Team Latestly

తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చలి తీవ్రత పెరుగుతోంది. సాధారణంగా డిసెంబర్‌ మొదటి వారంలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుండగా, ఈసారి నవంబర్‌ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం ప్రజలను వణికిస్తోంది.

Advertisement
Advertisement