COVID-19 in Telangana: తెలంగాణలో కరోనా కలవరం, 22కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, దండం పెడుతున్నాం..బయటకు రావద్దంటున్న పోలీసులు, తెలంగాణ సరిహధ్దులు మూసివేత

ఏకంగా రెండో స్టేజ్ లోకి ఎంటరయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది చాప కింద నీరులా అది వ్యాపిస్తోంది. కాగా విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

Coronavirus Outbreak (Photo Credits: IANS)

Hyderabad, Mar 22: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ (COVID-19 in Telangana) మెల్లిగా విస్తరిస్తోంది. ఏకంగా రెండో స్టేజ్ లోకి ఎంటరయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది చాప కింద నీరులా అది వ్యాపిస్తోంది. కాగా విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో సర్వం బంద్, సరిహద్దులు మూసివేత

కరోనా బాధితుల సంఖ్య 22కు చేరినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ( AP) గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు లండన్‌ (Landon) నుంచి వయా దుబాయ్‌ (Dubai)మీదుగా హైదరాబాద్‌ (Hyderabad) వచ్చాడు. ఎయిర్‌పోర్టులో అధికారులు అతడిని పరీక్షించడంతో కరోనావైరస్‌ (Coronavirus) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మీరు ఇళ్లలో..మేము స్టేషన్లలో

ఎవరైనా విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారు చేతికి ముద్ర లేకుండా ఉన్నా, చేతికి ముద్ర ఉండి బయట తిరిగిన ప్రజలు పోలీసులకు, 104 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 14 రోజుల వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా సరిహద్దులు మొత్తాన్ని మూసివేశారు.

జనతా కర్ఫ్యూ, నేడు దేశ వ్యాప్తంగా రైళ్లు, బస్సులు అన్నీ బంద్

ప్రజలు ప్రయాణాలు, గుంపుగా చేరడాలు, గుంపు ఉన్న చోటికి వెళ్లడం వంటి పనులు చేయకూడదని కోరారు. ఏవైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఒక మీటరు దూరం ఉండాలని, దగ్గినా, తుమ్మినా చేతిని అడ్డుపెట్టుకోవాలని చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణాలో 24 గంటలు బంద్, ప్రధాని మీద ట్రోల్ చేస్తే చర్యలు తప్పవు

మహత్మా గాంధీ బస్సు స్టేషన్‌లో దుబాయ్‌ నుంచి వచ్చిన ఏడుగురి అనుమానితులను వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరంతా దుబాయ్‌ నుంచి విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వచ్చి, అక్కడి నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరి చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ స్టాంప్‌ ఉండడంతో అనుమానం అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు

అఫ్జల్‌గంజ్‌ పోలీసులు ఎంజీబీఎస్‌కు చేరుకొని ఏడుగురిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చేరిన ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ స్టాంపుతో ఉన్న ఓ కరోనా అనుమానితుడిని నాంపల్లి స్టేషన్లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు.

డెన్మార్ విమానానికి ఇండియాలో ల్యాడింగ్‌కు అనుమతి నిరాకరణ

జ‌న‌తా క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో పోలీసులు విస్తృతంగా ప‌హారా కాస్తున్నారు. నియ‌మావ‌ళిని అతిక్రమించి రోడ్ల‌పై తిరిగే వారికి సూచ‌న‌లు చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో న‌గ‌ర పోలీసులు చేతులు జోడించి.. ఇండ్ల‌ల్లోనే ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి స‌హ‌క‌రించాల‌ని వేడుకుంటున్నారు.

కరోనా లేనే లేదు, పేషెంట్లను కౌగిలించుకోవడానికి నేను సిద్ధం

కొన్ని చోట్ల పోలీసులు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని త‌మ సంఘీభావాన్ని తెలిపారు. మీకోసం మేం ప‌నిచేస్తున్నాం, మీరు ఇండ్ల‌ల్లోనే ఉండండి అన్న ప్ల‌కార్డుల‌ను పోలీసులు ప్ర‌ద‌ర్శించారు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ‌ల్ల భార‌త్‌లో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకున్న‌ది.