Information
Cyclone Amphan: ఉగ్రరూపం దాల్చిన అంఫాన్ తుఫాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు భారీ వర్ష ముప్పు, ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నఅంఫాన్‌ తుపాన్‌ (Cyclone Amphan) ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మ. 2.30 గంటలకు అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 930 కిమీ దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,080 కిమీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ నైరుతి దిశగా 1,200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Lockdown 4.0: దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్ పొడగింపు, నేటి నుంచే లాక్‌డౌన్ 4.0 అమలు, నూతన లాక్‌డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఏం మార్పులు జరిగాయో చూడండి
Team Latestlyకంటైన్మెంట్ మరియు రెడ్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో వాహనాలు తిరగవచ్చు. ఇరుగు-పొరుగు రాష్ట్రాలు మరియు యూటీల పరస్పర అంగీకారంతో బస్సులు మరియు ప్రయాణీకుల వాహనాలకు అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఉంటుంది.....
Package Breakup-5: జాతీయ ఉపాధి హామీకి అదనపు నిధులు, రాష్ట్రాలకు రుణ పరిమితి 5 శాతానికి పెంపు, విద్య మరియు ఆరోగ్యంకు భారీ కేటాయింపులు సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ- 5 విడత ప్రకటనల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి
Team Latestlyప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ యొక్క ఐదవ మరియు ఆఖరి భాగాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదివారం ప్రకటించారు. ఈరోజు తన ప్రసంగంలో MGNREGA, ఆరోగ్యం మరియు విద్య, కంపెనీ యాక్ట్ యొక్క డిక్రిమినలైజేషన్ తో పాటు వ్యాపార మరియు వాణిజ్య సంబంధింత కార్యకలాపాల సరళీకరణ....
Economic Package Highlights: రూ.లక్ష కోట్లతో రైతులకు ప్రత్యేక ప్యాకేజి, మూడో విడత ఆర్థిక ప్యాకేజీలో మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టి, వెల్లడించిన కేంద్ర ఆర్థికమంత్రి
Hazarath Reddyకోవిడ్ 19తో కుదేలైన దేశంలోని పలు రంగాలకు ఊతమిచ్చేలా ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడో రోజు ప్రెస్‌మీట్ నిర్వహించారు.మూడో విడత ఆర్థిక ప్యాకేజీలో మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు.తాజాగా రైతులకు రూ.లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు.
Reliance Jio New Plan: రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో
Hazarath Reddyరిలయన్స్‌ జియో తన వినియోగదారులకు మరొక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్న కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను (Reliance Jio New Plan) తీసుకువచ్చింది. రూ.999 తో రీఛార్జ్ (Rs. 999 Prepaid Plan) చేసుకోవడం ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. 84 రోజుల ( 84 Days) వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు.
CM KCR VC Postponed: సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదా, 20 వేల మంది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని తెలిపిన రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదా (CM KCR VC Postponed) పడింది. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులతో నిర్వహించాల్సిన సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదాపడిందని రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రకటించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌ (Pragati Bhavan) నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని నిన్న ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
APSRTC: ఈనెల 16 నుంచి హైదరాబాద్‌కు ఏపీ బస్సులు, స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణ సౌకర్యం, నిబంధనలు అంగీకరిస్తేనే ప్రయాణానికి అనుమతి
Hazarath Reddyలాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చాలామంది చిక్కుకుపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 16న హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు (APSRTC) నడవనున్నాయి. అయితే నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో (Spandana Portal) దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 16వ తేదీ నుంచి ఏపీకి బస్సులు నడపనున్నారు.
AP Coronavirus: కర్నూలులో నేడు జీరో కేసులు నమోదు, ఏపీలో 2157కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య, తాజాగా 57 కోవిడ్19 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో శుక్రవారం తాజాగా మరో 57 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో (COVID 19 in AP) అనంతపురం 4, చిత్తూరు 14, కడప 2, కృష్ణా 9, కర్నూలు 8,నెల్లూరు 14, విజయనగరం 3, విశాఖపట్నం 2, తూర్పు గోదావరి 1 ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని 1252 మంది డిశ్చార్జ్‌ కాగా, 48 మంది మరణించారు.
Cyclone Amphan: బలపడిన అల్పపీడనం, ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, అంఫాన్ తుఫానుతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరిక
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. 16వ తేదీ సాయంత్రం లేదా 17వ తేదీ ఉదయానికి ఇది తుఫాన్‌గా (Cyclone Amphan) మారనున్నది. తొలుత వాయవ్యంగా, తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌ (Cyclonic Storm) మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
Lockdown 4: రాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కేందుకు రెడీ అయినట్లేనా.., రైల్వే స్టేషన్ నుండి ప్రయాణికులను గమ్యానికి చేర్చేందుకు లోకల్ స్పెషల్ బస్సులు, లాక్‌డౌన్ 4.0 కొత్త గైడ్‌లైన్స్ త్వరలో..
Hazarath Reddyదేశ వ్యాప్తంగా క‌రోనా‌వైర‌స్‌ను (Coronavirus) క‌ట్ట‌డి చేసే నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 18వ తేదీ నుంచి నాలుగో ద‌శ లాక్‌డౌన్( Lockdown 4.0) అమ‌లు కానున్న‌ది. ఈ ద‌శ‌లో ఎటువంటి ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తారు, ఎక్క‌డెక్క‌డ స‌డ‌లింపులు ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైల్వే శాఖ రైళ్లను నడిపుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికులు ( train passengers) రైల్వే స్టేషన్ నుండి తమ గమ్య స్థానాలకు చేరాలంటే బస్సులు అనేది చాలా అవసరం.
AP SSC Exams 2020:ఏపీలో జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు, 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించిన ఏపీ ప్రభుత్వం, ప్రతి పేపర్‌కు 100 మార్కులు
Hazarath Reddyకరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పదవ తరగతి పరీక్షలు (AP SSC Exams 2020) వాయిదాపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు (July 10 To 15) నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి.
Free Food grain supply: వలస కార్మికులకు 2 నెలలు ఉచిత భోజనం, 3 పూటల భోజనానికి రూ.3500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి సీతారామన్
Hazarath Reddyదేశవ్యాప్తంగా లాక్డౌన్ మధ్య ఇళ్లకు తిరిగి వస్తున్న వలసదారులకు ఉచిత ఆహార ధాన్యం సరఫరా పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 పరిధిలోకి రాని లేదా రాష్ట్ర లబ్ధిదారుల కార్డును కలిగి ఉన్న వలసదారులు ఉంటారు. అమలు మరియు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తుండగా, ఖర్చును కేంద్రం భరిస్తుందని తెలిపారు.
Stimulus Package 2.0: రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ, రైతులు,వలస కూలీలు,చిన్న వ్యాపారులకు ప్యాకేజీ ద్వారా ఎంతో లబ్ది, 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో ప్యాకేజీని (Stimulus Package 2.0) ప్రకటిస్తున్నారు. నిన్న సుమారు రూ.6 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు రెండో దఫా ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. కాగా మొత్తం రూ.20 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రధాని మోదీ (PM Modi's ₹20 Lakh Cr Package) ప్రకటించిన విషయం విదితమే. అందులో తొలిదశ కింద ఎంఎస్ఎంఈలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి సాయం ప్రకటించారు. ఈ రెండో విడత ప్యాకేజి వలస కార్మికులు, వీధుల్లో విక్రయాలు సాగించేవాళ్లకు, సన్నకారు రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తుందని వివరించారు.
IRCTC Tickets Alert: లాక్‌డౌన్‌కు ముందు తీసుకున్న టికెట్లు రద్దు, జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ, పూర్తి నగదు వాపస్
Hazarath Reddyలాక్‌డౌన్‌కు ముందు తీసుకున్న అడ్వాన్స్‌ టిక్కెట్లు అన్నీ రద్దవుతాయని (Indian Railways Cancels All Tickets) రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జూన్ 30 వరకు ( June 30, 2020) ప్రయాణానికి తీసుకున్న టిక్కెట్లన్నీ రద్దవుతాయని తెలిపింది. జూన్ 30 లేదా అంతకుముందు ప్రయాణానికి మార్చి 25 లోపు బుక్ చేసుకున్న అన్ని రైలు టిక్కెట్లు (IRCTC Tickets) రద్దు అవుతాయని, వినియోగదారులకు పూర్తి నగదు వాపసు ఇవ్వనున్నట్లు వివరించింది.
English Medium in Public Schools: ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం
Hazarath Reddyఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం (English Medium in AP) అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి.
Income Tax Return 2019-20: ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు శుభవార్త, ఐటీ రిటర్న్ 2019-20 గడువు నవంబర్ వరకు పొడిగింపు, టీడీఎస్ రేట్లు 25 శాతం తగ్గింపు
Hazarath Reddyఆదాయపు పన్ను దాఖలు (ఐటిఆర్) దాఖలు 2019-2020 గడువును (Income Tax Return 2019-20) నవంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 3 నుండి అక్టోబర్ 31 వరకు పన్ను ఆడిట్ గడువును పొడిగించింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) మాట్లాడుతూ.. చారిటబుల్ ట్రస్టులు,స్వచ్చంధ సంస్థలు, సహకార సంఘాలకు పెండింగ్ రీ ఫండ్స్ సత్వరమే చెల్లించనున్నట్టుగా కేంద్రం తెలిపింది.
Rs 20 Lakh Crore Package: ఎంఎస్‌ఎంఈలకు కొత్త అర్థం,ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు, రూ. 20 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే
Hazarath Reddyసూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) నిర్వచనం (New Definition of MSMEs) మారింది.నూతన నిర్వచనం ప్రకారం రూ. కోటి పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 5 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మైక్రో ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదే రూ. 10 కోట్ల పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 50 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది స్మాల్‌ ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదేవిధంగా రూ. 20 కోట్ల పెట్టుబడితో ఉన్న సంస్థ రూ. 100 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మీడియం ఎంటర్‌ప్రైస్‌గా కేంద్ర ఆర్థికమంత్రి (FM Nirmala Sitharaman) పేర్కొన్నారు.
Atma Nirbhar India: ప్రధాని మోదీ 'ఆత్మ నిర్భర్' గుట్టు విప్పిన కేంద్ర ఆర్థికమంత్రి, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంటే స్వయం ఆధారిత భారతం, ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్
Hazarath Reddyఐదు మూల సూత్రాల ఆధారంగా 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' (Atamanirbhar Bharat Abhiyan) ప్రకటనను మోదీ చేశారని తెలిపారు. ఆ ఐదు సూత్రాలు... ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, గిరాకీ అని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే... స్వయం ఆధారిత భారతం అని అర్థమని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కు సంబంధించిన వివరాలను రోజుకొకటి వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఈరోజు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రకటిస్తున్నామని తెలిపారు.
FM Nirmala Sitharaman PC: చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల కేటాయింపు, నగదు లభ్యత పెంచడమే ప్యాకేజీ లక్ష్యం, ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 సహాయక చర్యలు
Hazarath Reddyప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై (Rs. 20 Lakh Crore) పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman on Economic Package) ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.
Vocal for Local: మేడ్ ఇన్ ఇండియా, పారామిలిటరీ క్యాంటిన్లలో ఇకపై స్వదేశీ వస్తువులే వాడాలి, కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం, జూన్ 1 నుంచి అమల్లోకి
Hazarath Reddyకేంద్ర బ‌ల‌గాల‌కు చెందిన క్యాంటీన్ల‌లో ( Central Armed Police Forces) కేవ‌లం స్వదేశీ వ‌స్తువుల‌ను (Vocal for Local) మాత్ర‌మే అమ్మ‌నున్న‌ట్లు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌.. క్యాంటీన్ల‌లో ఇక నుంచి కేవ‌లం మ‌న దేశంలో త‌యారైన వ‌స్తువుల‌ను అమ్మ‌ాలని హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) తెలిపారు.