సమాచారం

Budget 2020: ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీగా నిధులు, SC, OBCలకు కలిపి రూ.85 వేల కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 53 వేల 700 కోట్లు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రూ.9 వేల 500 కోట్లు

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్‌ 2020 - 2021 (Union Budget 2020) సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు రంగాలకు కేటాయింపులు జరిపారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌ 2020-21లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Union Budget 2020: ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్, భారత నెట్‌‌కు రూ.6 వేల కోట్ల కేటాయింపు, లక్ష గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ, బడ్జెట్ 2020 డిజిటల్ మెరుపుల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

దేశంలో సాంకేతిక రంగంలో ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా టెక్నాలజీ (Technology) రంగంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) ఫోకస్ పెట్టింది. 2020 కేంద్ర బడ్జెట్ లో(Union Budget 2020) టెక్నాలజీ రంగానికి చేయూతనిచ్చేలా లక్ష గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టవిటీని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా భారత నెట్‌ కు 2020-21 బడ్జెట్ లో (Budget 2020) రూ.6వేల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.

Budget 2020: పన్ను చెల్లింపుదారులకు ఊరట, తగ్గిన ఆదాయపు పన్ను రేట్లు, కొత్తగా వచ్చిన పన్నురేట్ల గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్ 2020 ప్రసంగంలో వ్యక్తిగత పన్నుల ముందు కొత్త ఆదాయపు పన్ను (Income Tax) స్లాబ్‌లు మరియు రేట్లను ఎఫ్‌ఎం నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టారు. పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. ముఖ్యంగా ఉద్యోగులకు (employees) కొత్త ఆదాయపు పన్ను రూల్స్ ద్వారా ప్రయోజనం కలగనుంది. ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో (Budget 2020) ఆదాయపు పన్ను స్లాబుల్లో పలు మార్పులు చేసింది.

Budget 2020: బడ్జెట్ అంటే ఏమిటి, తొలి బడ్జెట్‌ని ఎవరు ప్రవేశపెట్టారు, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, బడ్జెట్ అమల్లోకి రావాలంటే ఎవరి ఆమోదం ఉండాలి, బడ్జెట్ గురించి విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

ఓ రాష్ట్రం, లేక దేశంలో ఉన్న మొత్తం ప్రజల ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగాలంటే బడ్జెట్ (Budget) అనేది చాలా అవసరం. బడ్జెట్ వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు నిధుల కేటాయింపులతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించుకునే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంత ఆదాయం రావొచ్చు.. ఇంత మొత్తంలో ఖర్చులు ఉండొచ్చు అని ముందుగా లెక్కలు వేయడాన్ని బడ్జెట్‌ అని చెప్పుకోవచ్చు.

Advertisement

Arvind Krishna To Lead IBM: ఐబీఎం సీఈఓగా మనోడే, ఐబీఎంని ముందుకు నడిపించనున్న అరవింద్‌ కృష్ణ, ఐబీఎం నూతన సీఈఓ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

Hazarath Reddy

ప్రపంచంలోని ప్రముఖ సంస్థల ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారత సంతతి వ్యక్తులు సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ),(Microsoft CEO Satya Nadella) సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ సీఈఓ),(Google and Alphabet CEO Sundar Pichai) అజయ్ బంగా (మాస్టర్ కార్డు సీఈఓ),(MasterCard CEO Ajay Banga) శంతను నారాయణన్ (అడోబ్ సీఈఓ)ల (Adobe CEO Shantanu Narayen) సరసన మరొక భారతీయుడు చేరారు. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారతీయుడు అరవింద్ కృష్ణ(57)ను(Arvind Krishna) డైరెక్టర్ల బృందం ఎంపిక చేసింది.

Onions At Rs 22-23 Per KG: ఇరవై రెండు రూపాయలకే కేజీ ఉల్లి, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, పోర్టుల వద్ద మిగిలిపోయిన స్టాక్‌ను క్లియర్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని కిలో రూ. 22 నుంచి రూ. 23కే రాష్ట్రాలకు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. ప్రస్తుతం ఇలా దిగుమతి చేసుకున్న ఉల్లిని కేంద్రం రూ. 58కి అమ్ముతోంది. అయితే ఈ ధర మీద రాష్ట్రాలు ఉల్లి పాయలను కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తాజాగా ఉల్లి పంట చేతికి రావడం, రుచిలో దేశీయ ఉల్లి బాగుండటమే.

Child Pornography Cases: 25 వేల చైల్డ్ పోర్న్ వీడియోలు, గత అయిదు నెలల్లో ఇండియాలో సోషల్ మీడియాలో అప్‌లోడ్, భారత్‌ను అలర్ట్ చేసిన అమెరికా, ఎక్కువగా ఆ అయిదు రాష్ట్రాల్లోనే..

Hazarath Reddy

దేశంలో పోర్న్ నిషేధం (Potn Ban) విధించినప్పటికీ వాటిని చూసే వీక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక వీక్షకుల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు వాటిని సోషల్ మీడియాలో (Social Media) అప్‌లోడ్ చేసే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇండియాకు అలర్ట్ మెసేజ్ (US alert for India) జారీ చేసింది. అశ్లీల వీడియోలను వీక్షించడం, పోర్న్ సమాచారాన్ని చదవడం భారత్ లో ఆందోళనకర స్థాయికి చేరిందని అమెరికా తెలిపింది. సోషల్ మీడియాలో పోర్న్ మెటీరియల్ ను అప్ లోడ్ చేయడం కూడా భారీగా పెరిగిందని తెలిపింది

Two Days Bank Strike: రెండు రోజులు బ్యాంకులు బంద్, వేతనాల సవరణ కోసం రోడ్డెక్కుతున్న బ్యాంకు ఉద్యోగులు, జ‌న‌వరి 31, ఫిబ్ర‌వరి 1వ తేదీన దేశ వ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్న యూనియన్లు

Hazarath Reddy

మ వేత‌నాల‌ను స‌వ‌రించాలంటూ దేశ‌వ్యాప్తంగా బ్యాంకుల్లో ప‌ని చేస్తు‌న్న ఉద్యో‌గులు ( Bank Employees) స‌మ్మె‌కు దిగుతుండ‌టంతో రెండు రోజుల పాటు బ్యాంకులు (Bank Strike) మూత‌ప‌డనున్నాయి. వేత‌నాల పెంపుపై ప్ర‌ధాన కార్మి‌క క‌మిష‌నర్‌తో తాజాగా ఉద్యో‌గ సంఘాలు జ‌రిపిన చ‌ర్చలు విఫ‌ల‌మ‌య్యా‌యి. ఈ నేపథ్యంలో జ‌న‌వరి 31, ఫిబ్ర‌వరి 1వ తేదీన స‌మ్మె‌ చేస్తు‌న్న‌ట్లు బ్యాంకు సంఘాలు ప్ర‌క‌టించాయి.

Advertisement

Republic Day 2020: ఢిల్లీలో అదరహో అనిపించిన తెలుగు రాష్ట్రాల శకటాలు, అబ్బురపరిచిన భారత సైనికుల విన్యాసాలు, రాజ్‌పథ్ వద్ద అంబరాన్ని తాకిన భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు, ఢిల్లిలో జరిగిన రిపబ్లిక్ డే 2020 పరేడ్‌పై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) 71వ గణతంత్ర వేడుకలు ( India Republic Day 2020) ఘనంగా జరుగుతున్నాయి. భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు రాజ్‌పథ్ (Rajpath) వద్ద అంబరాన్ని తాకుతున్నాయి. కాగా రాజ్‌పథ్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Padma Awards 2020: తెలుగు రాష్ట్రాలకు 5 పద్మ అవార్డులు, ఏడు మందికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118మందికి పద్మ శ్రీ అవార్డులు, భారత గణతంత్ర దినోత్సవం రోజున పురస్కారాలు అందుకున్న వారి మొత్తం లిస్ట్ ఇదే

Hazarath Reddy

71వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు (71st Republic Day) కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను (Padma Awards) నేడు అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషణ్, (Padma Vibhushan) 16 మందికి పద్మ భూషణ్,(Padma Bhushan) 118మందికి పద్మ శ్రీ అవార్డులు (Padma Shri Awards) ప్రకటించారు.

India Republic Day 2020: భారత గణతంత్ర దినోత్సవం, ఇండియా వైభవాన్ని విశ్యవ్యాప్తం చేసిన గూగుల్ డూడుల్, తాజ్‌మహల్ నుండి ఇండియా గేటు వరకు..,జాతీయ పక్షి నుండి వస్త్రాలు మరియు నృత్యాలు వరకు..

Hazarath Reddy

ఈ రోజు భారత భారత గణతంత్ర దినోత్సవం (Republic Day) . దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం నుంచే అన్ని రాష్ట్రాల్లో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. సోషల్ మీడియాలో (Social Media) ప్రజలు ఒకరి కొరకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. జాతీయ జెండాకు, సైనికులకు వందనాలు సమర్పిస్తున్నారు.

Good News For Travellers: ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌‌, 2022 నాటికి దేశంలో 15 ప్రదేశాలు చుట్టేస్తే మీ ఖర్చులన్నీ ఉచితం, భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా నియామకం

Hazarath Reddy

టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం (Union Government) అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పర్యాటన్‌ పర్వ్‌ (Paryatan Parv) కార్యక్రమంలో భాగంగా ఎవరైనా 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో (15 Domestic Destinations per year) పర్యటిస్తే వారి ఖర్చుల పర్యాటక మంత్రిత్వ శాఖ (Ministry of Tourism) భరిస్తుంది.

Advertisement

Republic Day: మీ దేశ భక్తికి సలాం.., 71 వేల టూత్ పిక్‌లతో జాతీయ జెండా, వినూత్నంగా ఆలోచించిన అమృత్ సర్‌ గవర్నమెంట్ స్కూల్ టీచర్ బల్జీందర్ సింగ్,సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

Hazarath Reddy

యావధ్బారతం 71 వ భారత గణతంత్ర దినోత్సవాన్ని (71st Republic Day) జరుపుకునేందుకు సిద్ధం అయింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా ప్రతీ ఏడాది జనవరి 26 న దీన్ని జరుపుకుంటారు. 1950 జనవరి 26 న భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారనే విషయం అందరికీ తెలిసిందే..

Coronavirus Outbreak: డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్, వైద్యం చేస్తూ డాక్టర్ మృతి, ఇప్పటికే చైనాలో 1300 కేసులు, 41 మంది మృతి, ఇండియాకు పాకిన కరోనా వైరస్

Hazarath Reddy

చైనాలోని (China) వుహాన్‌ పట్టణం (Wuhan) నుంచి విస్తరించిన కరోనావైరస్‌ (Coronavirus) ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఏకంగా వైద్యం చేస్తున్న డాక్టర్ల ప్రాణాలనే అటాక్ చేస్తోంది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స చేయడంలో ముందంజలో ఉన్న చైనా హుబీ ప్రావిన్స్‌లోని ఒక సీనియర్ వైద్యుడు ఈ వైరస్ సోకి మరణించాడు.

AP Legislative Council: ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి..?,దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఉంది, ఎన్ని చోట్ల రద్దైంది..?,ఏపీ శాసనమండలి ఎప్పుడు ప్రారంభమైది,దాని చరిత్ర ఏమిటీ..? ఆంధ్రప్రదేశ్ శాసనమండలిపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లు, అలాగే ఇతర బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా ఏపీ శాసనమండలిలో అవి ఆమోదం పొందలేదు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీ‌ఏ బిల్లును ఏపీ శాసనమండలి వ్యతిరేకించడమే కాకుండా దాన్ని సెలక్ట్ కమిటీకి పంపాల్సిందిగా శాసన మండలి ఛైర్మెన్ ఎంఎ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు.

One Nation,One Ration Card: కేంద్రం సంచలన నిర్ణయం, ‘జూన్ 1 నుంచి వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ అమల్లోకి, 12 రాష్ట్రాలలో ఎక్కడైనా రేషన్ పొందవచ్చు, డిసెంబర్ 30, 2020 లోపు దేశ వ్యాప్తంగా అమల్లోకి..

Hazarath Reddy

రేషన్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’(One Nation, One Ration Card) పథకాన్ని జూన్ 1, 2020 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ (Union Minister Ram Vilas Paswan)సోమవారం ప్రకటించారు.

Advertisement

TTD Free Laddu: అదనపు లడ్డు కోసం రూ.50 చెల్లించాల్సిందే, నేటి నుంచి ప్రతీ భక్తుడికి ఉచితంగా ఒక లడ్డు, భక్తులకు కావాల్సినన్ని లడ్డులు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు, నేటి అర్ధరాత్రి నుంచి కొత్త విధానం అమల్లోకి

Hazarath Reddy

తిరుమలను సందర్శించుకున్న ఎవరైనా... శ్రీ వేంకటేశ్వర స్వామి(Lord Venkateswara) లడ్డును తీసుకోకుండా వెనుతిరగరు. భక్తులకు ఇప్పుడీ లడ్డు మరింత చేరువైంది. ఇప్పటివరకు లడ్డూలను రాయితీపై కొనుక్కోవాల్సి వచ్చేది. ఇక అలా అవసరం లేదు. రాయితీ లడ్డూ విధానానికి నేటితో తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) స్వస్తి పలకనుంది.

Jammu And Kashmir: ఎన్నాళ్లో వేచిన నిమిషం, 5 నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన ఇంటర్నెట్ సేవలు, ఆర్టికల్‌ 370 రద్దుతో మూగబోయిన ఫోన్లు, సుప్రీంకోర్టు అభ్యంతరాలతో అక్కడ తొలగిపోతున్న ఆంక్షలు

Hazarath Reddy

జమ్మూకాశ్మీర్ ( Jammu and Kashmir)ప్రజలు ఇప్పుడు ఎన్నాళ్లో వేచిన ఉదయానికి బదులుగా ఎన్నాళ్లో వేచిన నిమిషం అంటూ మొబైల్ ఫోన్లతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు(Article 370) తర్వాత మూగబోయిన ఇంటర్నటె్ సేవలు ఇప్పుడు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.ల్యాండ్‌లైన్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతులివ్వగా.. 5 నెలల తర్వాత శనివారం కశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను పునరుద్ధరించారు.

Manoj Shashidhar: కొత్త బాస్ వచ్చేశాడు, సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్, 1994 గుజరాత్ కేడర్‌ ఐపీఎస్ అధికారి, అయిదేళ్లపాటు పదవిలో కొనసాగనున్న మనోజ్ శశిధర్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ

Hazarath Reddy

సీబీఐ జాయింట్ డైరెక్టర్ (CBI Joint Director) గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్(Senior IPS officer Manoj Shashidhar) నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్ కేడర్(Gujarat)కు చెందిన అధికారి. ఈ పదవిలో మనోజ్ శశిధర్ అయిదేళ్ళపాటు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళకు చెందిన మనోజ్ గుజరాత్‌లో ఐపీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, (PM Modi) అమిత్ షాలకు(Amit Shah) ఆయన అత్యంత సన్నిహిత అధికారిగా కూడా పేరు ఉంది.

Novel Corona Virus: చైనా నుంచి మరో ప్రమాదకరమైన వైరస్, ఆ దేశానికి వెళ్లవద్దని కేంద్రం హెచ్చరిక, ఇప్పటికే చైనాలో 41 మందికి సోకిన వైరస్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

చైనా ( China) పర్యటనకు వెళ్లే భారతీయులకు(Indians) కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశంలో ఇప్పుడు కొత్త వైరస్ (New virus) ఒకటి వ్యాప్తి చెందుతోందని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వీలయితే ఆ దేశ పర్యటన రద్దు చేసుకోవాలని కోరింది. ఇప్పుడు చైనాలో ప్రమాదకర ‘నావల్‌ కరొనా’ వైరస్‌ (novel corona virus) వ్యాప్తి చెందుతోంది.

Advertisement
Advertisement