విద్య

CBSE Board Exams 2021: సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు వాయిదా, ఎగ్జామ్స్ నిర్వహణ తేదీలను తర్వాత నిర్ణయిస్తాం, కీలక ప్రకటన చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్

Hazarath Reddy

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు 2021 (CBSE Board Exams 2021) జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ జరుపలేమని తేల్చి చెప్పారు. పరీక్షలు రద్దు చేయబడవని, కానీ వాయిదా వేస్తారని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యం కానందున పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని కేంద్ర మంత్రి అన్నారు.

Wipro Elite 2021: విప్రోలో ఉద్యోగ అవకాశాలు, ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 ని ప్రకటించిన విప్రో, రూ.30 వేల జీతం.. ఉద్యగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనా సమయంలో భారతదేశానికి చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ విప్రో ఉద్యోగ అవకాశాలను (Wipro Elite 2021) కల్పించేందుకు రెడీ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు, అలాగే 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.

RRB Exams 2020: డిసెంబర్ 15 నుంచి 23 మధ్య ఆర్‌ఆర్‌బి పరీక్షలు, అభ్యర్థులకు ఎలాంటి కాల్ లెటర్ పంపరు, rrbcdg.gov.in నుంచి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపిన ఇండియన్ రైల్వే

Hazarath Reddy

ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌బి పరీక్షలు డిసెంబర్ 15 నుంచి 23 మధ్య జరగనున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయితే అభ్యర్థలకు ఎటువంటి కాల్ లెటర్స్ పంపబడవని నేరుగా ఆర్ఆర్బీ వెబ్ సైట్ rrbcdg.gov.in అబ్యర్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచించింది.

PM Modi to IITians: కొత్తగా ఆలోచించండి..! ఐఐటీ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, కొవిడ్ తర్వాత టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలదే కీలకపాత్ర అని వ్యాఖ్య

Team Latestly

కొవిడ్ కారణంగా నెలకొన్న ప్రతికూలతను ఒక అవకాశంగా మార్చడానికి ప్రయత్నించాలని మోదీ సూచించారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు తమకు తాముగా సవాలు చేసుకుంటూ, ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకుంటూ ముందుకు సాగడం ఎంతో ముఖ్యం అని మోదీ అన్నారు....

Advertisement

Guidelines for Schools & Colleges: తల్లిదండ్రులు అనుమతిస్తేనే స్కూళ్లకు పిల్లలు, నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్, నేటి నుంచి ప్రారంభమైన ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్

Hazarath Reddy

కరోనావైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ( Anil Kumar Singhal) చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్ సింఘాల్.. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు (Guidelines For Schools & Colleges) తీసుకుంటున్నామని తెలిపారు.

Schools Reopening Date in AP: నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూల్స్ ప్రారంభం, సిలబస్ తగ్గింపు, స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపిన మంత్రి సురేష్

Hazarath Reddy

ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ (Schools Reopening Date in AP) ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించామని, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని మంత్రి తెలిపారు

AP EAMCET Result 2020: ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు విడుదల, ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత, ఫలితాలను sche.ap.gov.inలో చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు శనివారం విడుదల (AP EAMCET Result 2020) అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh) విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత (AP EAMCET 2020 Results) సాధించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థులు ఎంసెట్‌ ఫలితాలను sche.ap.gov.inలో చూసుకోవచ్చు.

AP POLYCET Result 2020: ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ పరీక్ష 2020 ఫలితాలు విడుదల, 84 శాతం ఉత్తీర్ణత, ఫలితాలు మరియు కౌన్సిలింగ్ వివరాలు తెలుసుకోండి

Team Latestly

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 120 మార్కులకు గానూ 120 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించగా, తూర్పు గోదావరికి చెందిన శ్రీ దత్తా సియంసుందర్ 118 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు.....

Advertisement

TS EAMCET 2020 Results Declared: తెలంగాణ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల, ఎంసెట్‌లో 75.29శాతం విద్యార్థులు ఉత్తీర్ణత, అక్టోబరు 9 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2020 ఫలితాలు (TS EAMCET 2020 Results) విడుదలయ్యాయి. హైదరాబాద్, కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లో 3.30 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఎంసెట్ 2020 ఫలితాలు (TS EAMCET Results 2020) విడుద‌ల చేశారు.

AP ECET Results 2020: ఏపీ ఈసెట్‌-2020 ఫలితాలు విడుదల, 30,654 మంది క్వాలిఫై, ఫలితాలను https://sche.ap.gov.in/ ద్వారా తెలుసుకోండి

Hazarath Reddy

ఇంజనీరింగ్‌ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2020 ఫలితాలు (AP ECET Results 2020) మంగళవారం విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను (AP ECET results 2020 declared) విడుదల చేశారు. విద్యా శాఖ స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, ఎపి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు.

TS EAMCET Results 2020: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల, మధ్యాహ్నం 3.30గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ

Hazarath Reddy

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీర్‌ విభాగం ఫలితాలు (TS EAMCET Results 2020) నేడు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు జేఎన్టీయూహెచ్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను (TS EAMCET 2020 Results) విడుదల చేయనున్నారు. ఇక ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

AP Schools Reopening Postponed: ఏపీలో స్కూళ్ల రీ ఓపెనింగ్ తేదీ వాయిదా, నవంబర్‌ 2న స్కూళ్లు తెరుస్తామని తెలిపిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

ఏపీలో అక్టోబర్‌ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు (AP Schools Reopening Postponed) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌ 2న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అయినప్పటికీ అక్టోబర్‌ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రభుత్వం అందజేయనుందని తెలిపారు. ఆ మేరకు అక్టోబర్‌ 5న జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వీలుంటే సీఎం వైఎస్‌ జగన్‌ ఏదైనా స్కూల్‌కు కూడా వెళ్తారని మంత్రి సురేష్‌ తెలిపారు.

Advertisement

AP PGECET 2020: ఏపీ పీజీ సెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి, సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షలు, వివరాలను వెల్లడించిన పీజీ సెట్ కన్వీనర్ పీ శ్రీనివాసరావు

Hazarath Reddy

ఏపీ పీజీ సెట్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పీజీ సెట్ కన్వీనర్ పీ శ్రీనివాసరావు (PG Set Convener P Srinivasa Rao) తెలిపారు. ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీజీ సెట్ (AP PGECET 2020) కోసం 13 పరీక్షలు మూడు రోజుల పాటు జరగనున్నాయని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

AP Grama Sachivalayam Exam: నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ, రేపటి నుంచి సచివాలయ పోస్టుల భర్తీ పరీక్షలు, ఏడు రోజుల పాటు 14 రకాల రాతపరీక్షలు

Hazarath Reddy

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు (AP Grama Sachivalayam Exam) మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను (AP Grama Sachivalayam 2020) నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

TS EAMCET 2020: ప్రారంభమైన తెలంగాణ ఎంసెట్, బయోమెట్రిక్‌ బదులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానంలో విద్యార్థుల ఫొటోలు, సెప్టెంబర్ 15 నుంచి ఓయూ పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET 2020) బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం హాల్‌టికెట్‌తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్‌ను కూడా నిర్వాహకులు ఇచ్చారు. కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ నేపథ్యంలో విద్యార్థులకు టెంపరేచర్‌ చెక్‌ చేసి, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలకు పంపారు. పరీక్షా కేంద్రాలను కూడా శానిటైజ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు.

APSET 2020: విద్యార్థులు రెడీ అయ్యారా..రేపట్నుంచే ఏపీ సెట్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సురేష్

Hazarath Reddy

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్‌’ (APSET 2020) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు (Andhra Pradesh State Eligibility Test) సన్నాహాలు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Advertisement

Governor's Conference on NEP 2020: ఎన్‌ఈపీలో ప్రభుత్వ జోక్యం పరిమితం, ఎలాంటి ఒత్తిళ్లు లేని విధంగా జాతీయ విద్యా విధానం, ఎన్‌ఈపీ-2020 సమావేశంలో ప్రధాని మోదీ

Hazarath Reddy

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై (NEP 2020) రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధని నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా (Governor's Conference on NEP 2020) మాట్లాడారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం-2020పై ప్రధాని మోదీ (PM Narendra Modi ప్రశంసలు కురిపించారు. ఇందులో ప్రభుత్వ జోక్యం చాలా పరిమితంగానే ఉండాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో గవర్నర్లు, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, అన్ని రాష్ట్రాల విద్యా మంత్రులు హాజరయ్యారు.

Literacy Rate Ranking: అక్షరాస్యతలో అట్టడుగున ఏపీ, కేరళ నంబర్ వన్, రెండవ స్థానంలో ఢిల్లీ, అస్సాం కన్నా వెనుకంజలో తెలంగాణ రాష్ట్రం, గణాంకాలను విడుదల చేసిన నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌

Hazarath Reddy

విద్యా రంగానికి సంబంధించి నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) (National Statistical Office (NSO) తాజాగా 2017-18 సంవత్సరానికి విద్యారంగానికి సంబంధించి డేటాను విడుదల చేసింది. ఏడు సంవత్సరాల దాటిన వారి విద్యార్హతల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 66.4 శాతం అక్షరాస్యతతో (Andhra Pradesh) ఏపీ అట్టడుగున ఉంది. 96.2 శాతం అక్షరాస్యతతో కేరళ (Kerala) నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.

Supreme on UGC Exams: పరీక్షలు తప్పనిసరి, కానీ వాయిదా వేసుకోవచ్చు! పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయడం సరికాదు, యూజీసీ పరీక్షల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్ట్

Team Latestly

కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు ఉండే "రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారం చట్టం" ప్రకారం పరీక్షలు వాయిదా వేసుకోవచ్చునని తెలిపింది, అందుకోసం యూజిసిని సంప్రదించాలని తెలిపింది. అంతేకానీ విద్యార్థుల గత ఉత్తీర్ణత ఆధారంగా....

TS online Classes Time Table: తెలంగాణలో ఆన్‌లైన్‌ క్లాసులకు మార్గదర్శకాలు విడుదల, ప్రీస్కూల్‌ విద్యార్థులకు 45 నిమిషాలు, 1 నుంచి 5వ తరగతివరకు గంటన్నర, 9-12వ తరగతులకు 3 గంటల పాటు క్లాసులు

Hazarath Reddy

తెలంగాణలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి డిజిటల్‌ (ఆన్‌లైన్‌) విధానంలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను (TS online Classes Time Table) జారీచేసింది. రాష్ట్రంలో విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో పాఠాలు చెప్పే క్రమంలో అనుసరించాల్సిన విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన (School Education Director Sri Devasena) మంగళవారం విడుదలచేశారు.

Advertisement
Advertisement