India

Mumbai Horror: ముంబైలో దారుణం, 12 ఏళ్ళ బాలుడిపై తాగుబోతు యువకుడు అత్యాచారం, ప్రైవేట్ పార్టులో నుండి తీవ్ర రక్తస్రావం

Hazarath Reddy

షాకింగ్ సంఘటనలో, ముంబైలోని గోవాండిలోని మాన్‌ఖుర్డ్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడిపై తాగిన వ్యక్తి దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ సంఘటన సెప్టెంబర్ 2, సోమవారం సాయంత్రం జరిగింది.

TDP Office Destroyed Case: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. వైసీపీ నేతలు దేవినేని అవినాశ్‌, నందిగాం సురేశ్‌, అప్పిరెడ్డి సహా పలువురు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ జోగి రమేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి మిసైళ్లతో విరుచుకుపడిన రష్యా, 51 మంది మృతి, మరో 200 మందికి గాయాలు, సైనిక విద్యా కేంద్రంపై క్షిపణి దాడి

Hazarath Reddy

ర‌ష్యా మ‌రోసారి ఉక్రెయిన్‌పై మిసైళ్లతో విరుచుకుప‌డింది. ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో సుమారు 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయపడ్డారు.

Megastar Chiranjeevi: వరద బాధితులకు అండగా చిరంజీవి, తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం, సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలిచివేశాయన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన చిరు.. రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు చిరు.

Advertisement

North Korea Floods: వరదలపై అధికారుల నిర్లక్ష్యం, 30 మందిని ఉరి తీయించిన నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నార్త్ కొరియాను గత నెలలో భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు సుమారు 4 వేల మంది చనిపోయారని, 5 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. ఈ వరదలను అడ్డుకోవడంలో విఫలం అయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు నార్త్ కొరియా అధినేత.

Is Putin Seeking Immortality? మరణించకుండా ఉండేందుకు మందు తయారు చేసే పనిలో పుతిన్, అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని అభివృద్ది చేయాలని ఆ దేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలు

Hazarath Reddy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చావు లేని జీవితం కోసం పాకులాడుతున్నారా.. ఈ ధరిత్రిపై చిరంజీవిగా ఉండిపోయి కలకాలం రష్యాను ఏలేద్దామనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే వినిపిస్తోంది

Telangana Rains: మళ్లీ ముంచెత్తిన వర్షం, 5 రోజులు స్కూళ్లకు సెలవు, చెరువుల మత్తడితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్..వివిధ జిల్లాల్లో వర్షాలకు సంబంధించిన వీడియోలు..

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ...పింక్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

Khammam: బీఆర్ఎస్ కార్యకర్తను గాయపర్చింది హరీశ్‌ రావు కారే, కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్‌ రెడ్డి ట్వీట్ వైరల్, కారు నడిపింది పాడి కౌశిక్‌ రెడ్డి అని వెల్లడి

Arun Charagonda

నిన్న ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన కారు హరీశ్‌రావు‌దే అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రామ్మోహన్‌..కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి.. అందులో హరీశ్‌రావు కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.

Advertisement

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా, 20కి చేరిన పతకాల సంఖ్య, ఒక్కరోజే ఐదు పతకాలు,పారాలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి

Arun Charagonda

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరగా ఒక్కరోజే 5 పతకాలు వచ్చాయి. స్ప్రింట్ దీప్తి జీవన్‌జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్‌ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు.

Tamilnadu Rains: తమిళనాడులో భారీ వర్షం, తిరువల్లూరును ముంచెత్తిన వర్షాలు..వీడియో

Arun Charagonda

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టించగా తాజాగా తమిళనాడులోనూ భారీ వర్షం కురిసింది. తిరువల్లూరు పట్టణంలో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది.

Andhra Pradesh: వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డికి షాక్, భీమిలి బీచ్‌లో అక్రమ కట్టడాలను తొలగించిన జీవీఎంసీ అధికారులు

Arun Charagonda

ఏపీలోనూ అక్రమ కట్టడాల కూల్చివేత మొదలైంది. విశాఖ పట్నంలోని భీమిలీ బీచ్‌లో అక్రమ నిర్మించిన కట్టడాలను తొలగించారు జీవీఎంసీ అధికారులు. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు అధికారులు.

AP And Telangana Rains: తెలుగు రాష్ట్రాలకు నారా భువనేశ్వరి 2 కోట్ల విరాళం, హెరిటేజ్ ఫుడ్స్ తరపున సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటన

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి 2 కోట్లు విరాళంగా ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయనిధికి కోటి చొప్పున విరాళం అందిస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Heavy Rains In Medaram: మేడారంలో భారీ వర్షం, వేల ఎకరాల్లో నేలకొరిగిన చెట్లు, డ్రోన్ వీడియో వైరల్

Arun Charagonda

భారీ వర్షాల ప్రతాపం మేడారం అడవులపై తీవ్ర ప్రభావం చూపింది. మేడారం-తాడ్వాయి మధ్య వేల ఎకరాల్లో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షం, గాలి దుమారంతో 5కి.మీ పరిధిలో ఎటు చూసినా చెట్లు నాశనమయ్యాయి. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Car Crash In USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు భారతీయులు మృతి, పూర్తిగా కాలిపోయిన శరీరాలు

Arun Charagonda

అమెరికాలోని టెక్సాస్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. మంటల్లో పూర్తిగా శరీరాలు కాలిపోయాయి. ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్ (కూకట్‌పల్లి, హైదరాబాద్),ఫారూక్ షేక్ (BHEL హైదరాబాద్),దర్శిని వాసుదేవన్ (తమిళనాడు), పాలచర్ల లోకేష్ చనిపోయిన వారిలో ఉన్నారు.

Hyderabad Rains : హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన అపార్టుమెంట్ల సెల్లార్‌లు

Arun Charagonda

భాగ్యనగరం హైదరాబాద్‌ను మరోసారి వర్షం ముంచెత్తింది. మంగళవారం అర్థరాత్రి నుండి తెల్లారే వరకు వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు.

Audi Italy Chief Fabrizio Longo Dies : ట్రెక్కింగ్ చేస్తూ 10 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిన ఆడి కార్ల ఇటలీ బాస్ ఫాబ్రిజియో లాంగో, అక్కడికక్కడే మృతి

Vikas M

ఇటలీలో ఆడి కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఫాబ్రిజియో లాంగో ప్రమాదవశాత్తు పెద్ద లోయలో పడి చనిపోయాడు.62ఏళ్ల ఫాబ్రిజియో వీకెండ్ ట్రెక్కింగ్ కోసం సెప్టెంబర్ 1న ఇటలీ, స్విస్ దేశాల సరిహద్దలో ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను ట్రెక్కింగ్ చేసేటప్పుడు 10 వేల అడుగుల ఎత్తైన కొండ నుంచి జారి పడ్డాడు.

Advertisement

Devara Chuttamalle Song: 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న దేవర చుట్టమల్లె సాంగ్, నాలుగు వారాలుగా మోస్ట్‌ ట్రెండింగ్‌ జాబితాలో..

Vikas M

జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి విదితమే. దేవర పార్టు 1 సెప్టెంబర్ ‌27న గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమా నుంచి వచ్చిన చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్‌ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది

Ajay Ratra: బీసీసీఐ కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా, స‌లీల్ అంకోలా స్థానాన్ని భర్తీ చేయనున్న అజయ్, కీలక విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ

Vikas M

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి కొత్త సెలెక్ట‌ర్‌గా అజ‌య్ రాత్రా(Ajay Ratra) ఎంపిక‌య్యాడు. ప్ర‌స్తుతం సెలెక్ట‌న్ ప్యానెల్ స‌భ్యుల్లో ఒక‌రైన‌ స‌లీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజ‌య్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం బీసీసీఐ (BCCI) వెల్ల‌డించింది.

Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి

Vikas M

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజ‌యం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్‌కు ముందే.. బంగ్లా మ్యాచ్‌ను ముగించేసింది. స్వంత గ‌డ్డ‌పై దాయాది దేశానికి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది.పాక్‌పై బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి.

ICC World Test Championship 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..

Vikas M

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.

Advertisement
Advertisement