తాజా వార్తలు

Telangana Road Accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన బైక్, ముగ్గురు స్పాట్‌లోనే మృతి

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం సమీపంలోని రామ గోవిందాపురం గ్రామం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, యువతి పక్కన ఉండగా వృద్ధుడిలో లేచిన కామాంధుడు, ఆమె హెయిర్ తాకుతూ, వాసన పీలుస్తూ పైశాచికానందం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బిసౌలీలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో స్థానికంగా ఉన్న ఓ దుకాణం దగ్గర ఓ యువతి వృద్ధుడి పక్కనే నిలబడి తెలిసినవారితో మాట్లాడుతోంది. పెద్ద మనిషి ఆమెకు దగ్గరగా వెళ్లి వెంట్రుకలను తాకే ప్రయత్నం చేశాడు.

Road Accident Video: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసి బస్సు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. భాకరాపేట ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో కర్ణాటక ఆర్టీసి బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.

YS Jagan Praja Darbar: వైఎస్ జగన్ ప్రజాదర్బార్ వీడియోలు ఇవిగో, ఇంకా ఏ మాత్రం తగ్గని క్రేజ్, అధినేతను కలవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు

Hazarath Reddy

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ ను నేడు విశాఖపట్నంకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలోని ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. వైజాగ్ వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు నేడు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

Telangana Cabinet Meeting: తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ, జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Telangana Road Accident: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం, పోలీసుల స్పందన భేష్, స్థానికుల హర్షం

Arun Charagonda

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో బీర్ల సీసాలు, ఉల్లిగడ్డలు చెల్లాచెదురుగా పడ్డాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. పోలీసులు రోడ్డును శుభ్రం చేసి వేగంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. వారు వ్యవహరించిన తీరు పట్ల వాహనదారులు ప్రశంసలు కురిపించారు.

Telangana Weather Forecast: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకి కూడా వానల అలర్ట్

Hazarath Reddy

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని బులిటెన్‌లో పేర్కొంది.

Ponnam Prabhakar: వీడియో ఇదిగో, అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అసభ్య సైగ‌లు, ముసిముసి నవ్వులు నవ్విన రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్

Hazarath Reddy

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండ‌గా.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అసభ్య సైగలు చేయడం కెమెరాకు చిక్కింది. ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్‌కు మంత్రి ప్రొన్నం ప్ర‌భాక‌ర్ బూతు సైగ‌లు చేశారు. పొన్నం ప్ర‌భాక‌ర్ బూతుల‌తో కూడిన సైగ‌లు చేయ‌గా రాజ‌గోపాల్ రెడ్డి, గ‌డ్డం వివేక్ ప‌డి ప‌డి న‌వ్వారు.

Advertisement

Andhra Pradesh Shocker: ప్రకాశం జిల్లాలో దారుణం, బాలికల హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో మృతశిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని, చివరిదాకా కనుక్కోలేకపోయిన టీచర్లు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ప్రభుత్వ బాలికల హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని మృత శిశువుకు జన్మనిచ్చింది. కాగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గత రెండు నెలలుగా హాస్టల్‌లోనే ఉంటోంది.

BSNL 5G Service: గుడ్ న్యూస్.. త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 5G సర్వీసులు, ఏఏ నగరాల్లో తెలుసా?

Arun Charagonda

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వినియోగదారులకు తక్కువ ధరలోనే 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ... బీఎస్‌ఎన్‌ఎల్‌తో దేశీయ టెలికాం స్టార్టప్ కంపెనీ చర్చలు జరుపుతోంది.

YS Jagan Praja Darbar: కార్యకర్తల కోసం తెరుచుకున్న వైఎస్ జగన్‌ బంగ్లా తలుపులు, ప్రజాదర్బార్ పేరిట ప్రజలతో మమేకమవుతున్న మాజీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తాడేపల్లిలోని వైఎస్ జగన్‌ బంగ్లా తలుపులు బుధవారం పార్టీ కార్యకర్తలు, ప్రజల కోసం తెరుచుకున్నాయి.తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్‌లో బుధవారం కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. ఎవరూ అధైర్యపడవద్దు.. అన్ని విషయాల్లో చివరి వరకు అండగా ఉంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు.

HC on Wife's Racist Remarks on Husband: భర్త న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భార్య వేధించ‌డం క్రూర‌త్వ‌మే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు

Hazarath Reddy

భ‌ర్త‌ న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భార్య వేధించడం క్రూర‌త్వం అవుతుంద‌ని క‌ర్నాట‌క హైకోర్టు తెలిపింది. లేనిపోని కార‌ణాల‌తో భ‌ర్త‌ను దూరంపెట్టిన‌ భార్య వైఖ‌రిని కర్ణాటక హైకోర్టు త‌ప్పుప‌ట్టింది.

Advertisement

Health Tips: నిద్రలేమి సమస్యా అయితే మీకు క్యాన్సర్ ముప్పు,అంతేగాదు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ!

Arun Charagonda

కారణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా వివిధ రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే కొన్ని వంశపార పర్యంగా వచ్చే వ్యాధులైతే మరికొన్ని మాత్రం ఏరికోరి తెచ్చుకునేవి. ఇందులో ప్రధానంగా నిద్రలేమి సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఇది రుగ్మతగా మారింది. పగటి నిద్రపోవడం,మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణమేదైనా అనేక రకాల సమస్యలకు దారి తీస్తోంది నిద్రలేమి సమస్య.

Telangana: బుజ్జగింపులు.. పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే ఇంటికి జూపల్లి, ఆసక్తికరంగా రాజకీయాలు, ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటారా?

Arun Charagonda

తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని తిరిగి సొంతగూటికి చేరుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. బుజ్జగింపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాగా , బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

Tamil Nadu: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి వంతెన కింద నిద్రపోయిన మందుబాబు, ఒక్కసారిగా పైనుంచి గేట్లు ఎత్తేయడంతో నీటి ప్రవాహంలో చిక్కుకుని..

Hazarath Reddy

తమిళనాడులో తిరుచ్చిలోని కొల్లిడం వంతెన కింద ఓ వ్యక్తి పుల్లుగా తాగి నిద్రపోయాడు.నిద్ర లేచి చూసే సరికి తను నీటి ప్రవాహంలో చిక్కుకుపోయాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత, రిజర్వాయర్‌కు క్రమంగా పెరుగుతున్న వరదప్రవాహం

Hazarath Reddy

శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతోంది.

Advertisement

Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, యువతిని దారుణంగా కొట్టిన బంధువులు, స్థల వివాదంలో ముదిరిన గొడవే కారణం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఓ మహిళపై దారుణంగా దాడి చేయబడ్డ దృశ్యాలు ఆగష్టు 1న వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించి ఆందోళనకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. స్థల వివాదంలో తొలగింపు సమస్యపై ఇద్దరు సోదరుల మధ్య హింస చెలరేగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Wayanad landslides: వయనాడ్‌లో తాత్కాలిక బ్రిడ్జి నిర్మించిన ఇండియన్ ఆర్మీ, కొనసాగుతున్న సహాయక చర్యలు..వీడియో

Arun Charagonda

భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది. వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం సంభవించింది. ఇక కొండచరియల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వయనాడ్‌లో తాత్కాలిక బ్రిడ్జి నిర్మించింది ఇండియన్ ఆర్మీ.

Mohammed Deif Dead: హమాస్‌కు మరో షాక్, మాస్టర్‌మైండ్ ‘డెయిఫ్‌’ ను హతమార్చిన ఇజ్రాయెల్ బలగాలు, గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం సూత్రధారి ఇతడే..

Hazarath Reddy

ఇజ్రాయెల్‌పై గతేడాది అక్టోబరు 7 నాటి మెరుపుదాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్‌ సైనిక విభాగాధిపతి (Military wing) మహమ్మద్‌ డెయిఫ్‌ (Mohammed Deif)ను అంతమొందించినట్లు టెల్ అవీవ్‌ ప్రకటించింది. గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో జులై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైన విషయాన్ని నిర్ధారించింది.

Telangana Assembly Session: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారిందని మండిపాటు, సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు

Arun Charagonda

బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.

Advertisement
Advertisement