Operation (Photo credits: Wikimedia Commons)

Hyderabad, Jan 19: హైదరాబాద్ (Hyderabad) లోని పేదలకు శుభవార్త. మెర్సీ మిషన్‌, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ గ్రీన్‌ ల్యాండ్స్‌, రాంకీ ఫౌండేషన్‌, పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉచిత మెగా ప్లాస్టిక్‌ సర్జరీ క్యాంప్‌ (Mega Plastic Surgery Camp) నిర్వహిస్తున్నారు. ఓల్డ్‌ మల్లేపల్లి సీతారాంబాగ్‌ లోని డాక్టర్‌ ఈశ్వర్‌ చందర్‌ చారిటబుల్‌ హాస్పిటల్‌ లో పక్షం రోజుల పాటు గ్రహణం మొర్రి, కాలిన గాయాలతో అవయవాలకు వచ్చిన వంకర్లు సరిచేయడం, జన్యుపర లోపంతో శరీరంపై వచ్చిన అవాంఛిత రోమాల నివారణకు ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీ నిర్వహించనున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. వివరాలకు 78160 79234, 98482 41640 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Salaar OTT Release: నేటి అర్ధరాత్రి 12 గంటలకు ఓటీటీలోకి సలార్‌.. ఇంతకీ స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

Operation (Photo credits: Wikimedia Commons)