India

Bandi Sanjay On KTR Notices: కేటీఆర్ ఇచ్చిన నోటీసులకు భయపడేది లేదు?, మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానన్న బండి సంజయ్

Arun Charagonda

కేటీఆర్ పంపిన నోటీసులకు బదులిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు అని...రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా? అని ప్రశ్నించారు. విమర్శలకు నోటీసులే సమాధానమా?, నేను కూడా నోటీసులు పంపిస్తా...కాచుకో అన్నారు. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన అని చెప్పిన బండి..మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానని చెప్పారు.

Health Tips: ఒకరోజులో మన శరీరానికి ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసా..తక్కువ నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు..

sajaya

మన శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. అనేక రకాల జబ్బులు తగ్గించడంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మన శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉంచడానికి నీరు చాలా అవసరం.

Andhra Pradesh: వచ్చేది మన ప్రభుత్వమే, నిందితులను వెంటాడి జైల్లో పెడతాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో మహిళల భద్రతలను కూటమి నేతలు ప్రశ్నార్థకంగా మార్చేశారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. అన్ని వర్గాల మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagan Slams Nara Lokesh: దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా? నారా లోకేష్‌ని పప్పు అనడంలో తప్పే లేదంటూ మండిపడిన జగన్

Hazarath Reddy

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్‌ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్‌ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

Advertisement

Priyanka Gandhi: వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ, హాజరైన సోనియా - రాహుల్ గాంధీ...భారీగా తరలివచ్చిన ప్రజలు

Arun Charagonda

కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రియాంక గాంధీ. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలిరాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆ తర్వాత రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ.. వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రిజైన్ చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

School Girls Fighting: వీడియో ఇదిగో, కోచింగ్ సెంటర్ నుండి బయటకు వచ్చి తన్నుకున్న అమ్మాయిలు, వారిని రెచ్చగొడుతూ ఎంజాయ్ చేసిన అబ్బాయిలు

Hazarath Reddy

Chennai: 50 పైసలు తిరిగి ఇవ్వనందుకు పోస్టాఫీసుకు రూ. 15 వేలు జరిమానా విధించిన కోర్టు, చెన్నైలో ఘటన

Hazarath Reddy

50 పైసల నాణేనికి సంబంధించిన చెన్నై వినియోగదారుల వివాదంలో కస్టమర్‌కు చిన్న మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి విఫలమైన స్థానిక పోస్టాఫీసుకు INR 15,000 జరిమానా విధించబడింది.

Reels With Cheetah: చిరుతపులితో రీల్...ముగ్గురిపై దాడి చేసిన చిరుత, మధ్యప్రదేశ్‌లో ఘటన...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఉత్తర ప్రదేశ్ కు చెందిన సుమారు 50 మంది మిత్రులు మధ్యప్రదేశ్ కు విహారయాత్రకు వెళ్లారు. షాదోల్ జిల్లాలోని గోహ్పారు- జైత్‌ పూర్ అడవుల్లోని వాటర్ ఫాల్స్ చూడాలి వెళ్లారు. ఓ ముగ్గురు వ్యక్తులు అడవి లోపలికి వెళ్లారు.

Advertisement

KTR: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక

Arun Charagonda

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు షాకిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

Hong Kong Blocks WhatsApp: వాట్సాప్‌ను బ్యాన్ చేసిన హాంకాంగ్, కొత్త ఐటీ మార్గదర్శకాలు రిలీజ్, ప్రభుత్వ సంస్థల్లో గూగుల్ డ్రైవ్, వీ చాట్ యాప్‌ల తొలగింపు

Arun Charagonda

సైబర్ సెక్యూరిటీ నేపథ్యంలో హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా పరమైన కారణాలతో తమ కంప్యూటర్‌లలో వాట్సాప్, వీచాట్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి యాప్‌లను ఉపయోగించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు నూతన ఐటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.

Hyderabad: గోషామహల్‌లో భారీగా కుంగిన నాలా , అర్థరాత్రి కావడంతో తప్పిన ప్రమాదం...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ గోషామహల్‌లో నాలా రోడ్డు కుంగింది. దారుసలామ్ రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు నాలా కుంగింది. అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో శివరేజ్ పెద్ద నాలా కుంగగా ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Kaleswaram Project Public Hearings: కాళేశ్వరంపై మళ్లీ విచారణ, ప్రతి రోజు రెండు సెషన్స్ లలో కొనసాగనున్న ఓపెన్ కోర్టు విచారణ..ఈ నెలాఖరులోగా తుది నివేదిక సిద్ధం!

Arun Charagonda

నేటి నుంచి కాళేశ్వరంపై మళ్లీ విచారణ ప్రారంభించనుంది కమిషన్. ప్రతి రోజు రెండు సెషన్స్ లలో కొనసాగనుంది ఓపెన్ కోర్టు విచారణ. పలువురు ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు నేటి విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లతో విచారణ పూర్తి చేయాలనే యోచనలో కమిషన్ ఉండగా ఆ తర్వాత తుది నివేదికను సమర్పించనుంది.

Advertisement

Pulivendula Road Accident: వీడియో ఇదిగో, పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడిన బస్సు, 25 మంది ప్రయాణికులకు గాయాలు

Hazarath Reddy

ఏపీలోని వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Yadagirigutta Temple: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం...ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడం సరికాదన్న ఈవో, ఇకపై చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలని హెచ్చరిక

Arun Charagonda

యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలపై నిషేధం విధించారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి జ్ఞాపకార్థంగా భద్రపర్చుకుంటే అభ్యంతరం లేదని...చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Ruckus at Jamia Millia Islamia University: దీపావళి వేడుకల్లో పాలస్తీనా జిందాబాద్ అంటూ నినాదాలు, ఢిల్లీ జామియా యూనివర్సిటీలో తన్నుకున్న రెండు విద్యార్థి గ్రూపులు

Hazarath Reddy

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మంగళవారం సాయంత్రం దీపావళి వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. బిజెపి విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సభ్యులు రంగోలీల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఘర్షణ జరిగింది. మరో గుంపు రంగోలిలను పాడు చేయడం మరియు డయాస్‌లను తన్నడం ద్వారా ఈవెంట్‌కు అంతరాయం కలిగించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.ఇది ఘర్షణకు దారితీసింది.

Seethakka Worships Lord Balaji: తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క, ప్రియాంక గాంధీ విజయం కోసం ప్రత్యేక పూజలు..తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్ష

Arun Charagonda

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. బుధవారం వేకువజాము శ్రీవారికి పుష్పాలు అలంకరించే తోమాల సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేత ప్రియాంక గాంధీ వయనాడ్ లో నామినేషన్ వేస్తున్న శుభసందర్భంలో ఆమె ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడంతో చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

Advertisement

Andhra Pradesh: నడిరోడ్డుపై మొసలి కలకలం, పిల్లుట్ల జంక్షన్ సమీపంలోరోడ్డుపైకి వచ్చిన మొసలి, భయాందోళనలో ప్రజలు

Arun Charagonda

నడిరోడ్డుపై మొసలి కలకలం కలకలం రేపింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల బైపాస్ పిల్లుట్ల జంక్షన్ సమీపంలో రోడ్డుపై అటుఇటు తిరిగింది మొసలి. పొలాల్లో నుంచి రోడ్డుపైకి వచ్చిన మొసలిని చూసి ప్రజలు భయాందోళనకు గురికాగా స్థానికుల సమాచారంతో మొసలి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.

Vasireddy Padma Resigns YSRCP: వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా, జగన్‌పై తీవ్ర విమర్శలు, రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అని మండిపాటు

Arun Charagonda

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రిలీజ్ చేసిన వాసిరెడ్డి పద్మ...జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ పార్టీ అంటే వ్యాపార కంపెనీ కాదని మండిపడ్డారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని, పరిపాలన చేయడంలో, సమాజం పట్ల అంతకన్న బాధ్యత లేదని మండిపడ్డారు.

Telangana Assembly: త్వరలో కొత్త అసెంబ్లీ భవనం, రూ.49 కోట్లతో నిర్మిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి, మండలి భవన రిపేర్లపై సమీక్ష సందర్భంగా వెల్లడి

Arun Charagonda

రాష్ట్రంలో త్వరలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రూ.49 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. మండలి భవన రిపేర్లపై సమీక్ష సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ కౌన్సిల్ కు ఒకే దగ్గర భవనాలు ఉంటాయని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి.. మండలి భవన రిపేర్లపై సమీక్ష నిర్వహించారు.

Pinipe Viswaroop Son Srikanth Arrest: మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్ట్ , 14 రోజులు రిమాండ్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

Arun Charagonda

మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గతంలో అరెస్ట్ అయిన ముద్దాయి వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు అని శ్రీకాంత్ తరపు న్యాయవాది వెల్లడించారు.

Advertisement
Advertisement