సమాచారం
Maharashtra Shakti Bill: ఏపీ దిశ చట్టం తరహాలో..మహారాష్ట్రలో శక్తి బిల్లును తీసుకువచ్చిన ఉద్ధవ్ సర్కారు, మ‌హారాష్ట్ర శ‌క్తి బిల్లు 2020 ద్వారా పోక్సో చ‌ట్టం మ‌రింత క‌ఠిన‌త‌రం
Hazarath Reddyదేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు దీనిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ దిశ ఘటన తర్వాత ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మ‌హిళ‌లు, చిన్నారుల ప‌ట్ల హింస‌ను అదుపు చేసే ఉద్దేశంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ అసెంబ్లీలో (Maharashtra Assembly) శ‌క్తి బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. ఏపీలోని దిశ చ‌ట్టం త‌ర‌హాలో శ‌క్తి బిల్లును (Maharashtra Shakti Bill) రూపొందించారు.
RTGS: గుడ్ న్యూస్..నేటి నుంచి ఎంతైనా నగదు బదిలీ చేసుకోవచ్చు, 24 గంట‌లు ఆర్‌టీజీఎస్ సేవ‌లు అందుబాటులోకి, రూ.2,000గా ఉన్న కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీల పరిమితి రూ.5,000కు పెంపు
Hazarath Reddyడిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహాంలో భాగంగా నేటి నుంచి రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ (RTGS) సేవల్ని ఇక 24 గంటలూ అందుబాటులోకి తెస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు.
Covid in India: కరోనాతో కంటి చూపుకు ముప్పు, ఊపిరితిత్తుల్లోని కణాలపై కోవిడ్ దాడి, వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి, దేశంలో తాజాగా 27 వేల కేసులు నమోదు, కరోనా భయంతో కేరళలో ఆలయం మూసివేత
Hazarath Reddyఉద్యోగులకు కరోనా రావడంతో కేరళలోని ప్రముఖ దేవాలయం గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయం రెండు వారాలపాటు మూసివేయనున్నారు. త్రిస్సూర్‌లో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్‌ అని తేలింది.
Wipro Elite 2021: విప్రోలో ఉద్యోగ అవకాశాలు, ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2021 ని ప్రకటించిన విప్రో, రూ.30 వేల జీతం.. ఉద్యగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyకరోనా సమయంలో భారతదేశానికి చెందిన మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ విప్రో ఉద్యోగ అవకాశాలను (Wipro Elite 2021) కల్పించేందుకు రెడీ అయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు, అలాగే 2021లో ఇంజనీరింగ్ పూర్తి చేయనున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.
Farmers' Protest Updates: మరింత దూకుడుగా.. డిసెంబర్ 14న రైతుల ఆమరణ నిరాహార దీక్ష, 18వ రోజుకు చేరుకున్న కర్షకుల ఉద్యమం, పోరాటంలోకి తీవ్రవాద శక్తులు ప్రవేశించాయని కేంద్రం ఘాటు వ్యాఖ్యలు, తీవ్రంగా ఖండించిన రైతు సంఘాలు
Hazarath Reddyఈ నెల 19వతేదీ లోపు తమ డిమాండ్లకు ఒప్పుకోవాలని, 14న నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష (hunger strike) చేపట్టనున్నట్లు తెలిపారు.
COVID-19 in India: దేశంలో తాజాగా 30,254 కోవిడ్ కేసులు, 1,43,019కు చేరుకున్న మరణాల సంఖ్య, తెలంగాణలో తాజాగా 573 మందికి కరోనా, ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కేసులు
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 30,254 కొత్త కరోనా కేసులు (COVID-19 in India) నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కు (Coronavirus Pandemic) చేరుకుందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనావైరస్ కారణంగా కొత్తగా 391 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,43,019కు (Covid Deaths) చేరుకుందని తెలిపింది.
Gold Missing from CBI Custody: సీబీఐ వద్ద నుంచి 103 కిలోల బంగారం మాయం, మద్రాస్ హైకోర్టులో ఫిర్యాదు చేసిన బ్యాంకులు, విచార‌ణ చేప‌ట్టాల‌ని తమిళనాడు పోలీసులను ఆదేశించిన మద్రాస్ హైకోర్టు
Hazarath Reddyతమిళనాడులో సీబీఐకి వింత అనుభవం ఎదురైంది. 2012 నాటి కేసులో సీబీఐ వ‌ద్ద ఉన్న 103 కిలోల బంగారం మిస్సైన‌ట్లు (Gold Missing from CBI Custody) హైకోర్టులో సీబీఐ మీద ఫిర్యాదు న‌మోదు అయ్యింది.
FICCI Convention 2020: రైతుల ఆదాయం రెట్టింపు కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు, ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక స‌మావేశంలో వర్చువల్ ద్వారా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు (Farm Reform Laws) వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల‌‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Narendra Modi) తెలిపారు. ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక స‌మావేశంలో (FICCI Convention 2020) ప్రధాని వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రసంగించారు.
Farmers' Protest: మెట్టుదిగని ప్రభుత్వం..పట్టు వీడని రైతులు, ఫలించని హోం మంత్రి అమిత్ షా ప్రయత్నాలు, విఫలమైన ఆరో రౌండ్ చర్చలు, నేడు సింఘూ సరిహద్దులో రైతు సంఘాల సమావేశం
Hazarath Reddyడిసెంబర్ 8న భారత్ బంద్ విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయి రైతుల ఆందోళనను విరమించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతు సంఘాలతో అదే రోజు సాయంత్రం ఏడుగంటలకు సమావేశం (Amit Shah's Meeting With Farmer Leaders) ఏర్పాటు చేశారు. అయితే అమిత్ షా ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మెట్టు దిగకపోవడం అలాగే రైతులు పట్టు వీడకోవడంతో బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దయ్యాయి.
What is Swaminathan Report?: స్వామినాథన్ కమిషన్ ఏం చెబుతోంది? జాతీయ రైతుల కమిషన్ సూచనలు ఏమిటి? ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ యొక్క ముఖ్య సిఫార్సులు ఏమిటీ? పూర్తి సమాచారం
Hazarath Reddyరైతులు ఎప్పుడు ఉద్యమాలు, ధర్నాలు చేసినా ముందుగా గుర్తుకు వచ్చేది స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్, గతంలో మధ్యప్రదేశ్ రైతులు ఉద్యమం చేసిన సమయంలోనూ ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న భారత్ బంద్ లోనూ ఎంఎస్ స్వామినాథన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ స్వామినాథన్ నివేదిక గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకీ స్వామినాథన్ నివేదిక అంటే ఏమిటి? రైతులు ఈ నివేదికను అమలు చేయాలని ఎందుకు పట్టబడుతున్నారు. ఈ రిపోర్ట్ లో ఏముంది ఓ సారి చూద్దాం.
Bharat Bandh 2020: రైతుల పోరాటానికి అన్నా హజారే మద్ధతు, ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త, స్వామినాథ‌న్ క‌మిష‌న్ ప్ర‌తిపాదన‌ల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చట్టాల‌ను (agri laws) వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా ఇవాళ భార‌త్ బంద్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. విపక్షాలు సైతం దీనికి మద్ధతు ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా సామాజిక కార్య‌క‌ర్త అన్నా హ‌జారే నిరాహార దీక్ష (Anna Hazare on day-long hunger strike) చేప‌ట్టారు
ITR Filing For 2019-20: డిసెంబర్ 31 చివరి తేదీ, వెంటనే ఐటీఆర్ ఫైల్ చేయండి, లేదంటే రూ. 5 వేల వరకు పెనాల్టీ, 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
Hazarath Reddyడిసెంబర్ 31 లోగా తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ (Income Tax Returns Filing) చేస్తే కనీసం రూ.5,000 వరకు ఆదాయపు పన్ను శాఖ పెనాల్టీ వసూలు చేయనుంది. ఈ ఫైన్ రూ.10,000 వరకు ఉండే అవకాశం ఉంది.
Cyclone Arnab: మళ్లీ ఇంకో తుఫాను దూసుకొస్తోంది, అర్నబ్ తుఫాన్‌గా నామకరణం, హిందూ మహాసముద్రంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అంచనా
Hazarath Reddyబురేవి తుఫాన్ కల్లోలం మరచిపోకముందే మరో తుఫాన్ (Cyclone Arnab) తమిళనాడును మరికొన్ని రాష్ట్రాలను వణికించడానికి రెడీ అయింది. నివర్, బురెవి తుఫాన్లు మిగిల్చిన విధ్వంస పరిస్థితులకు తోడుగా అర్నబ్ తుఫాను (Next Cyclonic Storm) అల్ల కల్లోలం చేయడానికి రెడీ అవుతోంది. హిందూ మహాసముద్రంలో (Indian Ocean) గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలో ఏర్పడుతుందని అంచనా వేస్తోన్న ఈ తుఫాన్‌కు ఆర్నబ్ తుఫాన్‌ అని పేరు పెట్టారు. బంగ్లాదేశ్ ఈ పేరును సూచించింది.
Burevi Cyclone: తమిళనాడును అల్లకల్లోలం చేసిన బురేవి తుఫాను, ఏడు మంది మృతి, మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన తమిళనాడు సీఎం
Hazarath Reddyతమిళనాడు రాష్ట్రాన్ని బురేవి తుఫాను (Burevi Cyclone) వణికించింది. తుఫాను కారణంగా ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. అయితే అనధికార సమాచారం ప్రకారం ఈ సంఖ్య మరింతగా ఉన్నట్లు తెలుస్తోంది. వందలాది గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. వరుసగా రెండు రోజుల పాటు ఈ తుఫాన్ (Cyclone Burevi) తమిళనాడును వణికించింది. కడలూరు జిల్లాలో 300 గ్రామాలు వరదలకు ప్రభావితం కాగా, రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం యొక్క పెద్ద ప్రాంతాల్లో విద్యుత్ పూర్తిగా స్థంభించిపోయింది.
Anil Vij Tests Positive for Covid: వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వచ్చింది, హర్యానా హోంశాఖమంత్రి అనిల్ విజ్‌కు కోవిడ్ పాజిటివ్, భారత్ బయోటెక్ కోవాక్సీన్‌ను తీసుకున్న అనిల్ విజ్
Hazarath Reddyవ్యాక్సిన్ బయటకు వచ్చిందని, కరోనా కంట్రోల్ అవుతుందనే దాని మీద ఆశలు చిగురుస్తున్న సమయంలో నిరాశాకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. భారత్ బయోటెక్ (Bharat Biotech) కోవాక్సీన్‌ను తీసుకున్న హర్యానా హోంశాఖమంత్రి అనిల్ విజ్ (Anil Vij Tests Positive for Covid) తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
Burevi Cyclone: బురేవి తుఫాన్ భయం ఇంకా పోలేదు, దక్షిణ తమిళనాడులో స్థిరంగా కొనసాగుతున్న బురేవి తుఫాన్, ఈ రోజు తీరం దాటే అవకాశం, మూడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyబురేవి తుపాన్‌ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మన్నార్‌ గల్ఫ్‌లో కొనసాగుతున్న బురేవి తుఫాన్‌ (Burevi Cyclone) బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి తమిళనాడులోని (Tamil Nadu) పంబన్‌కు పశ్చిమ నైరుతి దిశలో కొనసాగుతోంది.
Bharat Bandh on Dec 8: డిసెంబర్ 8న భారత్ బంద్, దేశ రాజధానిలో తీవ్ర రూపం దాల్చిన రైతుల ఉద్యమం, కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే రైతుల పోరాటానికి మద్ధతుగా నిలిచిన సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే
Hazarath Reddyమోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు..కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు తమ ఉద్యమాన్ని (Farmers Protest in Delhi) ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ (Bharat Bandh on Dec 8) కార్యక్రమాన్ని రైతులు తలపెట్టారు.
Subh Sukh Chain: సుభాష్ చంద్రబోస్ సుబ్ సుఖ్ చైన్ జాతీయ గీతం కథ ఏమిటి? మన జాతీయ గీతంలో అనవసర పదాలు ఎందుకు అంటున్న సుబ్రహ్మణ్య స్వామి, నేతాజీ Subh Sukh Chain గీతం గురించి ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyరవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన భరోటో భాగ్యో బిధాట (Bharoto Bhagyo Bidhata) అనే బెంగాలీ కవిత ఆధారంగా ఈ పాట రూపొందించబడింది. సుభాష్ చంద్రబోస్ 1943 లో జర్మనీ నుండి ఆగ్నేయాసియాకు మారిన తరువాత, ఆజాద్ హింద్ రేడియోతో రచయిత ముంతాజ్ హుస్సేన్ మరియు ఐఎన్ఎకు చెందిన కల్నల్ అబిద్ హసన్ సఫ్రానీ సహాయంతో ఠాగూర్ యొక్క జన గణ మనను హిందుస్తానీ సుబ్ సుఖ్ చైన్ లోకి తిరిగి వ్రాశారు.
LPG Price Hike: రూ. 50 పెరిగిన సిలిండర్ ధర, డిసెంబర్ 2 నుంచి అమల్లోకి, ఢిల్లీలో రూ.644కు, హైదరాబాద్‌లో రూ.696.5కు చేరిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర
Hazarath Reddyసామాన్యుడిపై మరోసారి అయిల్ కంపెనీలు గుదిబండను (LPG Prices Hiked) మోపాయి.. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. ఇప్పటికే ధరలమోత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మద్య దేశంలో వంట గ్యాస్ భారం కూడా పెరగనుంది.దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను (LPG cylinder prices hiked in December 1) పెంచాయి.
Covid Pandemic: కరోనా తగ్గినా డేంజరేనట, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటు వంటివి వస్తున్నాయంటున్న శాస్త్రవేత్తలు, ఇండియాలో స్పుత్నిక్‌-వి ట్రయల్స్ ప్రారంభం, ఏపీలో తాజాగా 685 మందికి కరోనా
Hazarath Reddyకరోనా నుంచి కోలుకున్న కొందరిలో మళ్లీ ఆరోగ్య సమస్యలు తిరగబెడుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రధానంగా ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ’ రకానికి చెందిన రుగ్మతలు బయటపడుతున్నాయని తెలిపారు.