COVID 2019 Outbreak in India | PTI Photo

New Delhi, Mar 21: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అది తీవ్ర రూపం దాల్చి ప్రజల ప్రాణాల్ని నిలువునా హరించివేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమై పలు ఆంక్షలు విధించుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెలింగ్ విషయంలో నియంత్రణ విధిస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా విమానాల రాకపోకల విషయంలో కఠిన ఆంక్షలు విధించాయి.

ఇండియాలో 271కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, నలుగురు మృతి

ఈ నేపథ్యంలోనే డెన్మార్క్ నుంచి ఇండియాకు వచ్చిన విమానాన్ని భారత్ లో (India) ల్యాండింగ్ కి అనుమతించకపోవడంతో అది వెనక్కి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే ఆమ్ స్టర్ డ్యామ్ ( Amsterdam) నుంచి ఢిల్లీకి కేఎల్ఎం డచ్ ఎయిర్ లైన్స్ కు (Amsterdam-Delhi Flight) చెందిన విమానం నిన్న వచ్చింది. ఈ విమానంలో 90 మంది భారతీయులు ఉన్నారు. అయితే, విమానం ల్యాండ్ కావడానికి అనుమతించబోమని అధికారులు విమాన క్రూ సిబ్బందికి స్పష్టం చేశారు.

వాస్తవానికి యూరోపియన్ దేశాల నుంచి విమాన రాకపోకలను భారత్ ఈనెల 18నే బంద్ చేసింది. అయినప్పటికీ ఈ విమానం భారత్ కు రావడం విశేషం. ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు చెందిన అధికారులు మాట్లాడుతూ, తమ గైడ్ లైన్స్ ను కేఎల్ఎం ఎయిర్ లైన్స్ (KLM Royal Dutch Airlines) అనుసరించలేదని చెప్పారు. నిర్ధారిత ఫ్లైట్ ప్లాన్ లేకుండానే వారు మన దేశంలోకి వచ్చారని అన్నారు. అందువల్లే ఆ విమానం ల్యాండ్ కావడానికి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు.

కరోనా లేనే లేదు, పేషెంట్లను కౌగిలించుకోవడానికి నేను సిద్ధం

విమానం ల్యాండింగ్ కు అధికారులు అనుమతిని నిరాకరించడంతో... అందులో ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. కాసేపట్లో ల్యాండ్ అవబోతున్నామంటూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు ఎంతో సంతోషంతో మెసేజ్ లు పంపిన ప్రయాణికులు... విమానం వెనక్కి వెళుతోందనే అనౌన్స్ మెంట్ తో తీవ్ర నిరాశకు గురయ్యారు.

మరోవైపు, రేపు ఉదయం 5.50 గంటల నుంచి అన్ని విదేశీ విమానాల రాకపోకలను భారత్ బంద్ చేస్తోంది. అంటే, ప్రపంచంతో భారత్ కు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టే. మార్చి 29 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి... మన దేశం నుంచి ఏ ఒక్కరూ ఇతర దేశాలకు వెళ్లడం కానీ... ఇతర దేశాల నుంచి మన దేశానికి రావడం కానీ జరగదన్నమాట. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే విమానం దేశ సరిహద్దులను దాటే పరిస్థితి ఉంటుంది.

కాగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు దేశం కాని దేశంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.