తాజా వార్తలు

VD12 : విజయ్ దేవరకొండ VD12 రిలీజ్ డేట్ ఫిక్స్‌, టైటిల్ - ఫస్ట్ లుక్ కూడా ఎప్పుడో చెప్పేసిన మేకర్స్, ఆసక్తికరంగా రౌడీ బాయ్ లుక్

Arun Charagonda

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం VD12. సినిమా షూటింగ్ జరుగుతుండగా ఇవాళ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.

Nithin Gadkari On Cashless Treatment: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స, పైలట్ ప్రాజెక్టుగా ఆ రెండు రాష్ట్రాల్లో అమలు,నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

Arun Charagonda

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మోటారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారి కోసం నగదు రహిత చికిత్స అందించేందుకు ఈ కొత్త పథకాన్ని రూపొందించామన్నారు. ప్రయోగాత్మకంగా అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

Khammam Road Accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారిని ఢీకొట్టి ముగ్గురు అక్కడికక్కడే మృతి, వీడియో

Arun Charagonda

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనకనుంచి వచ్చి డీ కొట్టారు ముగ్గురు యువకులు. అక్కడికక్కడే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సత్తుపల్లి మండలం.. బి. గంగారం వద్ద జరుగగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు

Visakha Local Bodies Election: విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, అధికారికంగా ప్రకటించిన జగన్, ఆగస్టు 30న పోలింగ్, సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేస్తూవైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌ రావు బహిరంగలేఖ, ఉపాధ్యాయ బదిలీలు - పదోన్నతులపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్

Arun Charagonda

తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యారంగ పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూనే విద్యారంగ ప్రయోజనాల గురించి కీలక సూచనలు చేశారు.

Director Ajay Sastry Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం, నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూత, నా బెస్ట్ ఫ్రెండ్ ఇకలేరంటూ మంచు మనోజ్ ట్వీట్

Hazarath Reddy

టాలీవుడ్ దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. అజయ్ శాస్త్రి గతంలో మంచు మనోజ్ హీరోగా 'నేను మీకు తెలుసా?' సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ శాస్త్రి స్వస్థలం హైదరాబాద్. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద రాఖీ, డేంజర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు.

Air India Cancels All Flights to Israel: పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్‌

Hazarath Reddy

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుండటంతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్ల‌డించింది.

Health Tips: ఈ పండ్లతో ఇన్ఫెక్షన్లకు చెక్, వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే, అస్సలు మిస్ కాకండి

Arun Charagonda

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ పోషకాలు అవసరం. అయితే ఇందులో కొన్ని సహజ సిద్ధంగా దొరికేవి అయితే మరికొన్ని కృత్రిమంగా లభిస్తాయి. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషించేంది రోగ నిరోధక శక్తి. ఇది బలహీన పడితే వ్యాధుల బారిన పడటం ఖాయం.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి శ్రీశైలం ఆలయంలో విధులకు వచ్చిన ఉద్యోగి, పట్టుకుని చితకబాదిన భక్తులు

Hazarath Reddy

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని భక్తులు పట్టుకుని చితకబాదారు. క్యూ కంపార్టుమెంట్‌లో గురువారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Wayanad Landslide: వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు, కేరళకు సాయం అందించేందుకు ముందుకొస్తున్న సినీ నటులు!

Arun Charagonda

కేరళను ఓ వైపు వర్షం మరోవైపు కొండ చరియలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇక మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 289 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Wayanad Landslide Death Toll: వయనాడ్‌లో ఇంకా ఆగని మృత్యుఘోష, 308కు చేరుకున్న మృతుల సంఖ్య, నాలుగు రోజుల తర్వాత గాయాలతో సజీవంగా బయటపడిన కుటుంబం

Hazarath Reddy

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 308 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్టు అధికారులు నిర్దారించారు.

Maharashtra: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాదం, నదిని దాటుతు బోల్తా పడిన ట్రాక్టర్,8 మంది గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు

Arun Charagonda

మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఇచల్‌కరంజిలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నది ప్రవాహానికి అందులో ఉన్న 7-8 మంది గల్లంతయ్యారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం స్థలానికి చేరుకుంది.

Advertisement

Madhya Pradesh Horror: దారుణం, నిద్రలో మూత్ర విసర్జన చేశాడని బాలుడి ప్రైవేట్ పార్టుపై వేడి గరిటెతో కాల్చిన సవతి తల్లి, బాధతో అల్లాడిపోయిన పసివాడు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలుడిపై సవతి తల్లి రాక్షసంగా ప్రవర్తించింది. బుధవారం తెల్లవారుజామున బాలుడు నిద్రలో మంచంపై మూత్ర విసర్జన చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

NEET UG 2024 Paper Leak Case: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ, నీట్‌ యూజీ 2024 పరీక్ష ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

నీట్‌ యూజీ 2024 పరీక్ష (NEET UG 2024 Exam) ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ ఇటీవల కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం.. అందుకుగల కారణాలను వివరిస్తూ శుక్రవారం మళ్లీ తీర్పు వెలువరించింది.

Fake Deliveray Scam: డెలివరీ బాయ్ స్కామ్‌తో జాగ్రత్త..మీరు ఏం ఆర్డర్ చేయకుండానే ఓటీపీ చెప్పారో..అంతే!

Arun Charagonda

సైబర్ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా వదలట్లేదు. తాజాగా డెలివరీ బాయ్ స్కామ్ తెరపైకి వచ్చింది. మీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తే ఖచ్చితంగా అది స్కాం అని గుర్తించండి. మీకు ఎవరో ఆర్డర్ పంపారు అని మీ మొబైల్‌కు వచ్చిన OTP చెప్పమని అడిగితే చెప్పకండి. మీకు తెలియకుండానే మీకు ఎలాంటి ఆర్డర్ రాదు కాబట్టి అది ఖచ్చితంగా మోసమేనని గ్రహించి సైబర్ మోసాలకు ఒక్క అడుగు దూరంలో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Viral Video: తరగతి గదిలో స్విమ్మింగ్ చేస్తున్న విద్యార్థులు వీడియో మళ్లీ వైరల్, పిల్లల్ని స్కూలుకు రప్పించడానికి యూపీ టీచర్లు చేసిన ప్రయత్నంపై భిన్నాభిప్రాయాలు

Hazarath Reddy

సోషల్ మీడియాలో పాత వీడియోలు మళ్లీ ఒక్కోసారి సందర్భం వచ్చినప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చింది.

Advertisement

Andhra Pradesh Horror: అనంతపురంలో కామాంధుడుగా మారిన స్కూల్ కరస్పాండెంట్, రూం తలుపేసి చిన్నపిల్లలు బట్టలు విప్పి దారుణమైన వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆదిమూర్తినగర్‌లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తంచాడని బాధితురాలి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆంజనేయులు పలుమార్లు తమ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడన్న తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana Assembly Sessions: తెలంగాణలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, బీసీసీఐతో చర్చలు జరిపామన్న సీఎం రేవంత్ రెడ్డి, మండలానికో మినీ స్టేడియం ప్రతిపాదన

Arun Charagonda

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ సమీపంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు .ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు.

Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, భార్యాభర్తల గొడవను తీర్చడానికి వెళ్లిన పోలీసును అమ్మనాబూతులు తిట్టిన భర్త, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో, పోలీసు అధికారులను దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు అతని భార్య మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నించినప్పుడు, అతని గుర్తింపును బహిర్గతం చేయని ఓ వ్యక్తి వీడియోలో " తేరీ మా చ్** దుంగా "తో సహా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం వీడియోలో కనిపించింది.

Hoarding Collapse in Thane: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో బలమైన గాలులకు కూలిన హోర్డింగ్, తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు,మూడు వాహనాలు ధ్వంసం

Hazarath Reddy

మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ హోర్డింగ్ కూలి మూడు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయని అధికారి తెలిపారు. డోంబివిలి ప్రాంతంలో రద్దీగా ఉండే సహజానంద్ చౌక్ వద్ద ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి గాయాలు అయినట్లు నివేదికలు లేవని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement