India

Zimbabwe Smash World Record: 20 ఓవర్లలో 344 పరుగులు, టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జింబాంబ్వే, అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కెప్టెన్ సికిందర్ రజా రికార్డు

Vikas M

టీ20 క్రికెట్‌లో జింబాబ్వే (Zimbabwe) ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది.

Vangalapudi Anitha on Jagan: వారానికి 3 రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు, జగన్ పై హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వారానికి 3 రోజులు ఏపీకి వచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు. టైంపాస్ రాజకీయాల కోసం ఏపీకి వచ్చి అసత్యాలు చెబుతున్నారు. గతంలో సీఎం అని చెప్పుకుని కోర్టు వాయిదాలు ఎగ్గొట్టారు. ఇప్పుడు రాజకీయ సమావేశాలను సాకుగా చూపుతున్నారు. ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసి నీతి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

PM Modi Russia Tour: ముగిసిన ప్ర‌ధాని మోదీ ర‌ష్యా టూర్, చైనా అధ్య‌క్షుడితో భేటీ.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు కీల‌క ప‌రిణామాలు

VNS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండు రోజుల రష్యా పర్యటన ముగిసింది. 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో (BRICS Summit) పాల్గొన్న ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సహా పలువురు దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఉజ్బెకిస్థాన్‌, యూఏఈ అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. మోదీ రష్యా పర్యటన విజయవంతంగా కొనసాగిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

Cyclone Danas Effect on Puri Jagannath Temple: పూరీ జ‌గ‌న్నాథుడిపై దానా తుఫాన్ ఎఫెక్ట్, ఎలాంటి న‌ష్టం జ‌రుగ‌కుండా ముందు జాగ్ర‌త్త‌గా ఆల‌యం మూసివేత‌, కోణార్క్ సూర్య దేవాల‌యం కూడా క్లోజ్

VNS

పూరీ జగన్నాథ్ ఆలయ సందర్శనపై దానా తుఫాన్ (Cyclone Danas Effect) ఎపెక్ట్ పడింది. తుఫాన్ కారణంగా పూరీకి భక్తులు ఎవరూ రావొద్దని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పూరీ నుంచి భక్తులను ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పూరీలోని బ్లూఫాగ్ బీచ్ తో పాటు ఇతర బీచ్ లన్నీ మూసివేశారు.

Advertisement

Zimbabwe Register Highest T20I Score: టీ 20ల్లో జింబాబ్వే వ‌ర‌ల్డ్ రికార్డ్, ఏకంగా 344 ర‌న్స్ చేసి సరికొత రికార్డు నెల‌కొల్పిన జింబాబ్వే

VNS

టీ20 క్రికెట్‌లో జింబాబ్వే (Zimbabwe) ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (133*; 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్స్‌లు) వీర విహారం చేశాడు

AP Cabinet Meeting Highlights: ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోవడం కుదరదు, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ ఇవ్వాలని నిర్ణయం, ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వినియోగదారులు నగదు చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు.

Pushpa 2 Grand National Press Meet: పుష్ప ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్, రేపు మెగా ప్రెస్ మీట్ పెడుతున్న చిత్ర యూనిట్, ఎందుకు అనేది మాత్రం స‌స్పెన్స్

VNS

మ‌రో 46 రోజుల్లో దేశ‌వ్యాప్తంగా ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule) కౌంట్‌డౌన్ షురూ కానున్న విష‌యం తెలిసిందే. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్‌’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.

APPSC New Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్‏గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధ, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

చంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీ ఛైర్మన్‏ను బుధవారం నియమించింది. మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో అనురాధను నియమిస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు

Advertisement

MVA Seat-Sharing Formula: మ‌హావికాస్ కూట‌మి మ‌ధ్య కొలిక్కివ‌చ్చిన సీట్ల పంప‌కాలు, 65 స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన ఉద్ద‌వ్ థాక్రే శివ‌సేన‌

VNS

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన ఉద్ధవ్‌ వర్గం 65 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే కుమారుడు ఆధిత్య ఠాక్రే తనయుడు, మాజీ మంత్రి ఆదిత్య థాకరే వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మహిమ్‌ నుంచి మహేశ్ సావంత్‌, థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజన్‌ విచారేను బరిలోకి దింపనున్నట్లు ఉద్ధవ్‌ వర్గం ప్రకటించింది.

Astrology: అక్టోబర్ 27న కుజ గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం..దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డబ్బు అందం ఆకర్షణ ,విలాస వంతలకు ఈ గ్రహం ప్రభావితం చేస్తుంది.

Tamil Nadu: స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన ఆవు, ఈ ప్రమాదంలో తప్పెవరిదో మీరే చెప్పండి, తమిళనాడులో షాకింగ్ ఘటన

Hazarath Reddy

తమిళనాడులోని తిరునల్వేలిలో స్కూటీపై వెళ్తున్న యువతిని ఆవు ఢీ కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. పశువులు కనిపిస్తుంటే ఆ చిన్న రోడ్డుపై యువతి అంత స్పీడ్గా ఎందుకు వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఆవును అలా రోడ్డు మీద వదిలేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

2024 US Elections: నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పోటీ పడుతున్న కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్, ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న 2.1 కోట్ల మంది ప్రజలు

Hazarath Reddy

యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరగనున్నాయి.ఈనేపథ్యంలో నిర్వహించిన ముందస్తు ఎన్నికల్లో దాదాపు 2.1 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలోని ఎలక్షన్‌ ల్యాబ్‌ వెల్లడించింది.

Advertisement

Delhi Shocker: ఢిల్లీలో కాలుష్యం పెరిగింది, ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎంతో మాట్లాడాలంటూ హైటెన్షన్ వోల్టేజీ విద్యుత్ స్తంభంపైకి ఎక్కి ఓ వ్యక్తి నిరసన

Hazarath Reddy

ఢిల్లీలో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో మాట్లాడేందుకు తనను అనుమతించాలంటూ డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.

Nalgonda: కోమటిరెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నాభాయ్ ఇంజనీర్, బస్తాలు అమ్ముకుని బీర్లు తాగేవాడు...బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ ఫైర్

Arun Charagonda

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నా భాయ్ ఇంజనీర్ అని ఎద్దేవా చేశారు.

Astrology: అక్టోబర్ 30న శుక్రుడు, బుధుడు వృశ్చిక రాశిలో ప్రవేశం తో లక్ష్మీనారాయణ యోగం.. మూడురాశుల వారికి అదృష్టం.

sajaya

ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 31 మరియు ఒకటవ తేదీన వస్తుంది. అయితే అక్టోబర్ 30వ తేదీన శుక్రుడు ,బుధ గ్రహాలు రెండు కూడా వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాయి.

Health Tips: మధుమేహం ఉన్నవారు షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవడం కోసం ఎటువంటి సూపులు తాగాలో తెలుసా..

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు రెట్టింపు అవుతుంది. మధుమేహం రక్తంలోని షుగర్ లెవెల్స్ ను పెరగడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

Advertisement

Health Tips: ఉదయం టిఫిన్ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

sajaya

రోజంతా యాక్టివ్ గా ఉండాలి అంటే మనము బ్రేక్ ఫాస్ట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఆరోగ్యకరమైన పోషకపకారమైన ఆహారంతో మన రోజున ప్రారంభిస్తే అనేక రకాలైనటువంటి లాభాలు జరుగుతాయి.

Cyclone Dana Update: ఏపీకి తప్పిన తుపాను ముప్పు, ఒడిశా, బెంగాల్‌ను వణికిస్తున్న దానా సైక్లోన్, రేపు పూరీ, సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం

Hazarath Reddy

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌కు చేరువగా సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడి తీవ్ర రూపం దాల్చిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది తీవ్ర తుఫాన్‌ దానగా మారింది. ఈ దాన తుఫాన్‌(Cyclone Dana).. ఇవాళ కానీ రేపు కానీ ఒడిశా, బెంగాల్ తీరాన్ని దాటే అవ‌కాశం ఉన్న‌ది.

Health Tips: మీ జీవితకాలం రెట్టింపు అవ్వాలంటే ఈ పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోండి.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మన జీవిత కాలాన్ని రెట్టింపు చేసుకుంటూ నాణ్యమైన జీవితాన్ని గడపడానికి మన ఆహారంలో కొన్ని అలవాటు చేసుకోవాలి.

Guntur Nurse Murder Case: జగన్‌కు ఇంకా తగ్గని క్రేజ్, వైసీపీ అధినేత వస్తున్నాడని జనసంద్రమైన గుంటూరు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రౌడీషీటర్‌ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబస­భ్యులను పరామర్శిందుకు వైఎస్‌ జగన్‌ జీజీహెచ్‌కు వెళ్లారు. వైఎస్‌ జగన్‌ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

Advertisement
Advertisement