తాజా వార్తలు

Andhra Pradesh: సూపర్‌ సిక్స్‌ అమలుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాకే పథకాలు అమలు చేస్తామని వెల్లడి, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన

Hazarath Reddy

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్‌ ఇచ్చిన రిపోర్టుపై (Niti Aayog Report) చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని అన్నారు.

Kishan Reddy Met Balakrishna: బాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డుకు భాలయ్య పూర్తిగా అర్హులంటూ అల్లు అర్జున్ ట్వీట్

Hazarath Reddy

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిసి, పద్మభూషణ్ అవార్డును అందుకున్నందుకు అభినందించారు. ఇక నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పద్మభూషణ్ అవార్డుకు పూర్తిగా అర్హులంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

TGSRTC JAC Issue Strike Notice : 21 డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ, లేకుంటే సమ్మె సైరన్‌ మోగిస్తామని హెచ్చరికలు

Hazarath Reddy

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ (TRC JAC) సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులపై ఉండటంతో బస్‌భవన్‌ లోపల ఈడీ మునిశేఖర్‌కు కార్మిక సంఘాలు సోమవారం నాడు నోటీసు (TGSRTC Strike Notice) ఇచ్చారు. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు (TGSRTC JAC issue strike notice) అందజేశాయి.

Bihar: వీడియో ఇదిగో, రిపబ్లిక్ డే రోజున పుల్లుగా తాగి స్కూలు వచ్చిన హెడ్ మాస్టర్, మనుగడకు మద్యపానం అవసరమని సెటైర్, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ముజఫర్‌పూర్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం తాగి పాఠశాలకు చేరుకున్న హెడ్ మాస్టర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఈ షాకింగ్ సంఘటనలో, బీహార్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం ఉన్నప్పటికీ మద్యం తాగి దొరికిపోయాడు.

Advertisement

Couple Romances on Bike: బైక్‌పై జంట రొమాన్స్ వీడియో ఇదిగో, ట్యాంకర్ మీద ప్రియురాలు కూర్చుంటే బైక్ నడుపుతూ ముద్దులు పెట్టిన ప్రియుడు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ జంట హైస్పీడ్ బైక్‌పై రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ట్రాఫిక్ భద్రత, ప్రజల గౌరవ మర్యాదలపై ఆందోళనలు రేకెత్తించింది. జనవరి 27న వెలువడిన ఫుటేజీలో, ఆ మహిళ బైక్ ట్యాంక్‌పై కూర్చొని ప్రియుడుతో ముద్దుల్లో మునిగితేలింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో మహిళను జుట్టు పట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తోటి దుకాణదారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన

Hazarath Reddy

విశాఖ జిల్లా మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై కిరాతకంగా ప్రవర్తించారు తోటి దుకాణదారులు.టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో వెలుగులోకి వచ్చింది.

CM Revanth Reddy Slams PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీని గజనీ మహమూద్‌తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని గెలిపించాలని వినతి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముహమ్మద్ ఘజినీతో పోల్చారు. అలాగే బీజేపీని "బ్రిటిష్ జనతా పార్టీ" అని అభివర్ణించారు.మహౌలో జరిగిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ'లో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Telangana: తెలంగాణలో అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలు అమలు, రైతుభరోసా కింద తొలి విడతగా రూ. 6 వేలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు

Hazarath Reddy

నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్దిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు

Advertisement

Astrology: ఫిబ్రవరి 12వ తేదీన కుంభ సంక్రాంతి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం..

sajaya

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలన్నిటికీ కూడా రాజు ఫిబ్రవరి 12వ తేదీన కుంభ సంక్రాంతి ఏర్పడనుంది. సూర్యుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్తారు.

Astrology: ఫిబ్రవరి 8న చంద్రగ్రహణం వృషభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి లక్ష్మి దేవి దయతో అఖండ ఐశ్వర్యం.

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారంచంద్ర గ్రహణానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 11 గంటల 20 నిమిషాలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది.

Astrology: ఫిబ్రవరి 4వ తేదీ గురుగ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.

sajaya

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఆనందాలను, ఐశ్వర్యాలను, భావోద్వేగాలను ఇచ్చేదిగా ఉంటుంది. గురు గ్రహం ఫిబ్రవరి 4వతేదీన ఉదయం 8 గంటల 15 నిమిషాలకు తన రాశిని మార్చుకుంటుంది.

Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు టీ తాగొచ్చా లేదా..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో బీపీ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. ఈ సమస్య యువతలో పిల్లల్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. బీపీని కంట్రోల్ చేసుకోకపోతే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

Advertisement

Pune: వీడియో ఇదిగో, 100 ఉద్యోగాల వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వేల సంఖ్యలో బారులు తీరిన ఇంజనీర్లు, పుణెలోని ఐటీ కంపెనీ వెలుపల ఘటన

Hazarath Reddy

పుణెలోని మగర్‌పట్టాలోని ఒక ఐటీ కంపెనీ వెలుపల 3,000 మంది ఇంజనీర్లు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వరుసలో నిల్చున్నట్లు ఒక వైరల్ వీడియో ప్రదర్శించింది, ఇది భారతదేశ ఉద్యోగ మార్కెట్ యొక్క పోటీ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కేవలం 100 జూనియర్ డెవలపర్ స్థానాలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో సాలిడ్ అప్‌డేట్, బాబీ డియోల్ పుట్టిన‌రోజు సందర్భంగా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌

Hazarath Reddy

పవన్ కల్యాణ్‌ హీరోగా జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'హరిహర వీరమల్లు'. ప్ర‌స్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ కోసం ప‌వ‌న్‌ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్‌ ఇప్ప‌టికే ప్రకటించారు

Health Tips: పెరుగుతో కలిపి ఈ ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకండి . తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి..

sajaya

Health Tips: పెరుగు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా చలవ చేయడానికి శరీరంలో జీర్ణ వ్యవస్థకు సహాయపడడానికి. పెరుగు చాలా సహాయపడుతుంది.

Health Tips: బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారా, అవిస గింజలతో పరిష్కారం..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం అనేది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది.

Advertisement

Amit Shah Takes Holy Dip at Triveni Sangam: వీడియోలు ఇవిగో, త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన హోమంత్రి అమిత్ షా, మహాకుంభమేళాలో ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు

Hazarath Reddy

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

Hazarath Reddy

ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది.అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Telangana: వీడియో ఇదిగో, గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి కిరీటం, శఠగోపం ఎత్తుకెళ్లిన దొంగలు, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో ఘటన

Hazarath Reddy

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.రాత్రి సమయంలో ఆలయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం,శఠగోపాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది.

Warangal Road Accident: వీడియో ఇదిగో, మద్యం మత్తులో లారీ డ్రైవర్, ఇనుప స్తంభాల కింద చితికిపోయిన వలస కార్మికుల మృతదేహాలు, వరంగల్‌-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుమందికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.

Advertisement
Advertisement