India

YouTuber Arrest: ఉడుమును చంపి వండుకుని తిన్న వీడియోని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్, పోలీసులకు ఫిర్యాదు చేసిన యానిమల్ పరిరక్షణ సభ్యుల కంప్లైంట్

Hazarath Reddy

లైక్‌ల కోసం ఉడుమును వండిన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. యానిమల్ ఆక్ట్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు. మన్యం పార్వతీపురం మండలంలో ఉడుమును వండుకుని, తిని ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన యూట్యూబర్లు చీమల నాగేశ్వరరావు, నాని బాబు

Telangana: ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం, ఫుడ్ సేఫ్టిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.. కమిటీ సభ్యులు తిన్నాకే పిల్లలకు ఆహారం పెట్టాలని ఆదేశం

Arun Charagonda

తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్, గురుకులాలు, అంగన్ వాడీ కేంద్రాలు, హాస్పటల్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రిన్సిపాల్ / వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసింది.

SC On Extramarital Affair: ఇద్దర మధ్య అంగీకారంతో జరిగే శృంగారాన్ని రేప్‌గా పరిగణించలేం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

వివాహ వాగ్దానంపై ఏకాభిప్రాయంతో వివాహేతర సంబంధానికి సంబంధించిన లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహేశ్ దాము ఖరేపై వనితా ఎస్ జాదవ్ దాఖలు చేసిన ఏడేళ్ల నాటి అత్యాచార ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

MLC Jeevan Reddy: గురుకుల సిబ్బందిపై ఎమ్మెల్సీ జీవన్‌ ఫైర్..అల్లీపూర్ గురుకులాన్ని తనిఖీ చేసిన జీవన్‌ రెడ్డి..నాసిరకం భోజనం పెడతారా అని సిబ్బందిపై మండిపాటు

Arun Charagonda

గురుకుల సిబ్బందికి చివాట్లు పెట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జీవన్ రెడ్డి. ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు. పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టం అని ప్రశ్నించారు.అన్నం ఉడకలేదు... నీళ్ల పప్పు, నీళ్ల చారు పిల్లలకు ఎందుకు వడ్డిస్తున్నారు? అని మండిపడ్డారు. మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా, నెలలో ఒకే రోజు నాన్ వెజ్ పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

CM Revanth Reddy: సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేయాలని సూచించిన తెలంగాణ సీఎం

Arun Charagonda

యావత్ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు.

Konidela Klinkaara: రామ్‌చరణ్ - ఉపాసన ముద్దుల కుమార్తె క్లీంకార వీడియో వైరల్, బుడిబుడి అడుగులేసిన మెగా డాటర్

Arun Charagonda

రామ్‌ చరణ్.. ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకారకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో క్లీంకార నడవటం మనం చూడొచ్చు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్.. తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ వచ్చే ఏడాది 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hyderabad: వామ్మో..చికెన్ కబాబ్‌లో ఎలుక మలం, లక్డికపూల్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు

Hazarath Reddy

లక్డికాపూల్‌లో ఆహార భద్రత దాడుల్లో ఎలుకల మలం, సజీవ బొద్దింకలు కనుగొనబడ్డాయి. ప్రసిద్ధ బడేమియా కబాబ్‌ కూడా నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడింది. పేలవమైన పరిశుభ్రత, భద్రతా ప్రమాణాల గురించి దిగ్భ్రాంతికరమైన వెల్లడిలో, ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ లక్డికాపూల్‌లోని మూడు ప్రముఖ తినుబండారాలపై దాడులు నిర్వహించింది

Andhra Pradesh: వీడియో ఇదిగో, డ్రోన్లతో పోలీసుల నిఘా పెట్టడంతో పరుగులు పెట్టిన జూదగాళ్లు, మందుబాబులపై నాలుగు కేసులు

Hazarath Reddy

అనంతపురం శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో కొనసాగిన డ్రోన్ల నిఘా... ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు. అనంతపురం వన్, ఫోర్త్ మరియు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిల్లోని శివారు కాలనీలు, పరిసర ప్రదేశాలలో ఆయా పోలీసులు ఈరోజు కూడా డ్రోన్లతో నిఘా పెట్టారు.

Advertisement

Cyclone Fengal: వీడియో ఇదిగో, ఫెంగల్‌ తుఫాను దెబ్బకు చూస్తుండగానే కుప్పకూలిన భవనం, తమిళనాడులో కల్లోలం రేపుతున్న సైక్లోన్

Hazarath Reddy

తమిళనాడులో ఫెంగల్‌ తుఫాను కల్లోలం రేపుతోంది. బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్‌ దెబ్బకు కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Stones Pelted at Vande Bharat: యూపీలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి, ధ్వంసమైన కిటికీ అద్దాలు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై మరో సారి రాళ్లు రువ్వారు. బుధవారం రైలు డెహ్రాడూన్ నుండి ఆనంద్ విహార్‌కు వస్తుండగా రైలు నంబర్ 22458పై రాళ్లు రువ్వడం గమనార్హం. రైలు మీరట్ నుండి మోడీనగర్‌కు వస్తుండగా స్టేషన్‌కు 5 కిలోమీటర్ల ముందు ఈ ఖచ్చితమైన సంఘటన నివేదించబడింది.

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ అనే నేను... చేతిలో రాజ్యాంగం.. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన ప్రియాంక

Arun Charagonda

వయనాడ్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు ప్రియాంక గాంధీ. తన చేతిలో చిన్న రాజ్యాంగం ప్రతిని పట్టుకొని.. రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ.. తనకు అప్పగించిన బాధ్యతల్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని అన్నారు. ఆ తర్వాత సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. దాంతో సభ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని తలపించేలా.. అదే లుక్‌లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది.

Cyclone Fengal: ఫెంగల్ తుఫాను ఎంత భయంకరంగా సుడులు తిరుగుతుందో చూడండి, Cyclone Fengal Live Tracker Map ఇదిగో..

Hazarath Reddy

హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

Advertisement

Cyclone Fengal: నెల్లూరు, తిరుపతి జిల్లాలను వణికిస్తున్న ఫెంగల్ తుఫాను, సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు.

Chennai School Holiday: చెన్నై వైపు దిశను మార్చుకున్న ఫెంగల్‌ తుఫాను, స్కూళ్లు, కాలేజీలు మూసివేత, సముద్రంలో 5 అడుగుల మేర ఎగసిపడుతున్న అలలు

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి ‘ఫెంగల్‌’ అని నామకరణం చేశారు

Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫాను ముప్పు, సహాయక చర్యల కోసం అప్రమత్తమైన భారత నౌకాదళం, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను వణికించనున్న సైక్లోన్

Hazarath Reddy

హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది

CM Revanth Reddy: వసతి గృహాల ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం, తప్పుడు ప్రచారం చేస్తే శిక్షిస్తామని హెచ్చరిక

Arun Charagonda

వ‌స‌తిగృహాల్లో త‌ర‌చూ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. పాఠ‌శాల‌లు, గురుకులాల‌ను త‌ర‌చూ త‌నిఖీ చేయాలి కలెక్టర్‌లను ఆదేశించారు. ఆదేశం. విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అంద‌జేయాలన్నారు.

Advertisement

Telangana: అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు..మహబూబాబాద్ బస్ డిపో సిబ్బందిపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం...వీడియో ఇదిగో

Arun Charagonda

అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బందిపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని ప్రశ్నించినవారిపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని ...ఈ రోజు డిపో ముట్టడికి పిలుపునిచ్చారు.

Andhra Pradesh: పలాసలోని షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం, రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌ కాలిపోవడంతో మంటలు వ్యాప్తి..రూ. 3 కోట్ల ఆస్తి నష్టం!

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా పలాసలోని జాస్మిన్ బట్టల షాపులో అగ్నిప్రమాదం జరిగింది. షాపు నుంచి దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో భయంతో పరుగులు తీశారు స్థానికులు. రిమోట్ కంట్రోల్ సిస్టం కాలిపోడంతో షట్టర్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది ఫైర్ సిబ్బంది. సుమారు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం.

Andhra Pradesh: మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ ఇంట్లో ఏసీబీ రైడ్స్, ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో దాడులు..

Arun Charagonda

వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌ మాజీ పీఏ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్‌ గతంలో ప్రభుత్వ పీఏగా పనిచేసిన మురళి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. మురళికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు నేపథ్యంలో ఈ దాడులు జరుపుతున్నారు.

Andhra Pradesh: నిద్రలేకుండా చేస్తున్న నాగుపాము...కొంతకాలంగా ఇళ్ల మధ్య సంచరిస్తున్న పాము..ఎట్టకేలకు పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్‌..వీడియో

Arun Charagonda

ఏపీలోని మహానంది మండలం తమ్మడపల్లెలో గ్రామస్తులకు నిద్రలేకుండా చేసింది నాగుపాము. కొంతకాలంగా ఇళ్ల మధ్య సంచరిస్తుండగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నిన్న అర్ధరాత్రి చాకచక్యంగా పామును బంధించారు స్నేక్ స్నాచర్ మోహన్. నాగుపాము పట్టుబడటంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్థులు.

Advertisement
Advertisement