Education

SSC CHSL 2026 Recruitment: 12వ తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. SSC CHSLలో 2,536 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లికేషన్ డెడ్‌లైన్ ఇదే..

Advertisement

Educationசெய்திகள்

Fact Check: ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు ప్రచారం అబద్దం, క్లారిటీ ఇచ్చిన ఇంటర్ బోర్డు, ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దని సూచన

Hazarath Reddy

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది.

'Inter First Year Exams Cancelled': ఏపీలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు ఎత్తివేస్తాం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని.. రెండో సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

Sankranti Holidays 2025: జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు, సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్‌ బోర్డు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. 17న తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపింది.

Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం

Rudra

ఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

AP SBTET Diploma Results 2025: ఏపీ SBTET డిప్లొమా ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను sbtet.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ (AP SBTET), 2024–2025 సెషన్‌కు సంబంధించిన డిప్లొమా C16, C20 మరియు C23 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు.

Telangana Sankranti Holidays 2025: తెలంగాణలో జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, జనవరి 18న తిరిగి పాఠశాలలు ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం తాజాగా సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి.

Centre Scraps 'No-Detention' Policy: ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై 5, 8 తరగతులకు ఉత్తీర్ణత తప్పనిసరి

Rudra

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్ధులు ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే.

Telangana TET Exam Schedule: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్, జనవరి 2 నుండి 20 వరకు టెట్ పరీక్షలు...వివరాలివే

Arun Charagonda

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ జరగనుంది.

Advertisement

MLC Kavitha: మూసీ సుందరీకరణపై ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్దాలే, డీపీఆర్ రెడీ కాకముందే అప్పు కావాలని ప్రపంచబ్యాంకును కోరిన ప్రభుత్వం...ఎమ్మెల్సీ కవిత ఫైర్

Arun Charagonda

మూసీ భాగోతం ఆధారాలతో బైట పెట్టారు ఎమ్మెల్సీ కవిత. మూసీ సుందరీకరణ కోసం DPR రెడీ కాకముందే రూ.4,100 కోట్లు అప్పు కావాలని వరల్డ్ బ్యాంకును అడిగారని తెలిపారేఉ. మూసీ సుందరీకరణ కోసం వరల్డ్ బ్యాంకును అప్పు అడిగిన తేదీ - 19/09/2024 కాగా మూసీ DPR కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తేదీ - 4/10/2024 అన్నారు. ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుపై చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు.

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్‌ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి.

Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

Rudra

నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

AP SSC Exam Date 2025: ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలో ప్రభుత్వ పరీక్షల విభాగం రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించింది. తాజాగా పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేశారు.

Advertisement

Agniveer Recruitment Rally: ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు గుడ్ న్యూస్.. డిసెంబరు 8 నుంచి హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ

Rudra

ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు శుభవార్త. ఆర్మీ రిక్రూట్‌ మెంట్ బోర్డు.. అభ్యర్ధుల ఎంపికకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబాద్‌ లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.

CAT Exam Today: నేడు క్యాట్‌ ఎగ్జామ్‌.. మూడు సెషన్లలో పరీక్ష.. తెలంగాణలో సెంటర్లు ఇవే..!

Rudra

ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్‌ ఎగ్జామ్‌ ఆదివారం జరగనుంది.

TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్‌-3 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తెలిపింది.

TS TET Notification 2024: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల,2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు, నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ

Hazarath Reddy

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న సంగతి విదితమే.

Advertisement

AP TET Results 2024 Out: ఏపీ టెట్ ఫలితాల విడుదల, మీ రిజల్ట్స్ aptet.apcfss.in ద్వారా చెక్ చేసుకోండి, అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు

Hazarath Reddy

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) విడుదల చేశారు. అక్టోబర్‌ 3 నుంచి 21వ వరకు టెట్‌ పరీక్షలు (AP TET Exam) జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్‌ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

TET Day Today: టెట్ కు సంబంధించి నేడు రెండు కీలక పరిణామాలు.. మరికాసేపట్లో ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఇక, నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Rudra

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్) కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు నేడు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదలకానున్నాయి.

TSPSC Group 3 Exam Date 2024: వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు, తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

Hazarath Reddy

తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది.

Telangana Group-1 Exams Update: గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్, మరో ఆరు రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, నోటిఫికేష‌న్ల‌పై ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను కొట్టివేసిన హైకోర్టు

Hazarath Reddy

తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు.

Advertisement
Advertisement