World

France Political Turmoil: ఫ్రాన్స్‌లో 'బ్లాక్ ఎవ్రీథింగ్' నిరసన, పారిస్‌లో 200 మందికి పైగా వ్యక్తులు అరెస్ట్, నిరసనల అల్లకల్లోలం

Team Latestly

ప్రజాదరణ లేని కారణంగా ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన రెండు రోజుల తర్వాత కూడా ఫ్రాన్స్‌లోని నిరసనకారులు “బ్లాక్ ఎవ్రీథింగ్” ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడంలో 200 మందికి పైగా వ్యక్తులను ఫ్రెంచ్ పోలీస్ అధికారులు అరెస్టు చేశారు.

KP Sharma Oli Resigns: హిమాలయ దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభం, ప్రధాని పదవికి రాజీనామా చేసిన కె.పి. శర్మ ఓలి, సోషల్ మీడియా నిషేధంపై వెలువెత్తుతున్న నిరసనలు

Team Latestly

సైన్యం సూచన మేరకు ప్రధాని కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నెపాల్‌లో కొత్త ప్రధాన మంత్రి ఎవరో ఈ సాయంత్రం ప్రకటించనున్నట్లు వార్తలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు.

Political Turmoil in Nepal: నేపాల్ అధ్యక్షుడు రాజీనామా, ప్రధాని రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రామ్ చంద్ర పొదెల్ రాజీనామా, ఆగ్రహ జ్వాలలతో అట్టుడుకుతున్న నేపాల్

Team Latestly

నేపాల్ దేశంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలల వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఇటీవల రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు.

Giorgio Armani Dies: ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూత, మరణం ఫ్యాషన్ రంగానికి పెద్ద లోటు అంటూ సంతాపం తెలిపిన అర్మానీ గ్రూపు

Team Latestly

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 4) తన 91 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇటలీలోని మిలన్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

Advertisement

Fire Breaks Out In New York: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో

Arun Charagonda

న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు కలకలరం రేపింది. లాంగ్ ఐలాండ్‌లోని హెంప్టన్స్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి . కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో హైవేలు మూసివేశారు.

Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!

Rudra

జనారణ్యంలోకి వణ్యప్రాణులు రావడం ఇటీవల తరచూ జరుగుతుంటుంది. ఏనుగులు, పులులు, సింహాలు.. నివాస ప్రాంతాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి.

New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్‌లైన్‌లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు

VNS

చైనాలో ఓ సరికొత్త ఆన్‌లైన్ ట్రెండ్ (New Trend) ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రధాన బ్యాంకుల ఆవరణలోని మట్టిని (Soil) సేకరించి దాన్ని అమ్ముతున్నారు. ఆ మట్టి ఉంటే అదృష్టం, ఆర్థికంగా కలిసివస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ ‘బ్యాంక్ మట్టి’ (Bank Soil) ధర సుమారు రూ.250 నుంచి రూ.10,200 మధ్య వరకు ఉంది.

Migrant Boats Capsized: ఘోర ప్రమాదం, వలస కూలీలతో వెళ్తున్న నాలుగు పడవలు సముద్రంలో బోల్తా, 188 మంది గల్లంతు, ఇద్దరు మృతి

Hazarath Reddy

యెమెన్ (Yemen)‌, జిబౌటీ (Djibouti) తీరాల మధ్య సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది.పొట్టకూటి కోసం దేశ విడిచి వెళ్తున్న 188 మంది బతుకులు తెల్లారిపోయాయి. ఉపాధి కోసం వెళ్తున్న కూలీలను తీసుకెళ్తున్న నాలుగు పడవలు (Four boats) మార్గమధ్యలో మునిగిపోయాయి.

Advertisement

Viral Video: విమానంలో షాకింగ్ సంఘటన.. బట్టలు విప్పేసి పరుగు పెట్టిన ప్రయాణికురాలు, వైరల్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ అమెరికాలోని హూస్టన్‌ నుంచి ఫీనిక్స్‌ కు బయలుదేరింది.

SpaceX Starship explode: ఎలాన్‌ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో

Arun Charagonda

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్‌. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది

US Travel Ban: డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్‌పై ట్రావెల్ బ్యాన్‌ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు

VNS

దేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. పలు దేశాల నుంచి వచ్చే వారిపైనా నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ (Pakistan), అఫ్గానిస్థాన్‌లపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Two Kerala Men Executed in UAE: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష, ఇప్పటివరకు 28 మంది ఇండియన్లకు యూఏఈలో మరణశిక్ష

Hazarath Reddy

హత్య కేసులో యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలైంది. కేరళకు చెందిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు యూఏఈ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.

Advertisement

S Jaishankar Security Scare: వీడియో ఇదిగో, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడి, లండన్‌ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం

Hazarath Reddy

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ యూకే పర్యటనలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ అనుచరులు దాడికి యత్నించడం కలకలం రేపింది. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ అనుకూల కార్యకర్తలు ఆయన కారువైపు దూసుకొచ్చారు.

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న అతడు.. అక్కడికి వచ్చిన దుండగులను అడ్డుకోబోగా వారు కాల్పులు జరిపి పారిపోయారు.

Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు

Arun Charagonda

పవిత్ర రంజాన్ మాసం వేళ పాకిస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. వాయువ్య పాకిస్తాన్‌లోని సైనిక స్థావరంనే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడి చేయగా ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు

Banana Still Fresh After Opening: తొక్క తీసినా 24 గంటలపాటు తాజాగానే అరటిపండు.. అదెలా అంటారా? అయితే, ఈ వార్త చదవండి..!

Rudra

తొక్క తీసిన అరటిపండు ఐదు నిమిషాల్లోనే చెడిపోతుంది. జావగారిపోయి దుర్వాసన కూడా వస్తుంది. కొద్ది క్షణాల్లోనే నల్లబడుతుంది. అయితే, తొక్క తీసిన తర్వాత కూడా అరటిపండు 24 గంటలపాటు తాజాగా ఉండేట్టు చేయటంలో బ్రిటిష్‌ సైంటిస్టులు సక్సెస్‌ అయ్యారు.

Advertisement

Carolina Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో తగలబడుతున్న అమెరికాలోని రెండు రాష్ట్రాలు, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా తీవ్రరూపం దాల్చిన కార్చిచ్చు

Hazarath Reddy

2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)

Rudra

యావత్తూ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబురం ఎంతో వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

Heatwaves Could Age Humans Faster: మండే ఎండలతో వృద్ధాప్యం మరింత త్వరగా రావొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

ఎండలతో చర్మ సౌందర్యం, కాంతి తగ్గిపోతుందని తెలుసు. అయితే, అవే ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.

English Official Language of U.S: ఇకపై అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్, కీలక ఫైల్‌పై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్‌

VNS

అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను పేర్కొంటూ డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. తాజా ఆదేశాలు ఫెడరల్‌ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా, వద్దా? అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి

Advertisement
Advertisement