ఆటోమొబైల్స్

Maruti Grand Vitara: అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్

Vikas M

2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా..కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది. మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది.

Bajaj Chetak Electric Scooter: అమ్మకాల్లో దుమ్మురేపిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఏడాదిలో రికార్డు స్థాయిలో 2 లక్షల యూనిట్ల అమ్మకాలు

Vikas M

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. జూన్ 2024లో ఈ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 16691 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రారంభంలో కేటీఎమ్ షోరూమ్‌లలో అమ్ముడైన ఈ స్కూటర్.. ఇప్పుడు బజాజ్ డీలర్ నెట్‌వర్క్ ద్వారా అమ్ముడవుతోంది.

Kia EV6 Recalled In India: ఈవీ6 ఎస్‌యూవీ కార్లలో ఐసీసీయూలో సాంకేతిక లోపం, 1,100 వాహనాలను రీకాల్ చేస్తున్న కియా ఇండియా

Vikas M

దక్షిణ కొరియా ఆటోదిగ్గజం కియా ఇండియా (Kia India) తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఈవీ6 (EV6)’ కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2022 మార్చి మూడో తేదీ నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారు చేసిన 1,100 కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Mahindra XUV700 AX7 Prices Cut: త్వరపడండి, మహీంద్రా ఎక్స్‌యూవీ 700పై రూ. 2 లక్షల వరకు తగ్గింపు, మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్

Vikas M

ఏఎక్స్‌7 వేరియంట్‌ ధరలు రూ.19.49 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతాయి. గతంలో ఈ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.21.54 లక్షలుగా ఉండేది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.2 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. కొత్త ధరలు జులై 10 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ధరలు కేవలం నాలుగు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా పేర్కొంది.

Advertisement

Bajaj Freedom 125 CNG: కేవ‌లం రూ. 95వేల‌కే తో న‌డిచే బైక్, కిలో సీఎన్జీతో ఏకంగా 125 కి.మీ వెళ్లే బైక్, పెట్రోల్ తో కూడా న‌డుపుకోవ‌చ్చు

VNS

బజాజ్ ఫ్రీడమ్ 125 (Freedom 125) అనే పేరుతో బజాజ్ ఆటో (Bajaj Auto) ఆవిష్కరించిన ఈ సీఎన్జీ (E CNG) మోటార్ సైకిల్ (CNG Motor Cycle) ధర రూ.95,000 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. సీఎన్జీ మోడ్‌లో కిలో సీఎన్జీ గ్యాస్ పై 120 కి.మీ, పెట్రోల్ మోడ్‌లో లీటర్ పెట్రోల్‌పై 65 కి.మీ మైలేజీ ఇస్తుంది.

Mahindra XUV700: దుమ్మురేపుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మార్కెట్లోకి వచ్చిన 33 నెలల్లో రెండు లక్షలు దాటిన అమ్మకాలు

Vikas M

మహీంద్రా అండ్ మహీంద్రాలో టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ కారు ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700) మార్కెట్లోకి వచ్చిన 33 నెలల్లోనే రెండు లక్షలకు పైగా యూనిట్ల విక్రయంతో లాండ్ మార్క్ రికార్డు నమోదు చేసింది. ప్రారంభించిన మూడు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో, మహీంద్రా XUV700 యొక్క 2 లక్షల యూనిట్లు భారతదేశంలో తయారు చేయబడ్డాయి

Tata Motors to Increase CV Prices: కమర్షియల్ వాహనాల ధరలను రెండు శాతం పెంచిన టాటా మోటార్స్, కొత్త ధరలు జులై 1 నుంచి అమల్లోకి..

Vikas M

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata motors) మరోసారి వాహనాల ధరల పెంపునకు (Price hike) సిద్ధమైంది. వాణిజ్య వాహనాల ధరలను జూలై నెల పెంచనున్నట్లు నుంచి బుధవారం ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 2శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది.

Yamaha Fascino S: యమహా ఫ్యాసినో ఎస్‌ స్కూటర్‌ వచ్చేసింది బాసూ, ధర రూ.93,730 మాత్రమే, స్పెషల్ ఏంటంటే..

Vikas M

దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్‌ ఫ్యాసినో ఎస్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్‌. యూరోపియన్‌ డిజైన్‌, పనితీరు, నయా లుక్‌తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్‌ మోడల్‌ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్‌ ధర రూ.93,730, రూ.94,530గా నిర్ణయించింది.

Advertisement

Big Discounts on Nexa Cars: త్వరపడండి, మారుతి నెక్సా కార్లపై రూ. 70 వేల వరకు తగ్గింపు, ఏయే కార్ల రేట్లు తగ్గాయంటే..

Vikas M

మారుతీ సుజుకి తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. వాహన తయారీదారు నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ తగ్గింపులతో సహా వివిధ మోడళ్లలో అనేక రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఇక్కడ, తగ్గింపు మోడల్‌లను త్వరగా పరిశీలిద్దాం. గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్‌పై అత్యధికంగా రూ.74,000 వరకు తగ్గింపు లభిస్తుంది

Mahindra XUV700 New Variant: మహీంద్రా XUV700లో కొత్త వేరియంట్ వచ్చేసింది, రూ. 16.89 లక్షలకే AX5 సెలెక్ట్ ను సొంతం చేసుకోండి

Vikas M

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్‌డీ సూపర్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్‌ను AX5 సెలెక్ట్ వేరియంట్ లో పొందుపరిచారు

Audi Q7 Bold Edition: ఎస్ యూవీలో స్పెష‌ల్ ఎడిష‌న్ రిలీజ్ చేసిన ఆడి, నాలుగు క‌ల‌ర్స్ లో లిమిటెడ్ యూనిట్స్ మాత్ర‌మే ఉత్ప‌త్తి, ఆడి క్యూ7 బోల్డ్ పూర్తి ఫీచ‌ర్స్ ఇవీ!

VNS

ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) తన క్యూ7 ఎస్‌యూవీ కారులో స్పెషల్ ఎడిషన్ ‘చిరిస్టెన్డ్ ఆడి క్యూ7 బోర్డ్ ఎడిషన్’ (Audi Q7 Bold Edition) కారును ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.

Mahindra Group Invest Row: ఆటో సెక్టార్‌లో రూ. 37 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న మహీంద్రా గ్రూప్, 23 కొత్త వాహనాలు విడుదల చేయబోతున్నట్లు ప్రకటన

Vikas M

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిశ్‌ షా తెలిపారు.

Advertisement

Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO సంచలనం, 60 నిమిషాల్లో 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు నమోదు

Vikas M

భారతదేశంలోని ప్రముఖ SUV తయారీదారు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, ఇటీవల విడుదల చేసిన కాంపాక్ట్ SUV, XUV 3XO కోసం అపూర్వమైన విజయాన్ని ప్రకటించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు బుకింగ్‌లు ప్రారంభించిన మొదటి 60 నిమిషాల్లోనే, XUV 3XO 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకుంది.

Tata Nexon Entry-Level Variants: టాటా నెక్సాన్ నుంచి ఎంట్రీ-లెవల్ వేరియంట్లు, ధర రూ. 7.49 లక్షలు నుంచి ప్రారంభం, ఫీచర్లు ఇవిగో..

Vikas M

మహీంద్రా XUV 3XO లాంచ్ తర్వాత టాటా మోటార్స్ దాన్ని సవాల్ చేయడానికి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లను పరిచయం చేసింది. వీటి ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. పెట్రోల్ మోడల్‌లో స్మార్ట్ (ఓ), డీజిల్ మోడల్‌లో స్మార్ట్ +, స్మార్ట్ + ఎస్ కార్లు ఉంటాయి

New Maruti Swift 2024: మారుతీ సుజుకి స్విఫ్ట్ -2024 వర్షన్ కారు వచ్చేసింది, ధర రూ.6.50 లక్షల నుంచి ప్రారంభం, ప్రత్యేకతలు ఇవిగో..

Vikas M

భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాజాగా మారుతి సుజుకి స్విఫ్ట్ -2024 వర్షన్ కారు ఆవిష్కరించింది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తున్న మారుతి స్విఫ్ట్.. కొత్తగా 1.2 లీటర్ల త్రీ-సిలిండర్ జడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది.

Tesla Layoffs: బిగ్గెస్ట్ లేఆప్స్, 16 వేల మంది ఉద్యోగులను తొలగించిన టెస్లా, గత నెలలో ప్రమోషన్ పొంది ఈ నెలలో జాబ్ కోల్పోయిన భారత టెకీ ఆవేదన అక్షర రూపంలో..

Vikas M

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది.తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను టెస్లా తొలగించింది.తర్వాత కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కంటిన్యూ అవుతోంది.

Advertisement

Okaya Ferrato Disruptor: దేశీయ మార్కెట్లోకి ఒకాయా నుంచి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ డిస్రప్టర్, సింగిల్ చార్జింగ్ పూర్తి చేస్తే 129 కి.మీ దూరం ప్రయాణం

Vikas M

Okaya EV ఈ ఏడాది మార్చిలో తన కొత్త ప్రీమియం అనుబంధ బ్రాండ్ ఫెర్రాటోను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇప్పుడు స్వదేశీ EV స్టార్టప్ ఈ బ్రాండ్ క్రింద డిస్రప్టర్ అనే మొదటి మోడల్‌ను పరిచయం చేసింది. రూ. 1.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో, ఫెర్రాటో డిస్‌రప్టర్‌కు సంబంధించిన డెలివరీలు ఈ ఏడాది ఆగస్టు నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Force Gurkha 5-Door: దేశీయ మార్కెట్లోకి ఫోర్స్ 5-డోర్ గుర్ఖా వచ్చేసింది, ధర రూ. 18 లక్షల నుంచి ప్రారంభం, రూ. 25 వేలతో ఫ్రీ బుకింగ్స్, మే మధ్యలో డెలివరీ

Vikas M

ఫోర్స్ మోటార్స్ 2024 గూర్ఖా 3-డోర్ మరియు 5-డోర్ మోడళ్ల ధరలను ప్రకటించింది. 2024 ఫోర్స్ గూర్ఖా 3-డోర్ ధర ₹ 16.75 లక్షలు, అయితే గూర్ఖా 5-డోర్ మీకు ₹ 18 లక్షల వరకు సెట్ చేస్తుంది . అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, TCS మినహాయించబడ్డాయి

BMW M4 Competition Coupe: భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ నుంచి కొత్త మోడల్, BMW M4 Competition Coupeని విడుదల చేసిన కంపెనీ, ధర కోటి యాభై లక్షలు పై మాటే..

Vikas M

కొత్త BMW M4 Competition Coupe ఈరోజు భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ కారు దేశంలో పూర్తిగా బిల్ట్-అప్ (CBU) మోడల్‌గా అందుబాటులో ఉంటుంది మరియు BMW డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో మరియు BMW ఆన్‌లైన్ షాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. BMW M4 కాంపిటీషన్ కూపే లగ్జరీ కారు లుక్ చాలా దూకుడుగా కనిపిస్తుంది.

Kia EV6 Facelift: కియా ఇండియా నుంచి అధ్భుత ఫీచర్లతో ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు, ధర రూ. 60.95 లక్షలతో ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

దక్షిణ కొరియా ఆటో మొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ’ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ (EV6 facelift)’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 2025 ఈవీ6 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లలో కొన్ని వారాల్లో ఆవిష్కరించనున్నది.

Advertisement
Advertisement