జాతీయం

Attack On Female Doctor: వీడియో..గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌పై దాడి, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు

Arun Charagonda

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి కలకలం రేపింది. ఓ లేడి జూనియర్ డాక్టర్ చేయి పట్టుకుని , ఆమె ఆఫ్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు పోలీసులు.

Rain Alert: మరో వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని వర్షం ముప్పు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక!

Arun Charagonda

ఇప్పటికే కురిసిన ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ మరో అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని తెలిపింది. వాయుగుండం కారణంగా ఇవాళ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Hot Car Death in US: తల్లి మద్యం మత్తులో.. ఎండ వేడి దెబ్బకి మూడేళ్ల బాలిక కారులో మృతి, కాలిఫోర్నియాలో విషాదకర ఘటన

Vikas M

అమెరికాలోని కాలిఫోర్నియాలో తన తల్లి మద్యం మత్తులో ఉండగా కారులో వెనుక సీటులో కూర్చొని మూడేళ్ళ బాలిక మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఎండ వేడిమికి పసిబిడ్డ వడదెబ్బకు గురై మృతి చెందాడు. మహిళ అరెస్టు చేయబడింది.

Vande Bharat Train: సుత్తితో వందేభారత్ రైలు అద్దాన్ని యువకుడు ఎందుకు పగులగొట్టాడో సమాధానం ఇదిగో..

Vikas M

వందేభారత్ రైలు ఉన్నది స్టేషన్ కాదని, ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని వెల్లడైంది. ఆ కుర్రాడు ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగి అని, పాడైపోయిన అద్దాన్ని మరో కొత్త అద్దంతో భర్తీ చేసేందుకు... పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది.

Advertisement

Ganesh Chaturthi: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ థీమ్‌తో వినాయక మండపం, ప్రతీ క్షణాన్ని రీక్రియేట్‌ చేసినట్టుగా మండపం, ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Vikas M

ఈ మూమెంట్‌కు సంబంధించిన థీమ్‌తో వాపిలో రూపొందించిన వినాయక మండపం భక్తులను విశేషంగా అలరిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురు, భారత ఫీల్డర్లు ఆసక్తిగా చూస్తుండటం, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుల కేరింతలు… ఇలా ప్రతీ క్షణాన్ని రీక్రియేట్‌ చేసినట్టుగా మండపాన్ని మలచడం విశేషం. దీన్నంతటినీ పై నుంచి వినాయకుడు కుర్చీలో కూర్చుని చూస్తున్నట్టుగా రూపొందించారు.

Sivaji: The Boss: ర‌జ‌నీకాంత్ శివాజీ ది బాస్ మళ్లీ థియేటర్‌లోకి, సెప్టెంబ‌ర్ 20న ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లుగా వార్తలు

Vikas M

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, అందాల తార శ్రియ చరణ్ నటించి శివాజీ ది బాస్ (Sivaji: The Boss) సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే రీ రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించి నాలుగు సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం మ‌రో సారి రీ రిలీజ్ సిద్ధం అవుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Samsung India Layoffs: శాంసంగ్‌ ఇండియాలో లేఆఫ్స్‌ కలవరం, 200 మందిపై వేటు వేయనున్న టెక్‌ దిగ్గజం

Vikas M

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ భారత్‌ ఆపరేషన్స్‌కు చెందిన 200 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వ్యాపార వృద్ధి మందగించడం, వ్యయ నియంత్రణ, డిమాండ్‌ లేమి వంటి కారణాలతో ఉద్యోగులను కుదించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం.

Hydra Demolitions List: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు స్వాదీనం చేసుకున్నారో తెలుసా? ఎన్ని భవనాలు కూల్చారంటే?

VNS

Advertisement

Uttar Pradesh Horror: జూదంలో ముగ్గురు బిడ్డల తల్లి అయిన భార్యను పణంగా పెట్టిన భర్త, ఓడిపోవడంతో స్నేహితులు ఆమెపై దారుణంగా లైంగిక దాడి

Hazarath Reddy

21వ శతాబ్దం కంటే మధ్యయుగ కాలంతో సమానంగా ఉన్న ఒక సంఘటనలో, ఒక వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతున్నప్పుడు తన భార్య అయిన ముగ్గురు చిన్న పిల్లల తల్లిని పణంగా పెట్టాడు. ఆమెపై లైంగిక వేధింపులకు అనుమతించాడు

PM E Drive Scheme: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం కొత్త స్కీం, EV అంబులెన్సుల కోసం ప్రతీక ప్రోత్సహకాలు

VNS

ఎలక్ట్రిక్‌ వాహనాల (EV) వినియోగాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్‌ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ రివల్యూషన్‌ ఇన్నోవేటివ్‌ వెహికల్‌ ఎన్‌హాన్స్‌మెంట్ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Aadhaar Card Update: దగ్గర పడుతున్న ఉచిత ఆధార్ అప్డేట్ గడువు, ఈ స్టెప్స్ ఫాలో అయితే ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు

VNS

మీ ఆధార్ కార్డు ఇంకా అప్‌డేట్ చేయలేదా? (Aadhaar Card Update) అయితే, వెంటనే ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్‌ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయడం తప్పనిసరి. మీ ఆధార్ కార్డ్ దాదాపు 10ఏళ్ల క్రితం జారీ అయి ఇప్పటికీ అప్‌డేట్ చేయకపోతే.. ఈ సెప్టెంబర్ 14 వరకు ఎలాంటి ఖర్చు లేకుండా అవసరమైన మార్పులు చేసేందుకు అవకాశం ఉంది

Ayushman Bharat Scheme: వృద్దులకు గుడ్ న్యూస్, 70 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం

VNS

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ (Ayushman Bharat Scheme ) కింద బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. దాదాపు 4.5 కోట్ల కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwani Kumar) తెలిపారు.

Advertisement

MG Windsor EV: ఎంజీ మోటార్స్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ విడుదల, కేవలం రూ.10 లక్షలకే మార్కెట్లోకి...

VNS

మోటార్ ప్రిస్మాటిక్ సెల్స్‌తో 38 కేడబ్ల్యూహెచ్‌ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ పాక్‌ ద్వారా శక్తి అందుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేసే 331 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈవీ 4,295 మిల్లీమీటర్ల పొడవు, 1,652 మిల్లీమీటర్ల ఎత్తు, 1,850 మిల్లీమీటర్ల వెడెల్పు ఉంటుంది. వీల్‌బేస్‌ 2,700 మిల్లీమీటర్లు.

Attack on Female Doctor in Gandhi Hospital: వీడియో ఇదిగో, గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై దాడి, ఆందోళనకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు

Hazarath Reddy

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై రోగి బంధువు దాడి చేశాడు. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. రోగి బంధువు లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది డాక్టర్‌ను కాపాడారు.

Student Bitten by Snake: వీడియో ఇదిగో, ప్రకృతి పిలిచిందని వెళ్లిన గురుకుల విద్యార్థిని కాటేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన స్కూలు యాజమాన్యం

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లా(Peddapally district) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా లలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థిని పాము కాటు(Snake bite) వేసింది. మన్విత్‌ను గురుకుల సిబ్బంది కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.

IIT-Guwahati Dean Resigns: ఐఐటీ గౌహతిలో విద్యార్థి సూసైడ్, విద్యార్థుల ఆందోళనతో రాజీనామా చేసిన ఐఐటీ గౌహతి డీన్‌

Hazarath Reddy

అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బీటెక్‌ విద్యార్థి సోమవారం హాస్టల్‌ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఏడాదిలో మూడో స్టూడెంట్‌ మరణించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా హాజరు తక్కువగా ఉండడంతో సుమారు 200 మందిని ఫెయిల్‌ చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.

Advertisement

Dog Last Rites: పోలీస్ శాఖలో 8 ఏళ్ల పాటు సేవలందించిన కుక్క మృతి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన నిజామాబాద్ పోలీసులు

Hazarath Reddy

అధికారిక లాంఛనాలతో శునకానికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో దాదాపు 8 ఏళ్ల పాటు సేవలు అందించిన డాగ్ గోల్డి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు డాగ్ గోల్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

Bigg Boss Tamil 8 Promo: బిగ్ బాస్ తమిళ్ 8 ప్రోమో విడుదల, కొత్త హోస్ట్‌గా అడుగుపెట్టిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

Hazarath Reddy

ఎట్టకేలకు బిగ్ బాస్ తమిళ్ 8 ప్రోమో విడుదలైంది. ఈ సీజన్‌లో, షో ఒక వినూత్నమైన ట్విస్ట్‌ని తీసుకువస్తుందని ప్రోమో తెలియజేస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా అడుగుపెడుతున్నారు.

Uttar Pradesh Shocker: యూపీలో ఘోర విషాదం, రీల్స్ తీస్తూ వేగంగా వచ్చిన రైలు కింద పడి పసిబిడ్డతో సహా తల్లిదండ్రులు మృతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరిస్తున్నారు. అయితే వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

New Liquor Policy in AP: ఏపీలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ, ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, వివరాలను వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర

Hazarath Reddy

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో, నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement