సమాచారం

Cyclone Yaas: నేడు యాస్ తుఫానుగా మారనున్న వాయుగుండం, 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం, పలు రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ, అప్రమత్తమైన పలు రాష్ట్రాలు

Hazarath Reddy

దూసుకొస్తున్న ‘యాస్’ తుపాన్ దృష్ట్యా ముందుజాగ్రత్తగా మే 24 నుంచి మే 29వతేదీ వరకు 25 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్రన్ రైల్వే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర జారీ చేసిన హెచ్చరికలతో రైళ్ల రాకపోకలను (Eastern Railway Suspends 25 Trains) ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేశారు.

CBSE Class 12th Board Exams 2021: రెండు పద్ధతుల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు, పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపిన బోర్డు, పరీక్షలు నిర్వహణపై భేటీ అయిన కేంద్ర మంత్రుల కమిటీ

Hazarath Reddy

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను (CBSE Class 12th Board Exams 2021) నిర్వహించడానికే కేంద్రం మొగ్గు చూపింది. ఇందుకు సంబంధించి రెండు విధి విధానాలను పరిశీలిస్తోంది. ఆ వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీబీఎస్‌ఈ (CBSE) తెలియజేసింది.

CBSE Class 12th Board Exams 2021: ఇంకా ఖరారు కాని సిబిఎస్‌ఇ 12వ తరగతి 2021 పరీక్షల తేదీ, రాష్ట్రాల బోర్డులతో ముగిసిన సమావేశం, మే 25 లోగా వివరణాత్మక సూచనలను పంపాలని రాష్ట్రాలను కోరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్

Hazarath Reddy

సిబిఎస్‌ఇ 12 వ బోర్డు పరీక్షలు 2021 నిర్వహణ తేదీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరీక్షల తేదీ అలాగే షెడ్యూల్‌పై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు, రాష్ట్రాల బోర్డులను ఆహ్వానించబడిన తరువాత వివరణాత్మక సూచనలు తీసుకుని దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.

Petrol and Diesel Prices in India: మళ్లీ భగ్గుమన్నఇంధన ధరలు, ఈ నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం పన్నెండోసారి, ఆర్థిక రాజధాని ముంబైలో వందకు దగ్గరైన పెట్రోల్‌ ధర, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.96.88, డీజిల్‌ రూ.91.65

Hazarath Reddy

ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (Petrol and Diesel Prices in India) రికార్డు స్థాయికి చేరగా.. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి పెంచాయి. శనివారం ఊరట ఇచ్చినట్లే ఇచ్చి.. ఆదివారం స్వల్ఫంగా (Fuel Prices Hiked Again) పెంచాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై పదిహేడు పైసలు, డీజిల్‌పై 29పైసలు పెరిగాయి.

Advertisement

Cyclone Yaas: అతి తీవ్ర తుఫానుగా మారనున్న యాస్, ఈ నెల 26 వరకు భారీ వర్షాలు, అదే రోజు ఒడిశా, బంగ్లాదేశ్‌ మధ్య తీరాన్ని తాకే అవకాశం, నేడు యాస్‌ తుఫానుపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

Hazarath Reddy

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడింది. ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారనున్న ఈ తుఫాను 24వ తేదీన యాస్‌ తుపానుగా (Cyclone Yaas) రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా (Cyclone Yaas Updates) మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

Universities Vice Chancellors: పది విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్స్‌లర్ల నియామకం, రెండున్నరేళ్ల తర్వాత యూనివర్సిటీల వీసీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, పూర్తి జాబితా ఇదే..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఎట్టకేలకు వైస్‌ చాన్స్‌లర్లను ప్రభుత్వం నియమించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను కేసీఆర్ ప్రభుత్వం నియమించింది.

White Fungus & Black Fungus: కొత్తగా వైట్‌ ఫంగస్‌ వెలుగులోకి, నేరుగా ఊపిరితిత్తులపై దాడి, పాట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌, బ్లాక్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమంటున్న వైద్యులు, వైట్‌ ఫంగస్‌ లక్షణాలు. చికిత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

బిహార్‌లో పాట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌ గుర్తించారు. కాగా బ్లాక్‌ ఫంగస్‌ కంటే ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైట్‌ ఫంగస్‌ ఉన్న నలుగురికీ కరోనా నిర్దారణ కాకపోయినా.. కోవిడ్ లక్షణాలు మాత్రం గుర్తించారు.

Cyclone Yaas Update: యాస్ తుఫాన్ ముప్పు, భయం గుప్పిట్లో అయిదు రాష్ట్రాలు, ఈ నెల 24లోగా తుఫానుగా మారనున్న యాస్, 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటే అవ కాశం, హెచ్చరించిన భారత వాతావరణ శాఖ

Hazarath Reddy

అండమాన్‌ సమీపంలో సముద్రం లో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని, ఈ తుఫాను ఈ నెల 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటే అవ కాశముందని (Cyclonic Storm To Teach Odisha-West Bengal Coast) వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Advertisement

Cyclone Yaas: ఈ సారి తూర్పు తీరంలో మరో తుఫాన్, యాస్ గా నామకరణం చేయనున్న ఐఎండీ, బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం, ఈ నెల 25, 26 తేదీల తర్వాత ఏపీలొ మోస్తరు వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

సైక్లోన్ ఏర్పడితే దీనికి యాస్ (Cyclone Yaas) అని నామకరణం చేయనున్నారు.ఈ పేరును ఒమెన్ సూచించనుంది. ఒమెన్ భాషల్ యాస్ అనగా (Yaas Cyclone Meaning) నిరాశ అని అర్ధం వస్తుంది. ఉత్తర హిందూ మహసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు WMO / ESCAP ప్యానెల్ సభ్య దేశాలు పేర్లను సూచిస్తూ ఉంటాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

Cyclone Tauktae: తీరం దాటిన తౌక్టే తుఫాను, అయినా పెను ముప్పే, మళ్లీ 23న అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలతో వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలు

Hazarath Reddy

అరేబియా సముద్రంలో పుట్టిన అత్యంత తీవ్ర తుపాను తౌక్టే సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్‌ – మహువా మధ్య తీరం (Cyclone Tauktae Crosses Gujarat Coast) దాటింది.రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది.

Cyclone Tauktae Update: తీర రాష్ట్రాలను వణికిస్తోన్న తౌక్టే తుఫాను, గుజరాత్‌ తీర ప్రాంతంలో ఆరెంజ్‌ అలర్ట్‌, తీరం దాటే సమయంలో గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు

Hazarath Reddy

కరోనావైరస్ విజృంభనకు తోడయిన తుపాను ‘తౌక్టే’ (Cyclone Tauktae Update) తీర రాష్ట్రాలను వణికిస్తోంది. తౌక్టే అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తీరం దాటనున్న గుజరాత్‌ తీర ప్రాంతంలో ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ను జారీ చేసింది.

Cyclone Tauktae Update: ఆరు రాష్ట్రాలకు తౌక్టే తుఫాను ముప్పు, కర్ణాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు మృతి, ఈ నెల 18న ఉద‌యం గుజ‌రాత్ తీరాన్ని తాక‌నున్న తౌక్టే తుఫాను, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

ఈ నెల 18న ఉద‌యం గుజ‌రాత్ తీరాన్ని తాక‌నుంద‌ని (Cyclone Tauktae Expected To Reach Gujarat Coast on Morning of May 18) భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. 18న మ.2:30 నుంచి రా.8:30 మధ్య తీరం దాటే అవకాశం ఉందని, పోర్‌బందర్‌-నలియా మధ్య తీరం దాటనుందని తెలిపింది.

Advertisement

Cyclone Tauktae Update: మరో 2 రోజులు..వణికిస్తున్న తౌక్టే తుఫాన్, మహారాష్ట్ర, కేరళలో భారీ వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం

Hazarath Reddy

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తౌక్టే తుపానుగా (Cyclone Tauktae Intensifies Into 'Very Severe Cyclonic Storm) రూపాంతరం చెందింది. కేరళ, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌పై తుపాను ప్రభావం (Maharashtra and Gujarat All Set To Face Fury) అదికంగా ఉండనుంది.

Cyclone Tauktae: విరుచుకుపడుతున్న తౌక్టే తుఫాన్, కేరళలో కుప్పకూలిన భవనం, అయిదు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, పోర్బందర్ - నలియాల మధ్య తీరం దాటే అవకాశం

Hazarath Reddy

తౌక్టే తుపాను (Cyclone Tauktae) ప్రభావంతో ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. దీంతో కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వాతావరణం భయానకంగా మారింది. కేరళలోని కసర్‌గడ్‌లో తుపాన్‌ ప్రభావంతో వీచిన గాలులకు ఒక అంతస్తు ఉన్న భవనం కుప్పకూలింది.

Cyclone Tauktae Update: ముంచుకొస్తున్న తౌక్టే తుఫాను ముప్పు, వాయుగుండంగా మారిన అల్ప పీడనం, ఈ నెల 8న తౌక్టే గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన ఐఎండీ

Hazarath Reddy

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా (Cyclone Tauktae update) మారింది. ఈ తుపాన్ శనివారం ఉదయం లక్షద్వీప్ వద్ద కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం లక్షద్వీప్ (Lakshadweep) ప్రాంతం నుంచి దక్షిణ గుజరాత్, డయ్యూ తీరాలకు చేరే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

Cyclone Tauktae: కరోనాకు తోడవుతున్న తీవ్ర తుఫాన్, అరేబియా సముద్రంలో పుట్టిన తౌక్టే, పశ్చిమ తీరాన్ని వణికించేందుకు రెడీ, ఈ నెల 16 నాటికి తుపాను తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

అరేబియా సముద్రంలో రాబోయే కొన్ని రోజుల్లోనే భీకర తుపాను ఏర్పడబోతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఒకవేళ అదే నిజమైతే, ఈ ఏడాది ఏర్పడే తొలి తుపాను అదేనని పేర్కొంది. దీనికి మయన్మార్ సూచించిన ‘తౌక్టే తుఫాను’ (Cyclone Tauktae) అని పేరు పెట్టనున్నారు.

Advertisement

COVID-19 Second Wave: యువతని టార్గెట్ చేసిన సెకండ్ వేవ్, కరోనా కల్లోలంతో లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయిన మెజారిటీ రాష్ట్రాలు, 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు

Hazarath Reddy

దేశంలో మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో కరోనా ప్రభావం వల్ల పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఐసీఎంఆర్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ (ICMR Chief Dr Balram Bhargava) మాట్లాడుతూ.. సెకండ్‌ వేవ్‌లో ఎక్కువ మంది యువత దాని బారిన పడుతున్నారు.

Google Pay: గూగుల్ పే నుంచి అదిరిపోయే శుభవార్త, ఇకపై అమెరికా నుంచి ఇండియాకు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుకోవచ్చు, వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకున్న గూగుల్ పే

Hazarath Reddy

ఆన్‌లైన్ లావాదేవీలు చేసే వినియోగదారులకు గూగుల్ పే (Google Pay) శుభవార్త చెప్పింది. ఇకపై గూగుల్ పే యాప్‌ వినియోగ‌దారులు అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌ లో ఉండే యూజ‌ర్ల‌కు (US send money to those in India, Singapore) డ‌బ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ క‌ల్పించింది.

Bank Timings in AP: ఏపీలో బ్యాంకింగ్ పనివేళల్లో మార్పులు, ఇకపై ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకే, అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించిన ఎస్‌ఎల్‌బీసీ

Hazarath Reddy

ఏపీలో కరోనా సెకండ్‌ వేవ్, కొనసాగుతున్న కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకింగ్‌ సేవలను మంగళవారం నుంచి సవరిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(SLBC) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్‌ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు (Banking Hours 9 to 12) పరిమితం చేసింది.

Black Fungal Infection: మళ్లీ ఇంకో వైరస్ దాడి..కరోనాకి తోడయిన బ్లాక్‌ ఫంగస్‌, నిర్లక్ష్యంగా ఉంటే కంటి చూపుతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం, మ్యూకోర్‌మైకోసిస్‌ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు ఇవే

Hazarath Reddy

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంటే దానికి తోడుగా బ్లాక్‌ ఫంగస్‌ తయారయింది. కోవిడ్ ను జయించిన పేషెంట్లను (Mucormycosis Infection in COVID-19 Patients) అది చావు దెబ్బ తీస్తోంది. సూరత్‌లో కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ నుంచి కోలుకున్న ఎనిమింది మంది బ్లాక్‌ ఫంగస్‌ (Mucormycosis Infection) సోకి కంటి చూపు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement