Entertainment

Manchu Family Dispute: మైక్ తీసుకొచ్చి నోట్లో పెట్టారు, మీ ఇంట్లో ఎవరైనా దూరి ఇలా చేస్తే అంగీకరిస్తారా? రెండో ఆడియోని విడుదల చేసిన మోహన్ బాబు

Hazarath Reddy

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటన కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆయన రెండో సారి ఆడియో విడుదల చేశారు. జర్నలిస్ట్‌ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆడియోలో ప్రశ్నించారు

MLA Raja Singh on Mohan Babu: జర్నలిస్టు దాడి ఘటనపై మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దది అవుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

Hazarath Reddy

జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు.మోహన్ బాబు ఫ్యామీలి గొడవల్లో వారి కొడుకు మీడియాను పిలవడం వల్లే హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. మోహన్ బాబు మీ కుటుంబ సమస్య మీ ఇంటివరకే ఉంటే బాగుంటుంది.. అని తెలిపారు.

Keerthy Suresh Marries Antony: గోవాలో ఘనంగా నటి కీర్తి సురేష్‌ వివాహం, చిననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న కీర్తి

Arun Charagonda

నటి కీర్తి సురేష్‌ వివాహం కన్నుల పండువగా జరిగింది. తన చిననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకుంది కీర్తి. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కీర్తి సురేష్‌ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, రాధిక శరత్ కుమార్..వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం...వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, నటి రాధికా శరత్ కుమార్. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement

Manchu Lakshmi: ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో మంచు లక్ష్మీ వేదాంతం, ఆస్తులు ఎవరికీ ఇచ్చేది లేదని మోహన్ బాబు చెప్పిన నేపథ్యంలో మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్‌

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి నోట వేదాంతం వల్లించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆస్తులు ఎవరికీ ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన మోహన్ బాబు మాటలకు కూతురు లక్ష్మి ఇలా వేదాంతం వల్లిస్తుందని అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Manchu Vishnu Meets Rachakonda CP: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక.. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ అరెస్ట్

Arun Charagonda

నటుడు మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. సీపీ నోటీసుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ ఆఫీస్‌కు వచ్చిన విష్ణును గంటన్నర సేపు విచారించారు సుధీర్ బాబు. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి...శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

Mohan Babu: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు, జర్నలిస్టుపై దాడి ఘటనలో బీఎన్‌ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసుగా మారుస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దానిని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నంగా మారుస్తూ కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు.

Allu Arjun Approached High Court: హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్, సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో కేసు కొట్టివేయాల‌ని పిటీష‌న్

VNS

హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును (High Court) ఆశ్రయించాడు. హైదరాబాద్‌ ఆర్జీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేశాడు.

Advertisement

Mohan Babu Health Update: మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు, మరో రెండు రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడి

Hazarath Reddy

మోహన్ బాబు ఆరోగ్యానికి సంబంధించిన కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మోహన్ బాబు ఎడమవైపు కంటి కింద గాయాలు అయ్యాయని తెలిపారు. ఇంటర్నల్ గాయాలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్‌కి వచ్చేటప్పటికి మోహన్ బాబు హైబీపీతో బాధ పడుతున్నారు.

Akhanda 2 Release Date: ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది, గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య అఖండ 2 ప్రోమో, వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న సినిమా విడుదల

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి విదితమే. ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి విడుదల తేదీని ప్రకటించారు.

Manchu Manoj: రాచకొండ సీపీకి మంచు మనోజ్ రూ.లక్ష బాండ్, ఎలాంటి గొడవలకు దిగగని బాండ్ సమర్పించిన మనోజ్

Arun Charagonda

రాచకొండ సీపీకి రూ.లక్ష బాండ్ సమర్పించారు మంచు మనోజ్‌. తాను ఎలాంటి గొడవలకు దిగనని శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని సీపీకి బాండ్‌ సమర్పించారు. తన తల్లి ఆసుపత్రిలో లేకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారరని మండిపడ్డారు. కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.

Manchu Family Dispute: ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు

Hazarath Reddy

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం విచారణకు రమ్మని పిలిచారు. దీంతో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Rajendra Prasad: బన్నీ నా కొడుకు లాంటి వాడు, వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేయలేదని స్పష్టం

Hazarath Reddy

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఈ మధ్య ఓ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి విదితమే. ఈ వివాదం ముద‌ర‌డంతో తాజాగా రాజేంద్ర ప్ర‌సాద్‌ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Manchu Family Dispute: ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం వల్లే మా నాన్నకు కోపం వచ్చింది, తప్పుడు ప్రచారాలు చేయొద్దని తెలిపిన మంచు విష్ణు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Mushtaq Khan Kidnapped: ప్రముఖ బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్‌ కిడ్నాప్, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా, సమీపంలోని మసీదులోకి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న నటుడు

Hazarath Reddy

వెల్‌కమ్‌ చిత్రం ద్వారా పేరుగాంచిన బాలీవుడ్ నటుడు ముష్తాక్ ఖాన్ కిడ్నాప్ కలకలం రేపింది. ఆయనను అగంతుకులు ఢిల్లీ-మీరట్ హైవే మీద కిడ్నాప్ చేసి రెండు లక్షల రూపాయలు దోచుకున్నారు.

Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియాపై తండ్రి మోహన్ బాబు దాడిపై కన్నీళ్లతో క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్, సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తానని వెల్లడి

Hazarath Reddy

తండ్రి మంచు మోహన్ బాబు మీడియాపై దాడికి క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. మీడియాపై మా నాన్న దాడి చేయడం బాధ కలిగించింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా అని వీడియో ద్వారా తెలిపారు. నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు.

Advertisement

Sobhita Dhulipala :పెళ్లికూతురిగా శోభిత ధూళిపాళ మాస్ స్టెప్పులు..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరిగిన తెలిసిందే. నాగచైతన్యతో పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా చాలా ఎమోషనల్ అయ్యింది శోభిత. తాజాగా తనుపెళ్లి కూతురు అవుతున్న సమయంలో డాన్స్ వేసింది. ఆ హ్యాపీ మూమెంట్స్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్ర‌ద్ధా, నాకు పెళ్ల‌వుతోంది.. నాకు సిగ్గేస్తోంది అంటూ త‌న స్నేహితురాలికి చెబుతూ, మాస్ స్టెప్పులు వేసింది.

Mohan babu: వీడియో ఇదిగో...ఆస్పత్రిలో మోహన్ బాబు...పోలీస్ విచారణకు గైర్హాజరయ్యే అవకాశం!

Arun Charagonda

గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు. ఇవాళ ఉదయం పదిన్నరకు తమ ఎదుట హాజరు కావాలని పహాడిషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన హాజరయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు.

Manchu Family Dispute: మోహన్‌ బాబుపై కాంగ్రెస్ నేతల ఫైర్, జర్నలిస్టులపై దాడి సరికాదని మండిపాటు, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ

Arun Charagonda

మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు అయింది. మోహన్ బాబుపై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు విచారణకు రావాలని ఆదేశించారు. మోహన్ బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు.

Manchu Family Dispute: రాచకొండ సీపీ విచారణకు మోహన్ బాబు, మనోజ్, విష్ణు...జల్‌పల్లి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ సుధీర్‌బాబు, మీడియాపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు

Arun Charagonda

సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం తారాస్థాయికి చేరింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్న మనోజ్‌ను భద్రతా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ తర్వాత గేట్లు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లారు మనోజ్. ఆ తర్వాత చిరిగిన చొక్కాతో మనోజ్ రావడం, మీడియాను లోపలికి తీసుకెళ్లడం ఆ తర్వాత మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
Advertisement