World

India-China Tensions: సరిహద్దుల్లో అర్థరాత్రి కాల్పులు, భారత సైన్యమే కాల్పులు జరిపిందంటూ చైనా ఆరోపణలు, 5 మంది సంగతి మాకు తెలియదంటూ దాటవేత, చైనాతో యుద్ధంలో ఇండియా ఓడిపోతుందంటూ డ్రాగన్ మీడియా రాతలు

Hazarath Reddy

చైనా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సరిహద్దు వద్ద పదే పదే నియమాలను ఉల్లంఘిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. శాంతి స్థాపన చర్చలు చేయాలని ఢిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కో సమావేశంలో పిలుపునిచ్చినప్పటికీ దాని బుద్ధి మారడం లేదు. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత (India-China Tensions) కొనసాగుతుంది. తూర్పు లద్ధాఖ్‌ సెక్టార్‌లోని ఎల్‌ఏసీలో (Line of Actual Control (LAC) భారత్‌, చైనా బలగాల మధ్య సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

Coronavirus in India: ఓవైపు కలవరం, మరోవైపు ఊరట, కేసుల్లో బ్రెజిల్‌ను దాటేసిన భారత్, భారీగా పెరుగుతున్న రికవరీ రేటు, దేశంలో తాజాగా 90,802 కోవిడ్ కేసులు నమోదు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 90,802 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 42 లక్షలు దాటింది. 64,60,250 కేసులతో అమెరికా (America) అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో ( India's Coronavirus Tally) భారత్‌ రెండో స్థానంలో, 4,137,606 కేసులతో బ్రెజిల్‌ (Brezil) మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితుల్లో తాజాగా 1016 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 71,642 కు (Coronavirus Deaths) చేరింది. భారత్‌లో ఇప్పటివరకు 32,50,429 మంది వైరస్‌ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 8,82,542 యాక్టివ్‌ కేసులున్నాయి.

Coronavirus in India: తాజాగా 90,633 మందికి కరోనా వైరస్, దేశంలో 41,13,812కు చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 1065 మంది మృత్యువాతతో 70,626 కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 90,633 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,812కు చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1065 మంది మృత్యువాతపడగా, మొత్తం 70,626 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31,80,866 మంది కరోనానుంచి కోలుకుని (COVID19 Recoveries) డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Coronavirus Spread: కరోనాపై దిమ్మతిరిగే న్యూస్, ఇతరులతో సంబంధం లేకుండా టాయ్‌లెట్ పైపుల ద్వారా కోవిడ్19, చైనాలో వెలుగుచూసిన వాస్తవం

Hazarath Reddy

ఓ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 15వ అంతస్తులో నివసిస్తున్న ఐదుగురు సభ్యులుగల ఓ కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది. అయితే వారి కారణంగా 25వ, 27వ అంతస్తుల్లో నివసిస్తున్న దంపతులకు (Three Chinese families on different floors) కూడా కరోనా వైరస్‌ సోకింది. వారు ఏనాడు ఒకరికి ఒకరు కలుసుకోలేదు. అలాగే కరోనా వైరస్‌ సోకిన రోగులు ఉపయోగించిన మెట్లు లేదా లిఫ్ట్‌లు కూడా వాడలేదు. అయినప్పటికీ వారికి కోవిడ్ 19 వచ్చింది.

Advertisement

India-China Tensions: చైనా బలగాలు వెంటనే వెనక్కి వెళ్లాలి, శాంతి స్థాప‌న కోసం రెండు దేశాల మధ్య నిరంతరం చ‌ర్చ‌లు జరగాలి, మాస్కోలో ఎస్‌ఓసీ సమావేశంలో సరిహద్దు అంశాన్ని లేవనెత్తిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Hazarath Reddy

భారత్‌-చైనా మధ్య మరోసారి సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో (India-China Tension) ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యా రాజధాని మాస్కోలో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ( ఎస్‌ఓసీ) (Shanghai Cooperation Organisation (SCO) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని (India-China Border Stand-Off) రాజ్‌నాథ్‌సింగ్‌ లేవనెత్తారు. అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మధ్య దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది.

Hand Sanitizer Exploded: శానిటైజర్లు పేలుతున్నాయ్..అమెరికాలో భారీ శబ్దంతో పేలిన శానిటైజర్ బాటిల్, తీవ్ర గాయాల పాలైన మహిళ, టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ దడ పుట్టిస్తోంది. దీనికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ రాకపోవడంతో జాగ్రత్తలతోనే అందరూ దీన్ని ఎదుర్కుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలే కొంపలు ముంచుతున్నాయి. కరోనా రాకుండా కాపాడుకునేందుకు వాడే శానిటైజర్ బాటిల్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకెళితే..అమెరికాలోని టెక్సాస్‌లో శానిటైజర్‌ బాటిల్‌ పేలటంతో (Hand Sanitizer Exploded) ఓ మహిళ శరీరం మొత్తం తీవ్రంగా కాలిపోయింది.

Coronavirus in India: ఇండియాలో రెండవ ధపా కరోనా వేవ్, వ్యాక్సిన్‌పై ఇంకా క్లారిటీ లేదు, దేశంలో తాజాగా 86,432 మందికి కరోనా, 40 లక్షలు దాటిన కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కొత్తగా 86,432 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు (coronavirus in India) చేరింది. గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69,561 కు (coronavirus Deaths in India) చేరింది. కరోనా బారినపడ్డవారిలో ఇప్పటివరకు 31,07,223 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 8,46,395 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

India-China Face Off: సరిహద్దు వద్ద దూకుడు పెంచిన భారత్, వ్యూహాత్మకంగా పలు కీలక స్థావరాలు స్వాధీనం, చైనా దళాలకు ఎదురుగా తరలుతోన్న భారత బలగాలు

Team Latestly

భారతదేశం తన స్థావరాలను బలోపేతం చేసుకోవడంతో పాటు దక్షిణ ఒడ్డున వ్యూహాత్మక పర్వత ఎత్తులను స్వాధీనం చేసుకోవడంతో, ప్రస్తుతం ఇరు దేశాల సైనికులు కేవలం 300-500 మీటర్ల దూరంలో ఉన్నారని, దీంతో సరిహద్దు వద్ద తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది.....

Advertisement

Coronavirus in India: ప్రతి అయిదుగురిలో ఒకరికి కరోనా, గోవా ముఖ్యమంత్రికి కోవిడ్ పాజిటివ్, దేశంలో తాజాగా 78,357 మందికి కరోనా, 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 78,357 కరోనా పాజిటివ్‌‌ కేసులు (Coronavirus in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 37,69,524 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 1045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరింది. కోవిడ్‌ రోగుల్లో ఇప్పటివరకు 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 (Coronavirus Cases in India) యాక్టివ్ కేసులున్నాయి.

Ajit Doval: చైనా కవ్వింపు చర్యలు, రంగంలోకి అజిత్ డోవల్, బార్డర్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష, ఎన్నడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చెబుతున్న చైనా

Hazarath Reddy

భారత్‌-చైనా సరిహద్దుల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో (India-China border) మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొవల్‌ (National Security Advisor (NSA) Ajit Doval) ఉన్నతాధికారులతో సమవేశమయ్యారు. బార్డర్ పరిస్థితులను సమీక్షించారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Defence Minister Rajnath Singh) వీరితో భేటీ కానున్నారు. ఆగస్టు 29న ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు (Chinese Army) ప్రయత్నించినట్లు భారత సైన్యం (Indian Army) గుర్తించింది.

Coronavirus in India: లక్షణాలు లేకుండానే కరోనా, నేటి నుంచి అన్‌లాక్‌4 అమలు, దేశంలో 65 వేలు దాటిన కరోనా మరణాలు, తాజాగా 69,921 మందికి కోవిడ్-19, డిశ్చార్జ్ కేసుల సంఖ్య 28,39,883కు చేరిక

Hazarath Reddy

భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,921 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు (India's COVID-19 Tally) చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 (Coronavirus Deaths) చేరింది. కరోనా రోగుల్లో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 28,39,883. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,85,996.

COVID-19 Cases in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు, ఇప్పటివరకు 27,74,802 మంది డిశ్చార్జ్, 7,81,975 యాక్టివ్‌ కేసులు, తాజాగా 78,512 మందికి కోవిడ్-19

Hazarath Reddy

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్‌ కేసులు (COVID-19 New Cases in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్‌ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు (Coivd Deaths) చేరింది. భారత్‌లో ప్రస్తుతం 7,81,975 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 27,74,802 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు.

Advertisement

China Restaurant Collapse: చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్, 29 మంది మృతి, పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా కూలిన రెండంతస్తుల భవనం

Hazarath Reddy

ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో జుక్సైన్‌ రెస్టారెంటు కుప్పకూలిన ఘ‌ట‌న (China Restaurant Collapse) విషాదాన్ని నింపింది. లిన్‌ఫెన్‌ అనే పట్టణంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బీజింగ్‌కు 630 కిలోమీటర్ల దూరంలోని షాంకి ప్రావిన్స్‌లోని జియాంగ్‌ఫెన్ (Shanxi Province) కౌంటీలో గల రెండంతస్తుల రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి 80వ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా శనివారం అది కూలిపోయింది. వెంటనే వందలాది మంది రెస్క్యూ సిబ్బంది, డాగ్స్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించారు. ఆదివారం నాటికి రెస్క్యూ ఆపరేషన్ ముగించారు.

India Coronavirus: రెండోసారి కరోనా రావడంపై క్లారిటీ ఇచ్చిన శాస్త్రవేత్తలు, దేశంలో తాజాగా 78,761 కేసులు నమోదు, ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం విడుద‌ల చేసిన‌ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) 35 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,761 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కరోనాతో తాజాగా 948 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్త మరణాల సంఖ్య 63,498కు చేరింది. వైరస్‌ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 27,13,934 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,65,302 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,14,61,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Schools to Reopen in Wuhan: కరోనా నుంచి కోలుకున్న వుహాన్‌, సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు,కాలేజీలు ప్రారంభం, విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు

Hazarath Reddy

కరోనావైరస్ తొలిసారి వెలుగు చూసిన చైనాలోని వూహాన్ నగరం (China's Wuhan) ఇప్పుడు సాధారణ జీవితానికి వచ్చేసింది. అక్కడ స్థానిక ప్రభుత్వం ఆంక్షలకు సెలవిస్తూ పూర్తిస్థాయి అన్‌లాక్ దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఈ క్రమంలోనే స్కూళ్లు తెరిచేందుకు అనుమతిస్తూ (Schools to Reopen in Wuhan) అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి అక్కడున్న 2842 విద్యా సంస్థలు తమ కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభించనున్నాయి. 10.4లక్షల మంది విద్యార్థులు ఆగిపోయిన తమ చదువులను తిరిగి ప్రారంభించనున్నారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Coronavirus (COVID-19): బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్‌ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్

Hazarath Reddy

కరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది (coronavirus disease (COVID-19) మరింతగా భయపెడుతోంది. దీనిపై శాస్ర్తవేత్తలు రోజుకొక కొత్త ఆసక్తిర విషయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా మరొక వార్త బయటకు వచ్చింది. కోవిడ్‌–19 (Coronavirus (COVID-19) బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు (Obesity) 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

Advertisement

Galwan Clash: గాల్వన్ వ్యాలీ ఘర్షణ, బయటపడిన చైనా సైనికుని సమాధి, ఈ వార్తపై ఇంకా స్పందించని డ్రాగన్ దేశం, ట్విట్టర్లో వైరల్ అవుతున్న చైనా సైనికుని సమాధి రాయి ఫోటో..

Hazarath Reddy

ఇండియా‌-చైనా దళలా మధ్య జూన్‌ 15న గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో (Galwan Clash) 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.అయితే గాల్వన్ వ్యాలీలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో (India-China Tensions) చైనాకు ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ చైనా గోప్యంగానే ఉంచింది. ఈ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు (People's Liberation Army (PLA) ప్రాణాలు కోల్పోయారు? ఎంత మంది గాయపడ్డారు? అనే వివరాలను చైనా కమ్యూనిష్టు ప్రభుత్వం (ChinA Govt) ఇప్పటికీ దేశ ప్రజలకు తెలియజేయలేదు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కానీ చైనా నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

TikTok-Triller Deal Rumors: దూసుకొస్తున్న అమెరికా గడువు, టిక్ టాక్‌పై కన్నేసిన మరో అమెరికా దిగ్గజం, 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో ట్రిల్లర్ సంప్రదింపు, అలాంటిదేమి లేదని తెలిపిన టిక్ టాక్

Hazarath Reddy

ఇండియాలో బ్యాన్ అయిన చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌ (TikTok) కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ (Triller) చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను (ByteDance) సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో (TikTok-Triller Deal) సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది.

COVID-19 in India: కరోనాపై గుడ్ న్యూస్, దేశంలో 26 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ ఉన్న కేసులు 7,52,424 మాత్రమే, దేశంలో తాజాగా 76,472 కేసులు నమోదు, 62,550కు పెరిగిన మరణాల సంఖ్య

Hazarath Reddy

దేశంలో శుక్రవారం తాజాగా మరో 76,472 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య34,63,973కు (COVID-19 in India) చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,021 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 62,550కు (Coronavirus Deaths) చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య26,48,999 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,52,424గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 21.90గా ఉంది. కాగా యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న కేసులు 18 లక్షలకు పైగా అధికంగా ఉన్నాయి.అంతేగాక యాక్టివ్‌ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం శుభ పరిణామం.

Kim Jong-Un: కోమాలేదు..గీమాలేదు, మీటింగ్‌లో దర్జాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, సంచలన ఫోటోలను విడుదల చేసిన నార్త్ కొరియా వార్తా సంస్థ కెసిఎన్ఎ, నిజమా..కాదా అనే సందిగ్ధంలో నెటిజన్లు

Hazarath Reddy

గత కొద్ది కాలం నుంచి ఉత్తర కొరియా అధ్యక్షుడు (North Korean leader Kim) కోమాలోకి వెళ్లారని, ఆయన చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే నార్త్ కొరియా అధ్యక్షుడు (Kim Jong-Un) బతికే ఉన్నారంటూ ఇప్పుడు ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో నిజమొంతో తెలియదు కాని... బయటకు వచ్చిన వార్త ప్రకారం.. కరోనావైరస్, అలాగే దూసుకొస్తున్న తుఫాను కట్టడికి (looming typhoon) నివారణ ప్రయత్నాలు చేయాలని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చినట్లు నార్త్ కొరియా వార్తా సంస్థ కెసిఎన్ఎ ( KCNA) బుధవారం తెలిపింది.

Advertisement
Advertisement