వార్తలు
Vijayawada Floods: కన్నీరు తెప్పిస్తున్న వీడియో, వరద నీటిలో శవమై తేలిన 14 ఏళ్ల బాలుడు,విజయవాడలో కన్నీటి దృశ్యాలు
Arun Charagondaవరద నుండి ఇప్పుడిప్పుడే విజయవాడ బయటపడుతోంది. ఇక సహాయక చర్యల్లో భాగంగా హృదయ విదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్తుండగా కొడుకుని తలుచుకుని రోదిస్తున్న ఆ తల్లి బాధ మాటల్లో చెప్పలేదని. ఈ దృశ్యాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.
Nandigam Suresh Arrest: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaవైసీపీ నేత, మాజీ ఎంపి నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైదరాబాద్‌లో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మంగళగిరికి ఆయన తరలించారు.
Teachers Day Wishes In Telugu 2024: టీచర్స్ డే సందర్భగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక రోజున శుభాకాంక్షలను పంపడం ద్వారా మీ గురువుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సమయం ఆసన్నమైంది.
Teacher's Day 2024 Wishes In Telugu: మీ స్నేహితులు, గురువులకు టీచర్స్ డే సందర్భంగా మంచి స్ఫూర్తి వంతమైన గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888న ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించారు. మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో చదువు పూర్తి చేశారు. డాక్టర్ కృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన బీజేపీ, సీఎం నయాబ్ సింగ్ సైనీ పోటీ చేసేది ఇక్కడి నుంచే!
VNSహర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) కోసం 67 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం నయాబ్ సింగ్ సైనీ (CM Nayab Singh Saini ) పేరు కూడా ఉంది. ఆయనకు లాద్వా (Ladwa) అసెంబ్లీ టికెట్‌ను కేటాయించారు. మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎంగా ఉన్న టైంలో కురుక్షేత్ర ఎంపీగా నయాబ్ సింగ్ సైనీ ఉండేవారు.
Sukanya Samriddhi Yojana update: సుకన్య సమృద్ది యోజన అకౌంట్ దారులకు అలర్ట్! కొత్త రూల్స్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఈ ఖాతాలను వెంటనే మార్చకపోతే ఇబ్బందులు తప్పవు
VNSనిబంధనలకు అనుగుణంగా లేని పొదుపు ఖాతాలను (Savings Account) క్రమబద్ధీకరించడానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.
Vijay Sethupathi to Host Bigg Boss Tamil Season 8: బిగ్ బాస్ 8 హోస్ట్ గా విజయ్ సేతుపతి, కొత్త ప్రోమో చూశారా? కమల్ హాసన్ ను రీప్లేస్ చేసిన విలక్షణ నటుడు
VNSబిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు (Bigg boss 8 tamil) రంగం సిద్ధమైంది. అదేంటి? ఆల్‌రెడీ మొదలైంది అంటారా! అవును, తెలుగులో మూడు రోజుల క్రితమే లాంచ్ అయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ బిగ్‌బాస్ గురించి! అక్కడ కూడా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ షురూ కానుంది
Central Govt Committee: ఏపీలో వరదలపై సాయానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం, రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర కమిటీ, అమిత్ షా ట్వీట్
VNSవిజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Shah) తెలిపారు.
YS Jagan Comments on Chandrababu: కరకట్ట దగ్గర ఇళ్లు మునిగింది కాబట్టే..చంద్రబాబు కలెక్టరేట్ లో ఉంటున్నారు! సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ జగన్
VNSవిజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు (Chandra Babu) ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.
MK Stalin Rides Bicycle: అమెరికాలో స్టాలిన్ సైకిల్ సవారీ వీడియో వైరల్, చెన్నైలో మనిద్దరం ఎప్పుడు సైకిల్ తొక్కుదామంటూ రాహుల్ గాంధీ రిప్లై, తమిళనాడు సీఎం ఏమన్నారంటే..
Hazarath Reddyఅమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin).. షికాగో సరస్సు తీరంలో సైకిల్ తొక్కుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వెంటనే స్పందించారు
No Pension for MLAs Who Defect: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇకపై నో పెన్సన్, కీలక బిల్లును తీసుకువచ్చిన హిమాచల్ ప్రభుత్వం, సభలో చర్చ అనంతరం బిల్లు ఆమోదం
Hazarath Reddyఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ (Pension Cut) సదుపాయాన్ని నిలిపివేస్తూ బిల్లును తీసుకువచ్చింది.
PM Modi Plays Drum: వీడియో ఇదిగో, సింగపూర్‌లో డోలు వాయించిన ప్రధాని నరేంద్ర మోదీ, అన్నయ్యా అంటూ రాఖీ కట్టిన మహిళ
Hazarath Reddyప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు బ్రూనై పర్యటనను ముగించుకొని సింగపూర్ (Singapore) వెళ్లారు. సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది.
Telangana: కేసీఆర్ కనబడుట లేదు, ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత ఎక్కడంటూ పోస్టర్లు వైరల్
Hazarath Reddyకేసీఆర్ కనబడుట లేదని తెలంగాణలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. రెండు సార్లు అధికారం ఇచ్చినా... ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే బయటకు రాని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లు.రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Godavari Water Level Rises: వీడియో ఇదిగో, గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద ఉధృతి
Hazarath Reddyతుఫాను ప్రభావం వలన ఎగువ రాష్ట్రాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం బుధవారం సాయంత్రానికి పెరుగుతూ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువన 31.770 మీటర్ల నీటిమట్టం, స్పిల్ వే దిగువన 23.100 మీటర్ల నీటిమట్టం నమోదయింది.
Vijayawada Floods: అటు కృష్ణానది, ఇటు బుడమేరు కలిసి విజయవాడను ముంచేశాయి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyరాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదిలో అదనంగా 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని అన్నారు.
Devara Daavudi Video Song: దేవర నుంచి దావూదీ వీడియో సాంగ్ ఇదిగో, పోటీపడి మరీ డ్యాన్స్ వేసిన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్
Vikas Mమేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ప్రకటించిన ప్రకారం దావూదీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ పాటలో తారక్, జాన్వీకపూర్ పోటీపడి మరీ డ్యాన్స్ చేసినట్లు వీడియో సాంగ్ చెబుతోంది.
Pune Shocker: వీడియో ఇదిగో, రద్దీగా ఉండే రోడ్డులో వ్యక్తిపై కర్రతో దారుణంగా దాడి, వ్యక్తిగత శత్రుత్వమే కారణమని తెలిపిన పోలీసులు
Hazarath Reddyమహారాష్ట్రలోని పూణెలో రద్దీగా ఉండే రోడ్డుపై దాడి చేయడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబరు 4న విడుదలైన వీడియోలో వాహనాలు వెళుతుండగా రోడ్డు పక్కనే ఓ వ్యక్తిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా వ్యక్తిగత శత్రుత్వమే దాడికి పాల్పడి ఉండొచ్చని తెలిపారు
Flood Relief Efforts: వరద బాధితులకు అండగా ప్రభాస్, ఏకంగా రూ.2 కోట్ల విరాళం, తెలుగు ప్రజల కోసం కదలి రావాలన్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
Arun Charagondaభారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో తమవంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటివరకు పలువురు హీరోలు, హీరోయిన్స్, దర్శకులు విరాళాన్ని అందజేశారు.
Telugu States Rains: వరద బాధితులకు సోనూసూద్ సాయం, ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఆంధ్రా, తెలంగాణ ప్రజలు నా కుటుంబం సార్ అంటూ బదులిచ్చిన సోనూ
Hazarath Reddyఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు. దానికి సోనూ సూద్ రిప్లయి ఇస్తూ.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలే నా కుటుంబం సార్. మీ మార్గదర్శకత్వంలో మేము వారి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము
IPL 2025: మళ్లీ ఐపీఎల్‌లోకి రాహుల్ ద్రావిడ్, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రావిడ్
Arun Charagondaమిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ కోచ్ అవతారం ఎత్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇటీవలె ద్రావిడ్ భారత హెడ్ కోచ్ పదవి కాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీతో ఒప్పందం చేసుకున్నారు ద్రావిడ్.