తాజా వార్తలు

Rahul Gandhi: నాపై ఈడీ దాడికి ప్లాన్.. చక్రవ్యూహం వ్యాఖ్యలే దీనికి కారణం.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Rudra

ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) త‌న‌పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తోంద‌ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఈడీలో ప‌నిచేస్తున్న కొంద‌రు ఉన్నతాధికారులు త‌న‌కు స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లు చెప్పారు.

YS Jagan Passport Renewal: భార్య వైఎస్ భారతితో కలిసి పాస్‌ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్

Rudra

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాస్‌ పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్‌ పోర్టు కార్యాలయానికి వచ్చారు.

Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.

Intel Layoffs: 20 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోబోతున్నాం.. ఇందులో భాగంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన

Rudra

ఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్ లో తిరోగమనం వెరసి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా చిప్‌ ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది.

Advertisement

TG Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్రకటన.. తెల్ల రేషన్‌ కార్డులు జారీపై కూడా కీలక ప్రకటన

Rudra

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులు గత ఏండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ఉద్దేశించిన జాబ్ క్యాలెండర్‌ ను నేటి అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం ప్రకటించబోతున్నది.

Raj Tarun Case: లావ‌ణ్య కేసులో హైకోర్టును ఆశ్ర‌యించిన హీరో రాజ్ త‌రుణ్, విచార‌ణ రేప‌టికి వాయిదా

VNS

ముందస్తు బెయిల్ మంజూరు (Bail Petition) చేయాలని పిటిషన్ వేశాడు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు (TG High Court) ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

GHMC Rain Alert: గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు రెయిన్ అల‌ర్ట్, రెండు రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని హెచ్చ‌రిక‌

VNS

బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైద‌రాబాద్‌లోని (GHMC Rain Alert) కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్‌ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ (TGDPS) అధికారులు వెల్లడించారు. జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, మహదేవ్‌పురం, మచ్చబొల్లారం తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

Kalki Ticket For Rs 100 Only: క‌ల్కీ మూవీ టికెట్ కేవ‌లం రూ.100 మాత్ర‌మే, దేశ‌వ్యాప్తంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వైజ‌యంతి మూవీస్

VNS

కల్కి మూవీని రూ.100 కే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాదండోయ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేట‌ర్ల‌లో చూడొచ్చున‌ని చెప్పింది. అయితే.. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 2 నుంచి 9 వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Advertisement

Bhumata Portal: ధరణి పోర్టల్ పేరును భూమాత పోర్టల్‌గా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తిరిగి తెరుచుకోనున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్​లో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ధరణి పేరును భూమాతగా మార్చనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ.. తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టిన సంగతి విదితమే.

TG Job Calendar: తెలంగాణ యువ‌త‌కు గుడ్ న్యూస్, రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌నున్న ప్ర‌భుత్వం

VNS

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్‌ను (Job Calender) కేబినేట్ ఆమోదించింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ నెల 2వ తేదీన అసెంబ్లీ (Assembly) వేదిక‌గా జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Wayanad Landslide Death Toll: వయనాడ్‌లో ఆగని మృత్యుఘోష, వరదలో కొట్టుకువస్తున్న మృతదేహాలు, 281కి పెరిగిన మరణించిన వారి సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Hazarath Reddy

వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 281 కి చేరింది. ప్రస్తుతం రెస్క్యూ అపరేషన్స్ కొనసాగుతోంది. సీఎం విజయన్ ఏరియల్ సర్వే చేపట్టారు. అక్కడ సహాయక చర్యలకు వర్షం అడ్డంకులు చోటుచేసుకుంటున్నాయి

Skill University: హైద‌రాబాద్ జంట న‌గ‌రాల‌కు జోడీగా మ‌రో సిటీ, కందుకూరు ద‌గ్గ‌ర కొత్త న‌గ‌రం రూపుదిద్దుకోబోతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి

VNS

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో స్కిల్ యూనివర్సిటీకి (Skill University) సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్ వర్సీటీ ఆఫ్ తెలంగాణగా నామకరణం చేసింది ప్రభుత్వం.

Advertisement

Pune Shocker: దేవుడా..ఇంటి గేట్ మీద పడి చిన్నారి మృతి, షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో..

Hazarath Reddy

ఇనుప గేటు కూలి మూడేళ్ల బాలిక మృతి చెందిన దిగ్భ్రాంతికరమైన సంఘటన పూణేలోని బోప్‌ఖెల్‌లో వెలుగు చూసింది. ఈ ఘటన పింప్రీ చించ్‌వాడ్‌లోని బోప్‌ఖేల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.

Telangana Road Accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన బైక్, ముగ్గురు స్పాట్‌లోనే మృతి

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం సమీపంలోని రామ గోవిందాపురం గ్రామం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, యువతి పక్కన ఉండగా వృద్ధుడిలో లేచిన కామాంధుడు, ఆమె హెయిర్ తాకుతూ, వాసన పీలుస్తూ పైశాచికానందం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బిసౌలీలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో స్థానికంగా ఉన్న ఓ దుకాణం దగ్గర ఓ యువతి వృద్ధుడి పక్కనే నిలబడి తెలిసినవారితో మాట్లాడుతోంది. పెద్ద మనిషి ఆమెకు దగ్గరగా వెళ్లి వెంట్రుకలను తాకే ప్రయత్నం చేశాడు.

Road Accident Video: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసి బస్సు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. భాకరాపేట ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో కర్ణాటక ఆర్టీసి బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Advertisement

YS Jagan Praja Darbar: వైఎస్ జగన్ ప్రజాదర్బార్ వీడియోలు ఇవిగో, ఇంకా ఏ మాత్రం తగ్గని క్రేజ్, అధినేతను కలవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు

Hazarath Reddy

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ ను నేడు విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలోని ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. వైజాగ్ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Telangana Cabinet Meeting: తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ, జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Telangana Road Accident: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం, పోలీసుల స్పందన భేష్, స్థానికుల హర్షం

Arun Charagonda

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో బీర్ల సీసాలు, ఉల్లిగడ్డలు చెల్లాచెదురుగా పడ్డాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. పోలీసులు రోడ్డును శుభ్రం చేసి వేగంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. వారు వ్యవహరించిన తీరు పట్ల వాహనదారులు ప్రశంసలు కురిపించారు.

Telangana Weather Forecast: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకి కూడా వానల అలర్ట్

Hazarath Reddy

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని బులిటెన్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement