India

Cyclone Dana Update: దానా తుపాన్ తీవ్రత తెలిపే వీడియోలు ఇవిగో, అల్లకల్లోలంగా సముద్రం, వణుకుతున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు

Hazarath Reddy

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దానా’ తుఫాన్ (Cyclone Dana)‌ వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ఇది నేటి అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

AI Chatbot: ఏఐ చాట్‌బాట్ తో ప్రేమలో టీనేజర్, డిప్రెషన్ తో ఆత్మహత్య, ఏఐ- గూగుల్‌పై దావా వేసిన టీనేజర్ తల్లి...వివరాలివిగో

Arun Charagonda

అమెరికాలోని ఫ్లోరిడాలో విషాదం చోటు చేసుకుంది. ఏఐ చాట్‌బాట్ కారణంగా ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ టీనేజర్ తల్లి. Character.AI చాట్‌బాట్ తన కుమారుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, Character.AI మరియు Googleకి వ్యతిరేకంగా దావా వేసింది.

Mahabubabad: తహసిల్దార్‌పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా, అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నందుకు బూతు మాటలు తిట్టిన వైనం, పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసిల్దార్

Arun Charagonda

తహసిల్దార్ పై బూతులతో రెచ్చిపోయింది ఇసుక మాఫియా. మహబూబాబాద్ - నెల్లికుదురు మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు తహసిల్దార్ రాజు. దీంతో తహసిల్దార్ పై బూతులతో రెచ్చిపోయారు ఇసుక ట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తులు. తనను అడ్డుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసిల్దార్.

KTR: కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన కేటీఆర్, డిచ్‌పల్లి బెటాలియన్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సమస్యను పరిష్కరించాలని వినతి

Arun Charagonda

డిచ్ పల్లి బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా వారి సమస్యను విన్నారు కేటీఆర్. అనంతరం బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు కేటీఆర్. సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు.

Advertisement

Andhra Pradesh: ఒంగోలు బస్టాండ్‌లో దారుణం, ఓ మహిళను కర్రతో చితకబాదిన వ్యక్తి, అందరు చూస్తుండగానే ఘటన...షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఒంగోలు లో దారుణం చోటు చేసుకుంది. ఒంగోలు బస్టాండ్‌లో మహిళను కర్రతో చావబాదాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే మహిళను చితక బాది, దుర్బాషాలాడుతు జుట్టుపట్టి లాగిపడేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Congress MLA Adluri Laxman: గంజాయి మత్తులో మర్డర్లు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో విలువ లేకుండాపోయిందన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, బూతులతో ఫైర్ అయిన ఎమ్మెల్యే..వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల కాంగ్రెస్ నేత హత్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్. గంజాయి తాగి మత్తులో మర్డర్లు చేస్తున్నారని బూతులతో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో నాకు ఏం విలువ లేదు.. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని అయినా ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ పక్కన కూడా తిరగలేదు.. సీఎం రేవంత్ రెడ్డికి, సంజయ్ గురించి ఫిర్యాదు చేశానని చెప్పారు.

Tummala Nageshwarrao: రెండోరోజు మలేషియాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన, పామాయిల్ రిఫైనరీ ప్లాంట్‌ను పరిశీలించనున్న తుమ్మల

Arun Charagonda

రెండో రోజు మలేషియాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సాగుతోంది. పహాంగ్ రాష్ట్రం జెరంటుట్ లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ .. అర్.అండ్ ఢీ సెంటర్ పరిశీలించనుంది మంత్రి తుమ్మల బృందం. కుయంటన్ పోర్ట్ లో పామాయిల్ రిఫైనరీ ప్లాంట్ పరిశీలించనున్నారు. తెలంగాణ లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ అధ్యయనం కోసం వ్యవసాయ హార్టికల్చర్ అధికారులతో కలసి మంత్రి తుమ్మల పర్యటన సాగుతోంది.

MAMI Film Festival 2024: ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా , ఐదు రోజుల పాటు కన్నుల పండువగా మామి ఫిల్మ్ ఫెస్టివల్

Arun Charagonda

MAMI (ముంబయి అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్) ఫిల్మ్ ఫెస్టివల్ కన్నుల పండువగా జరిగింది. ఐదు రోజుల పాటు సినీప్రియులను అలరించిన మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో 45 దేశాల చిత్రాలను ప్రదర్శించారు. ఇక మంగళవారం బాలీవుడ్ జంట అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా, ప్రముఖ నటుడు డింపుల్ కపాడియా చిత్రం గో నోని గో ప్రీమియర్‌లో స్టైలిష్‌గా కనిపించారు.

Advertisement

Telangana: కుక్కల దాడిలో 35 మేకల మృతి...రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఘటన, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడి ఆవేదన

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకరయ్య అనే వ్యక్తి 35 చిన్న మేక పిల్లలను 5 పెద్ద మేకలను మేకల దొడ్డిలో వదిలేసి మిగతా మేకలను మేపడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో 12 కుక్కలు మేకల దొడ్డిలో చొరబడి 30 మేక పిల్లలను 5 మేకలను కరిచి చంపేశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితుడు.

Andhra Pradesh: ట్రాన్స్‌ఫార్మర్ పక్కన పార్కింగ్...చెలరేగిన మంటలు, దగ్దమైన మూడు బస్సులు...వీడియో ఇదిగో

Arun Charagonda

విజయనగరంలో జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పక్కన పార్కింగ్ చేయగా కాలి బూడిదయ్యాయి బస్సులు. విజయనగరం రాజీవ్ స్టేడియం వద్ద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు పడటంతో మూడు బస్సులు దగ్దమయ్యాయి.

Ponnam Prabhakar: బీజేపీది అవకాశవాద రాజకీయం, నిరసనల పేరుతో ముసలి కన్నీరు కారుస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మూసి పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి

Arun Charagonda

బీజేపీ మూసి సందర్శనకు పోయింది..ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి , పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా..మూసి ప్రజలకు సంబంధించిన సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వండి.. వారికి జరగాల్సిన న్యాయం గురించి చెప్పాలన్నారు.

Cyclone Dana Live Updates: తీవ్ర తుఫాన్‌గా బలపడిన దానా, తీరం దాటే సమయంలో 120 కిమీ వేగంతో ఈదురు గాలులు, 200 రైళ్లు రద్దు, 10 లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు

Arun Charagonda

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా బలపడింది దానా. వాయవ్య బంగాళాఖాతంలోకి ఏర్పడగా ఒడిశా, బెంగాల్‌ తీరాలకు అలర్ట్ జారీ చేశారు. 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోంది దానా. పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో.. సాగర్‌ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.

Advertisement

ED Questions Amoy Kumar: ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ, ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షం...భూదాన్ భూముల బదిలీపై విచారణ

Arun Charagonda

ఈడీ కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు అమోయి కుమర్ ని విచారించింది ఈడి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీపై విచారించగా వందల కోట్ల విలువైన 42 ఎకరాలు అక్రమంగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి.

RS Praveen Kumar: భార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేస్తారా?, ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా..సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను డ్యూటీలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

Arun Charagonda

భార్యలు ఆందోళన చేస్తే కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్‌పీ. ఇది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు.. కానిస్టేబుల్ భార్యలు వాళ్ళ బాధలు చెప్పుకోడానికి శాంతియుతంగా నిరసన తెలిపుతుంటే అరుగురు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు. వాళ్లను అర్జెంటుగా డ్యూటీలోకి తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

Ponguleti Srinivas Reddy: దీపావళి ముందే పొలిటికల్ బాంబ్...ఫోన్‌ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో కీలక నేతలపై చర్యలు, సంచలన కామెంట్స్ చేసిన మంత్రి పొంగులేటి

Arun Charagonda

దక్షిణకొరియాలోని సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అని తెలిపారు. ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.. సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధమయ్యాయిన్నారు. కక్ష సాధింపు కోసం కాదు, సాక్ష్యాధారాలతోనే చర్యలు ఉంటాయని తెలిపారు పొంగులేటి. ఫోన్‌ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Ankara Terror Attack: వీడియో ఇదిగో, టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి, ముగ్గురు మృతి, వందలాది మందికి తీవ్ర గాయాలు

Vikas M

టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి చెందారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని సమాచారం. అంకారాలోని తుర్కియే ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీ టుసాస్‌ ఆవరణలో ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే, దాడికి తామే కారణమని ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు.

Advertisement

Bulandshahr Shocker: వీడియో ఇదిగో, మురికి కాలువలో ఆపిల్ పండ్లు కడిగి అమ్మిన వ్యాపారి

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మురుగు కాలువలో నుంచి ప్రవహిస్తున్న నీటితో పండ్లను కడుగుతున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పండ్ల విక్రేత ఆపిల్‌లను తాజాగా మరియు నిగనిగలాడేలా ఉంచడానికి మురుగు కాలువలో కడగడం వీడియోలో చూపబడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Raja Saab New Poster: బాబోయ్ ప్రభాస్ మునుపెన్నడూ లేని లుక్‌లో ఇరగదీస్తున్నాడుగా, రాజసం ఉట్టి పడే రాయల్‌ లుక్‌లో రాజాసాబ్‌ స్టిల్ నెట్టింట ట్రెండింగ్

Vikas M

రెబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు కానుక రానే వచ్చింది.సింహాసనం ఖాళీగా లేదు. సింహానం తనకు చెందిన వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది.. అంటూ రాజసం ఉట్టిపడేలా తలకిందులుగా ఉన్న సింహాసనం ఫొటోను మేకర్స్‌ ఇప్పటికే షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా బర్త్‌ డే ట్రీట్‌ ఇస్తూ రాజాసాబ్‌ పోస్టర్‌ విడుదల చేశారు.

Amaran Trailer Out: శివ కార్తికేయన్‌, సాయిపల్లవి అమరన్‌ ట్రైలర్ ఇదిగో, ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాధారంగా తెరకెక్కిన సినిమా

Vikas M

శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి రూపొందించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌, విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన రిషబ్ పంత్, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్

Vikas M

తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్టార్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని దాటేశాడు పంతం. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

Advertisement
Advertisement