India

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం, నలుగురికి తీవ్ర గాయాలు...వీడియో

Arun Charagonda

జమ్మూకశ్మీర్‌లోని కథువాలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో నలుగురికి గాయాలు అయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

Mohammed Siraj: వీడియోలు ఇవిగో, మహమ్మద్ సిరాజ్ పగ బడితే ఇలానే ఉంటుంది, రెచ్చగొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూడండి

Hazarath Reddy

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను రెచ్చగొట్టిన ఇద్దరు బ్యాటర్లపై అతడు రివేంజ్ తీర్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను గెలికిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌లను పెవిలియన్ పంపాడు. మొదట షార్ట్ బాల్‌తో హెడ్‌ను దొరకబుచ్చుకున్న సిరాజ్ ఆ తర్వాత మరో చక్కటి బంతితో స్మిత్‌ ను బోల్తా కొట్టించాడు.

Jasprit Bumrah Wicket Video: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ వీడియో ఇదిగో, ఇదేం ఇన్‌స్వింగర్ బాబోయ్ అంటూ బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్ ఖువాజా

Hazarath Reddy

భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా బ్యాటర్ ఖవాజా వికెట్ తీసిన విధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుమ్రా వేసిన ఆ చక్కటి డెలివరీని స్ట్రయిట్ బౌండరీకి పంపించాలని ఖవాజా భావించాడు.

Ravi Ashwin Retires: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, టెస్టు కెరీర్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా రికార్డు

Hazarath Reddy

టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికారు. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జ‌రిగిన మూడ‌వ టెస్టు చివ‌రి రోజు అశ్విన్ త‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించేశాడు.

Advertisement

Telangana: ఇలాంటి దొంగను జన్మలో చూసుండరు ..నీళ్ల బిందెలను ఎత్తుకెళ్లిన దొంగ...సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

దొంగలంటే బంగారం, డబ్బు దోచుకుంటారు కానీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఎందుకంటే ఇద్దరు చిల్లర దొంగలు నీళ్ల బిందెలను ఎత్తుకెళ్లిన ఘటన సీసీ కెమెరాకు చిక్కింది. అర్థరాత్రి ఓ ఇంట్లో దూరి నీళ్ల బిందెలు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటుండగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Air India Retires Boeing 747: వీడియో ఇదిగో, చరిత్ర పుటల్లోకి బోయింగ్ 747 విమానాలు, ముంబై నుంచి వెళ్లే ముందు వింగ్ వేవ్ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆఖరి విమానం

Hazarath Reddy

ఎయిర్ ఇండియా తన మిగిలిన నాలుగు బోయింగ్ 747 విమానాలను విరమించుకుంది. ఈ నేపథ్యంలో ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో నివసిస్తున్న ముంబై వాసులు ఈ సంవత్సరం చాలా అరుదైన దృశ్యం ఒకటి చూశారు. ఎయిరిండియా రంగులతో కూడిన భారీ బోయింగ్ 747 టేకాఫ్ అయింది,

IND vs AUS: డ్రాగా ముగిసిన మూడో టెస్టు, భారత్ ముందు 275 టార్గెట్...వర్షంతో మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు

Arun Charagonda

ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ ముందు 275 పరుగుల టార్గెట్‌ను విధించింది ఆస్ట్రేలియా. దీంతో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేయగా టీబ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు అంపైర్లు. 5 టెస్టుల సిరీస్‌ 1-1తో స‌మంగా ఉంది. ఇండియా 260 ర‌న్స్‌కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 89 ర‌న్స్‌కే 7 వికెట్లు కొల్పోయి డిక్లేర్ చేసింది.

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ఆటో డ్రైవర్ల సమస్యపై చర్చించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందించేందుకు పాలకులు కమీషన్లు దండుకుంటున్నారని వివేకానంద చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

MLC Kavitha: మూసీ సుందరీకరణపై ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్దాలే, డీపీఆర్ రెడీ కాకముందే అప్పు కావాలని ప్రపంచబ్యాంకును కోరిన ప్రభుత్వం...ఎమ్మెల్సీ కవిత ఫైర్

Arun Charagonda

మూసీ భాగోతం ఆధారాలతో బైట పెట్టారు ఎమ్మెల్సీ కవిత. మూసీ సుందరీకరణ కోసం DPR రెడీ కాకముందే రూ.4,100 కోట్లు అప్పు కావాలని వరల్డ్ బ్యాంకును అడిగారని తెలిపారేఉ. మూసీ సుందరీకరణ కోసం వరల్డ్ బ్యాంకును అప్పు అడిగిన తేదీ - 19/09/2024 కాగా మూసీ DPR కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తేదీ - 4/10/2024 అన్నారు. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుపై చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు.

Telangana Assembly: ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దు..అండగా ఉంటామని భరోసా

Arun Charagonda

ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము..అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉంది.

Viral Video: శిశువుకి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్.. చలనం లేకుండా పుట్టిన శిశువుకి సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన వైద్యుడు...వీడియో ఇదిగో

Arun Charagonda

ఎలాంటి చలనం లేకుండా పుట్టిన ఓ శిశువుకి ఓ వైద్యుడు సీపీఆర్ చేసి బతికించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఎలాంటి కంగారు పడకుండా బిడ్డను కాపాడేందుకు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఆ డాక్టర్‌పై మాత్రం నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Arun Charagonda

రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (#SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.

Advertisement

Telangana: రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడు, కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ - ఘట్‌కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద ఓ యువకుడు రూ.20 వేలు రోడ్డు పక్కన విసిరేసి, వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్‌గా మారి

Uttarakhand: వైరల్‌ వీడియో...రోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న యువతులు, ఉత్తరాఖండ్‌లో ఘటన, సోషల్ మీడియా ట్రెండింగ్‌లో వీడియో

Arun Charagonda

ఉత్తరాఖండ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఇద్దరు యువతులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. యువతుల ఫైట్‌ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియాల్సి ఉంది.

Viral Video: వయనాడ్ విధ్వంసం...కోతి తన పిల్లను ఎలా కాపాడుకుందో చూడండి...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కేరళలోని వయనాడ్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. వయనాడ్ విధ్వంసంతో కేరళ అతలాకుతలం అయింది. వయనాడ్ విధ్వంసం తరువాత.. ఒక కోతి తను కన్న కోతిపిల్లను కాపాడుతున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tulsi Gowda Passes Away: పద్మ శ్రీ తులసి గౌడ కన్నుమూత, లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీగా గుర్తింపు, పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన తులసిగౌడ

Arun Charagonda

లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటింది.

Advertisement

Hyderabad: బాచుపల్లిలో 6 అడుగుల పాము, ఓ ఇంట్లోకి ప్రవేశించగా స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చిన స్థానికులు..ఎలా పట్టుకున్నాడో చూడండి

Arun Charagonda

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఓ భారీ పాము కలకలం రేపింది. బాచుపల్లిలోని కేఆర్సీఆర్ కాలనీలో 6 అడుగుల ఓరియంటల్ ర్యాట్ స్నేక్ ఓ ఇంట్లోకి చొరబడింది. దీంతో భయాందోళన చెందిన కాలనీవాసులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ భారీ సర్పాన్ని బంధించి సురక్షిత ప్రదేశానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Hazarath Reddy

కీసరలోని మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల(సనత్‌నగర్, కూకట్‌పల్లి) పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను, ఖమ్మంలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థినిని ఎలుకలు కరిచాయి

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Hazarath Reddy

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం డిసెంబర్ 17న జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్‌ సర్టిఫికెట్స్‌ కోర్స్‌ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.

Reel Gone Wrong: వీడియో ఇదిగో, పవిత్రమైన హరిద్వార్‌లో అశ్లీల కంటెంట్‌తో రీల్ వీడియో, 5 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హరిద్వార్ గంగా, రూర్కీ గంగానహర్ వంతెనలపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ, అశ్లీలమైన కంటెంట్‌ను సృష్టించిన వీడియో వైరల్ కావడంతో ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో కూడిన ఈ గ్రూప్, సోషల్ మీడియాలో 528K ఫాలోవర్లను సంపాదించిన అనుచితమైన కంటెంట్, ప్రమాదకర చర్యలతో కూడిన రీల్స్‌ను తయారు చేసింది

Advertisement
Advertisement